కేంద్ర బృందాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి,హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో రాష్ట్రం భారీగా నష్టపోయిందని.. పునరావాసం, పునరుద్ధరణ చర్యల కోసం రూ.2,739.99 కోట్ల కేంద్ర సహాయాన్ని అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలు, పునరుద్ధణ చర్యలకు కావాల్సిన కేంద్ర సహాయంపై నివేదికను సిద్ధం చేసిం ది. ఆదివారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందానికి ఈ నివేదిక సమర్పించనుంది.
గత సెప్టెంబర్ 21-27 మధ్య భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేం దుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఆరుగురు అధికా రుల బృందం 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. సీఎస్ రాజీవ్‌శర్మ.. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలసి ఆది వారం ఈ బృందంతో సమావేశమై వర్షాల వల్ల కలిగిన నష్టాలను నివేదిస్తారు. జాతీయ విపత్తుల సహాయ నిధి కింద రూ.1,118.21 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం మరో రూ.1,621.28 కోట్లు కలిపి మొత్తంగా రూ.2,739.99 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరనున్నారు.
మూడు బృందాల పర్యటన..
దిలీప్‌కుమార్ నేతృత్వంలోని ఆరుగురు అధి కారులు మూడు బృందాలుగా విడిపోరుు కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరా బాద్, వికారాబాద్, కామారెడ్డి, నిజామా బాద్ జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎ.కృష్ణప్రసాద్, కేంద్ర ఆరుుల్ సీడ్ డెవలప్‌మెంట్ విభాగం డెరైక్టర్ ఎస్‌కే కొల్హాట్కర్, జల వనరుల శాఖ గోదావరి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఓఆర్‌కే రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఆర్‌బీ కౌల్, కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జుగదీశ్ కుమార్ ఈ బృందాల్లో ఉన్నారు.
రూ.2,739.99 కోట్లివ్వండి
Published Sun, Nov 13 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
Advertisement