Rajivsarma
-
రూ.2,739.99 కోట్లివ్వండి
కేంద్ర బృందాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి,హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో రాష్ట్రం భారీగా నష్టపోయిందని.. పునరావాసం, పునరుద్ధరణ చర్యల కోసం రూ.2,739.99 కోట్ల కేంద్ర సహాయాన్ని అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలు, పునరుద్ధణ చర్యలకు కావాల్సిన కేంద్ర సహాయంపై నివేదికను సిద్ధం చేసిం ది. ఆదివారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందానికి ఈ నివేదిక సమర్పించనుంది. గత సెప్టెంబర్ 21-27 మధ్య భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేం దుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఆరుగురు అధికా రుల బృందం 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. సీఎస్ రాజీవ్‌శర్మ.. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలసి ఆది వారం ఈ బృందంతో సమావేశమై వర్షాల వల్ల కలిగిన నష్టాలను నివేదిస్తారు. జాతీయ విపత్తుల సహాయ నిధి కింద రూ.1,118.21 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం మరో రూ.1,621.28 కోట్లు కలిపి మొత్తంగా రూ.2,739.99 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరనున్నారు. మూడు బృందాల పర్యటన.. దిలీప్‌కుమార్ నేతృత్వంలోని ఆరుగురు అధి కారులు మూడు బృందాలుగా విడిపోరుు కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరా బాద్, వికారాబాద్, కామారెడ్డి, నిజామా బాద్ జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎ.కృష్ణప్రసాద్, కేంద్ర ఆరుుల్ సీడ్ డెవలప్మెంట్ విభాగం డెరైక్టర్ ఎస్కే కొల్హాట్కర్, జల వనరుల శాఖ గోదావరి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఓఆర్కే రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఆర్బీ కౌల్, కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జుగదీశ్ కుమార్ ఈ బృందాల్లో ఉన్నారు. -
పక్షంలోగా సచివాలయం తరలింపు
-
పక్షంలోగా సచివాలయం తరలింపు
సిద్ధంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. ‘కార్తీక మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి పునాదిరాయి వేసే అవకాశాలున్నందున అందుకు సిద్ధంగా ఉండాలి. మరో 10-15 రోజుల్లో అన్ని శాఖలు సచి వాలయంలోని ఆఫీసులను తాత్కాలిక భవనాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయం తరలింపు, కొత్త సచివాలయం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎస్ సారథ్యంలో ఉండే ఈ కమిటీలో స్పెషల్ సీఎస్‌లు ప్రదీప్‌చంద్ర, ఎంజీ గోపాల్, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, అజయ్ మిశ్రాలతోపాటు జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి. సచివాలయం తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై వీరితో సీఎస్ ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుత సచివాలయంలోని 31 విభాగాలు, 270 సెక్షన్లలో దాదాపు 1,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇక్కడున్న ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు, విభాగాలన్నీ తాత్కాలికంగా ఇతర భవనాలకు తరలించాల్సి ఉంది. సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో వీలైనన్ని ఆఫీసులను సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించుకుంది. 31 విభాగాల్లో 22 విభాగాలను బీఆర్కే భవన్‌కు తరలించి మిగతా 9 విభాగాలను సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు వీలుగా 4.98 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని, అంత స్థలం బీఅర్కే భవన్లో అందుబాటులో ఉందని అంచనా వేశారు. వ్యవసాయ, అటవీ, గృహ నిర్మాణం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ప్రణాళిక విభాగాలను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసులకు తరలించనున్నారు. వీటికి 88 వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుందని, సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసుల్లో తాత్కాలికంగా వాటిని ఉంచే వీలుందని అధికారులు అంచనా వేశారు. ఏపీ అంగీకారం తర్వాతే.. ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తీర్మానం పంపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం పొందటమే తరువాయి సచివాలయం తరలింపునకు అధికారికంగా ఏర్పాట్లు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవనాలు అప్పగించే తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు పంపాకే గవర్నర్ నిర్ణయం వెలువడనుంది. ఏపీ మంత్రివర్గం సమావేశమై భవనాల అప్పగింత అంశంపై నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉం టుందని.. ఆ తర్వాతే గవర్నర్ ఆమోదముద్ర పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించాలి
వివిధ శాఖల అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ీసీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వర కు బతుకమ్మ నిర్వహిం చనుండటంతో శని వారం ఆయన అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు. పండుగ ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేస్తోందని, అక్టోబర్ 6న ఆరు వేల మంది మహిళలతో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మను నిర్వహించాలన్నారు. 9న ఊరేగింపుగా బతుకమ్మ అడుతూ వచ్చి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తారని, దీనికి ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో బతుకమ్మ నిమజ్జనానికి చెరువులను సిద్ధం చేయాలన్నారు. నగరంలోని ప్రధాన హోటళ్ల వద్ద సంబరాలకు గుర్తుగా బతుకమ్మలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి పేర్కొన్నారు. సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో తొలి రోజే ట్రెజరీలు
జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసులకు అవసరమైన భవనాలను గుర్తించి, అవసరమైన ఫర్నీచర్‌ను సమకూర్చాలని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తొలిరోజు నుంచే ట్రెజరీ అకౌంట్లను ప్రారంభించి, ట్రెజరీ కార్యాలయాలు పని చేసేలా చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసేటప్పుడు పదోన్నతులకు సంబంధించి పాత సీనియారిటీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాని ఆధారంగానే పదోన్నతులు వస్తాయని ప్రకటించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, సీనియారిటీ, పోస్టుల సంఖ్య వివరాలను వెంటనే పంపించాలని ఆదేశించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమ పద్ధతిలో ఆయా జిల్లాలకు అందించాలని చెప్పారు. ఫైళ్ల వివరాలను నమోదు చేయడానికి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సూచించారు. కొత్త జిల్లాలకు కావాల్సిన ఉద్యోగులు, ఫర్నీచర్, ఫైళ్లు, వసతి సదుపాయాలు తదితర అంశాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రాజకీయ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. -
వచ్చే ఏడాదికీ ప్రణాళికలు
హరితహారంపై సమీక్షలో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి,హైదరాబాద్: హరితహారం లక్ష్యాలను సాధించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టర్లతో జరిపిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. వచ్చే ఏడాదికి కూడా ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకొని మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు అవసరమైన నిధుల వివరాలను నెలవారీగా పంపాలని కోరారు. మొక్కలు నాటిన ప్రాంతాలకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి మొక్కను జియో రిఫరెన్సింగ్ ద్వారా ట్యాగ్ చేయాలన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో వెంటనే మొక్కలు నాటాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. భూసేకరణ వేగిరం చేయండి రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని, ఇబ్బంది తలెత్తితే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రైల్వే, జాతీయరహదారుల విస్తరణపై ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, రైల్వే, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రమంతా పచ్చని పండుగ
- సీఎం, మంత్రులు, ప్రజాప్ర తినిధులంతా హరితహారంలోనే - తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలు 75 లక్షలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పచ్చని పండుగ ప్రారంభమైంది. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఇతర ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి సచివాలయంలో మొక్కలు నాటారు. ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ డీజీపీ కార్యాలయంలో మొక్కలు నాటారు. జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు హరితహారంలో పాల్గొన్నారు. రెండో విడత హరితహారం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండువారాల్లో రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించగా.. శుక్రవారం ఒక్కరోజే సుమారు 75 లక్షల వరకు మొక్కలు నాటినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 25 ప్రభుత్వ శాఖలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నేపథ్యంలో జిల్లాల వారీగా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది. జాతీయ రహదారి వెంట మొక్కల జాతర హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దు వరకు సుమారు 163 కిలోమీటర్ల మేర సుమారు 1.25 లక్షల మొక్కలు నాటారు. విద్యార్థులు, యువతీయువకులు, రైతులు, కూలీలు, వివిధ పార్టీల కార్యకర్తలతో పాటు రహదారి వెంట ఉన్న ఆరు నియోజకవర్గాల్లోని సుమారు 50 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంపులు గుంపులుగా రోడ్డుకు ఇరువైపులా నిలబడి, అప్పటికే గుంతలు తీసిన చోట మొక్కలు నాటారు. ఈ రహదారికి ఇరువైపులా లక్షమంది మొక్కలు నాటినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. -
రాజీవ్‌శర్మ సర్వీస్‌ను పొడిగించండి
♦ మరో ఆరు నెలలు అనుమతించండి ♦ ప్రధానికి లేఖ ఇచ్చిన సీఎం కేసీఆర్ ♦ మే నెలతో ముగియనున్న పదవీకాలం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఓ లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందజేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ కాలం మే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును ఆరు నెలలు పెంచాలని సీఎం ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే సందర్భంలోనే ఈ లేఖను అందించారు. నిబంధనల ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు గడువు పెంచాలంటే మూడు నెలల ముందు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐఎస్ పెన్షన్ రూల్స్ సెక్షన్ 16 ప్రకారం సదరు అధికారికి ఆరు నెలల వరకు గడువు పొడిగించవచ్చు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులైతే సర్వీసు కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్రంతోనే సంప్రదింపులు జరిపితే డీవోపీటీ సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలలకు మాత్రమే పెంచే అవకాశముంది. అందుకే సీఎం ఈ లేఖను నేరుగా ప్రధానికి ఇచ్చి ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉన్న దృష్ట్యా ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ 2 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాజీవ్‌శర్మ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పని చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఏడాది మే 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుంది. ఆరు నెలల పాటు పొడిగిస్తే నవంబర్ నెలాఖరు వరకు ఆయనే తెలంగాణ సీఎస్‌కు కొనసాగుతారు. -
పండుగలా అవతరణ వేడుకలు
అధికారులకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశం జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు కార్యక్రమాలు పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు తెలంగాణ సంస్కృతి, వైభవానికి ఉత్సవాల్లో పెద్దపీట ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవాలు హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించాలని, ఇందుకోసం జిల్లా ఇన్చార్జి మంత్రులను సంప్రదించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై బుధవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అమర వీరులకు నివాళి అర్పించేందుకు జిల్లాల్లో అమరవీరుల స్తూపాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, ప్రధాన ర హదారులను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. రాజధానిలో.. హైదరాబాద్‌లో జూన్ 2న ఉదయం 9.30 నుంచి 11.30 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. పోలీసుల మార్చ్ఫాస్ట్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన ఉంటుంది. రాజ్‌భవన్, నెక్లెస్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్కు, ట్రాఫిక్ ఐలాండ్లు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దుకాణాలు, ప్రైవేటు సంస్థల్లోనూ రాష్ట్ర అవతరణ ఉత్సవ లోగోలు ప్రదర్శిస్తారు. రెండో తేదీ రాత్రి 8 గంటలకు పీపుల్స్‌ప్లాజాలో బాణసంచా కాల్చుతారు. వైభవం, సంస్కృతిని చాటేలా.. తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాంస్కృతిక వారధి కళాకారులు ‘తెలంగాణ సాంస్కృతిక జైత్రయాత్ర’ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వెల్లడించారు. కళాకారులు ప్రతిరోజు రెండు జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న నెక్లెస్‌రోడ్డులో, 3న మెదక్, నిజామాబాద్, 4న ఆదిలాబాద్, కరీంనగర్, 5న వ రంగల్, ఖమ్మం, 6న నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఏడో తేదీన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీ ప్రదర్శన నిర్విహ స్తారు. ఈ కార్యక్రమం సరికొత్త పంథాలో ఉండేలా కళాప్రదర్శనలు రూపొందిస్తున్నారు. ఆవిర్భావ వేడుక లపై తెలంగాణ సాంస్కృతిక వారధి రూపొందించిన 10 వేల సీడీలను, సీఎం కేసీఆర్ సందేశంతో కూడిన తెలంగాణ మాసపత్రిక కాపీలను జిల్లాలకు పంపించారు. -
వారంలో తుది జాబితా
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన 95 శాతం పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరింది. మరో వారం రోజుల్లో తుది జాబితాను కేంద్రం వెల్లడించనుంది. ఇరు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపుల్లో మార్పులు కోరుతూ కొందరు అధికారులు చేసుకున్న అభ్యర్థనలపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, డీఓపీటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ నిబంధనల ప్రకారం పరస్పర మార్పిడి (స్వాపింగ్)లో కొందరికి మాత్రమే అవకాశం కల్పించింది. అధికారుల విభజన ప్రక్రియను 95 శాతం పూర్తి చేసినట్టు భేటీ తర్వాత ఇరువురు సీఎస్‌లు మీడియాకు తెలిపారు. అభ్యంతరాలు పూర్తయినందున బహుశా వారంలోనే డీఓపీటీ తుది జాబితాను ఇంకా శిక్షణలో ఉన్న 2014 బ్యాచ్ అధికారుల కేటాయింపులు జరగనందున దానిపై చర్చించేందుకు వారం పది రోజుల్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశముందని చెప్పారు. పూనం, సోమేశ్ ఏపీకే? స్వాపింగ్ ప్రక్రియలో కోరుకున్న రాష్ట్రానికి వెళ్లేందుకు దాదాపు 30 మంది ఐఏఎస్‌లు దరఖాస్తు చేసుకోగా 16 మందికి అవకాశం కలిగింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల నుకున్న పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్‌లకు అవకాశం దొరకలేదు. రోనాల్డ్‌రాస్ మాత్రం తెలంగాణకు వెళ్లే అవకాశముంది. ఐపీఎస్‌ల్లో స్వాపింగ్‌లో అనురాధ ఏపీకి, ఈష్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. భార్యాభర్తల కేసులో మహేశ్‌మురళీధర్ భగవత్, విజయ్‌కుమార్, రాజేశ్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. ఒకే బ్యాచ్, ఒకే వేతన స్కేలున్న వారిని కోరుకున్న మేరకు స్వాపింగ్‌లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించడం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు స్వాపింగ్ జాబితా ఇలా... -
భూసేకరణ పూర్తి చేసిస్తే సిద్ధమే
తెలంగాణలో జాతీయరహదారులపై హైవేల సంస్థ చైర్మన్ ఆర్పీ సింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణను పూర్తి చేసి ఉంటే హైవేల నిర్మాణానికి అభ్యంతరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానం అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో శుక్రవారం సచివాలయంలో ఆర్పీ సింగ్ భేటీ అయ్యారు. ఈ విష యమై రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయిన నేపథ్యంలో కేంద్ర ఉపరి తల రవాణా శాఖ మంత్రి గడ్కారీ ఆదేశాల మేరకు ఆర్పీసింగ్ సీఎస్‌ను కలిశారు. ప్రతి పాదిత జాతీయ రహదారులు.. 1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్సువాడ-బోధన్ 2.హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల- మన్నెగూడ- పరిగి -కొడంగల్ మీదుగా కర్నాటక సరిహద్దు వరకు, 3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల 4. నిర్మల్-జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ 5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట 6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు హైవే పనులు చేపట్టాలని సీఎస్ కోరారు. -
దక్షిణాది రాష్ట్రాల సీఎస్ల భేటీ
అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాలపై చర్చ తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన సమావేశం ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి సీఎస్‌లు, ఏసీఎస్‌ల హాజరు దక్షిణ ప్రాంత మండలి సమావేశానికి ఏజెండా సిద్ధం చేసిన సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాల అమలు తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో జరిగిం ది. దక్షిణ ప్రాంత మండలి(సౌత్ జోన్ కౌన్సిల్) ఎనిమిదో స్థాయి సంఘం సమావేశంలో దాదాపు 46 అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల మధ్య చాలా కాలంగా ఉన్న పదిహేను వివాదాలను పరిష్కరించుకున్నారు. మిగిలిన అంశాలను సీఎంల స్థాయి దక్షిణ ప్రాంత మండ లి సమావేశ ఏజెండాగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో హిందూజా విద్యుత్ ఉత్పత్తి అంశం, ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశానికి గ్రిడ్ కల్పనతోపాటు, ప్రభుత్వం ఇటీవల ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమ లు కావడానికి అవసరమైన లైన్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను నిర్మించాలని కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశం వివరాలను కేంద్ర హోం శాఖ అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి హెచ్‌కె దాస్ వెల్లడించారు. మండలి సమావేశాలు ఆరు నెలలకోమారు నిర్వహించాలని తద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకా శం ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు నిర్మాణంలో భాగంగా వాణి జ్య కట్టడాలు నష్టపరిహారం చెల్లింపు, రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి భూ సేకరణపై ఎదుర్కొంటున్న సమస్య, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్య, కర్మాగారాల చట్టం-1948 ప్రకారం సంబంధిత ప్రాధికార సంస్థ అనుమతి లేకుండా రైల్వే అధికారులను ప్రాసిక్యూట్ చేసే అంశం, ఇసుక రవా ణా, జీఎస్టీ, పర్యాటకం, రైల్వే కారి డార్ గృహ నిర్మాణం, విద్యుత్ ప్రసార వ్యవస్థ, ఉపరితల రవాణా, రైల్వే ట్రాక్షన్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు హేతుబద్ధం లేకపోవడం, పాండిచ్చేరి విమానాశ్రయానికి భూసేకరణ, కర్నాటక- తమిళనాడు, తమిళనాడు-కేరళ రాష్ట్రాల మధ్యనున్న వివాదాలు, రోడ్డు భద్రతా చట్టంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, జీఏడీ (పొలిటికల్ ముఖ్యకార్యదర్శి) అజయ్‌మిశ్రా, ఎస్కే జోషి, ఆంధ్రా సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రేమ్‌చంద్రారెడ్డి, కర్నాటక సీఎస్ కౌశిక్ ముఖర్జీ, తమిళనాడు సీఎస్ మోహన్ వర్గీస్ చుంకత్, కేరళ ఎసీఎస్ నివేదిత పి హరన్, పాండిచ్చేరి సీఎస్ సుందరవడివేలు, కేంద్ర హోం మంత్రి సలహాదారు హరికృష్ణ పలివాల్ తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లో అధికారుల విభజన పూర్తి
కేంద్ర పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభ్యంతరాలు తెలియజేసిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తవుతుందని కేంద్ర సిబ్బంది శిక్షణ, పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల కేటాయిం పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ తయారు చేసిన రెండో జాబితాను ఈ నెల 10న డీఓపీటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై అభ్యంతరాలు వెలవరించేందుకు ఇచ్చిన 15 రోజుల గడువు ముగియడంతో కమిటీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హాతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు హాజరయ్యారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకుంది. ముసాయిదా జాబితాపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ ప్రభుత్వాల అభిప్రాయాలు వెల్లడించారు. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యం అయినందున, రెండో జాబితాలో కేటాయించిన అధికారుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులను ఆయా రాష్ట్రాలకు ‘ఆర్డర్ టు సర్వ్’ కింద కేటాయించేందుకు సీఎస్‌లు అంగీ కరించినట్లు తెలిసింది. కమిటీకి ఇదే చివరి సమావేశం కావొచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. కోరుకున్న రాష్ట్రానికే కేటాయింపు: కేంద్రమంత్రి సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన ప్రక్రియ అధికారులందరినీ సంతృప్తి పరిచేలా కొనసాగుతోందని మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. శనివారం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ అధికారుల మిడ్‌టర్మ్ ట్రైనింగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారుల విభజన ప్రక్రియ చాలా పారదర్శకంగా కొనసాగుతోంది. తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేస్తాం. ప్రతి అధికారిని సంతృప్తి పరిచేలా, అధికారి కోరుకునే రాష్ట్రానికే కేటాయించేలా చూస్తున్నాం. విభజన ప్రక్రియను గరిష్టంగా రెండు వారాల్లో పూర్తి చేయనున్నామన్నారు. కమలనాథన్ మార్గదర్శకాలకు పీఎం గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలోని రాష్ట్ర కేడర్ అధికారుల విభజనకు సంబంధించిన రాష్ట్ర సలహా మం డలి చైర్మన్ సీఆర్ కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. పీఎంవో నుంచి డీవోపీటీకి వచ్చాక వా టిని వెబ్సైట్లో పెట్టనుంది. దీని అనుగుణంగానే విభజన ప్రక్రియను కమిటీ వేగవంతం చేయనుంది. భార్యాభర్తల కేసైతే ఓకే..! అఖిల భారత సర్వీసు అధికారుల విజ్ఞాపనలను ప్ర త్యూష్సిన్హా కమిటీ తిరస్కరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. భార్యాభర్తల కేసుల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ పేర్కొంది. -
రుణమాఫీకి రైతుల గుర్తింపు
జిల్లాలో 4.03 లక్షల మంది నెలాఖరుకల్లా తుది నివేదిక కలెక్టర్ జి.కిషన్ వెల్లడి హన్మకొండ అర్బన్ : రుణమాఫీకి జిల్లాలో ఇప్పటి వరకు 4.03 లక్షల మంది రైతులను గుర్తించినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోం దని, రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఈనెలాఖరు కల్లా తుది నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు బ్యాంకర్లతో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ, బ్యాంకు అధికారులతో బ్రాంచీ ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన రుణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో బోగస్ పేర్లు గుర్తించి ఏరివేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు రూ.లక్షలోపు రుణాలు పూర్తిగా మూడేళ్లలో చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున తొలివిడతగా 25శాతం ఆయా బ్యాంకుల బ్రాంచీలకు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నా రు. అరులైన రైతులకు త్వరితగతిన వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని సూచిం చారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, వ్యవసాయశాఖ జేడీఏ రామారావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం, ఆర్డీఓ మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
8న ప్రభుత్వ సెలవు, 13న వర్కింగ్ డే
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని 8వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు కూడా సెలవు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీనికి బదులుగా ఈ నెల 13వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. కాగా, గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఈ నెల 8న జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీకి బదులుగా13వ తేదీన రెండో శనివారం పనిదినంగా పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.