- జిల్లాలో 4.03 లక్షల మంది
- నెలాఖరుకల్లా తుది నివేదిక
- కలెక్టర్ జి.కిషన్ వెల్లడి
హన్మకొండ అర్బన్ : రుణమాఫీకి జిల్లాలో ఇప్పటి వరకు 4.03 లక్షల మంది రైతులను గుర్తించినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోం దని, రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఈనెలాఖరు కల్లా తుది నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు బ్యాంకర్లతో కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ, బ్యాంకు అధికారులతో బ్రాంచీ ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన రుణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో బోగస్ పేర్లు గుర్తించి ఏరివేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు రూ.లక్షలోపు రుణాలు పూర్తిగా మూడేళ్లలో చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున తొలివిడతగా 25శాతం ఆయా బ్యాంకుల బ్రాంచీలకు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నా రు.
అరులైన రైతులకు త్వరితగతిన వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని సూచిం చారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, వ్యవసాయశాఖ జేడీఏ రామారావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం, ఆర్డీఓ మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.