dilipkumar
-
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
అందుకే మీడియాకు దూరంగా ఉంటా: హీరో విజయ్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అయితే తన తాజా చిత్రం 'బీస్ట్' ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా 'బీస్ట్' చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో తెలిపాడు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారన్నాడు. అయితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. ఆ వ్యాఖ్యలు చేసింది అసలు నేనేనా అనుకునేలా నా మాటలు మార్చి రాసారన్నాడు. ఇక దాంతో నువ్విలా మాట్లాడావంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ తన సన్నిహితులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు. అలా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాయడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని తెలిపాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ బయటి వాళ్లందరికీ తెలియవు. వారందరూ ఆ వార్తలను నమ్ముతారు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు. -
థియేటర్లు దొరక్కపోవడం దురదృష్టకరం
‘నెంబర్‌వన్’ సినిమాతో బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు 30 సినిమాలు చేసిన నటుడు దిలీప్‌కుమార్ సల్వాది. హీరోగా ‘నా సామి రంగ, ఒకే ఒక్క చాన్స్’ వంటి చిత్రాలు చేసిన అతను తాజాగా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే ఒక మంచి చిత్రానికి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు దొరక్కపోవడం దురదృష్టకరం. మా చిత్రం ఏపీలో 60 థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌లో రెండు, నాగర్ కర్నూల్లో ఓ థియేటర్ మాత్రమే దొరికింది. తెలంగాణలో ఒక్క మల్టీప్లెక్స్‌లో కూడా మా చిత్రానికి అవకాశం దొరకలేదు. ‘అవెంజర్స్’ సినిమాకి పోటీగా మీ సినిమాని ఎందుకు విడుదల చేశారు? అని కొందరు అంటున్నారు. అది హాలీవుడ్ సినిమా. ఇక్కడ డబ్ చేశారు. ఓ డబ్బింగ్ సినిమాకి వందల థియేటర్లు దొరికాయి కానీ, మన తెలుగు రాష్ట్రంలో ఓ తెలుగు సినిమాకి మాత్రం కనీసం ఒక్క షోకి అయినా థియేటర్లు దొరక్కపోవడం చాలా బాధగా ఉంది. మా సినిమాకి అమెరికాలో 40ఆటలు, ఆస్ట్రేలియాలో 12 ఆటలు పడ్డాయి. ఏడాది పాటు ఎంతో కష్టపడి ఓ మంచి సినిమా తీశాం. కానీ, దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లలేకపోతున్నాం. మా సినిమా బాగుందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌గారు, జీఎమ్మార్ వాళ్లు చిత్రం చూసేందుకు ఏర్పాట్లు చేయమంటే క్యూబ్ ద్వారా కంటెంట్ పంపించాం. కేటీఆర్‌గారు చూసి ట్వీట్ చేస్తే థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘దిక్సూచి’ సినిమాని తమిళ్లో డబ్బింగ్ లేదా రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం తెలుగులో నా దర్శకత్వంలో ‘చిత్రసేన’ అనే జూన్‌లో ప్రారంభం అవుతుంది. తమిళంలో హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులో, తమిళంలో నాకు ఇప్పటి వరకూ హీరోగా సరైన హిట్ పడలేదు. అందుకే నన్ను నేను నిరూపించుకోవాలని దర్శకత్వం చేశా. కథ స్వయంగా రాసుకున్న సినిమాలకు మాత్రమే నేను దర్శకత్వం వహిస్తా. వేరే దర్శకుల చిత్రాల్లో హీరోగా చేస్తా’’ అన్నారు. -
రూ.2,739.99 కోట్లివ్వండి
కేంద్ర బృందాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి,హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో రాష్ట్రం భారీగా నష్టపోయిందని.. పునరావాసం, పునరుద్ధరణ చర్యల కోసం రూ.2,739.99 కోట్ల కేంద్ర సహాయాన్ని అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలు, పునరుద్ధణ చర్యలకు కావాల్సిన కేంద్ర సహాయంపై నివేదికను సిద్ధం చేసిం ది. ఆదివారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందానికి ఈ నివేదిక సమర్పించనుంది. గత సెప్టెంబర్ 21-27 మధ్య భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేం దుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఆరుగురు అధికా రుల బృందం 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. సీఎస్ రాజీవ్‌శర్మ.. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలసి ఆది వారం ఈ బృందంతో సమావేశమై వర్షాల వల్ల కలిగిన నష్టాలను నివేదిస్తారు. జాతీయ విపత్తుల సహాయ నిధి కింద రూ.1,118.21 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం మరో రూ.1,621.28 కోట్లు కలిపి మొత్తంగా రూ.2,739.99 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరనున్నారు. మూడు బృందాల పర్యటన.. దిలీప్‌కుమార్ నేతృత్వంలోని ఆరుగురు అధి కారులు మూడు బృందాలుగా విడిపోరుు కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరా బాద్, వికారాబాద్, కామారెడ్డి, నిజామా బాద్ జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎ.కృష్ణప్రసాద్, కేంద్ర ఆరుుల్ సీడ్ డెవలప్మెంట్ విభాగం డెరైక్టర్ ఎస్కే కొల్హాట్కర్, జల వనరుల శాఖ గోదావరి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఓఆర్కే రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఆర్బీ కౌల్, కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జుగదీశ్ కుమార్ ఈ బృందాల్లో ఉన్నారు. -
టూ కంట్రీస్ కథ నచ్చి రీమేక్ చేస్తున్నా! - దర్శకుడు ఎన్.శంకర్
‘‘దిలీప్‌కుమార్ నటించిన మలయాళ చిత్రం ‘టూ కంట్రీస్’ కథ నచ్చడంతో తెలుగులో రీమేక్ చేస్తున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా తీర్చిదిద్దుతా ’’ అని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శంకర్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మరో మంత్రి కేటీఆర్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. శంకర్ మాట్లాడుతూ - ‘‘సునీల్, దిలీప్‌కుమార్ బాడీ లాంగ్వేజ్ ఒకటే. సునీల్ ‘పూలరంగడు’ చిత్రాన్ని దిలీప్ మలయాళంలో రీమేక్ చేసి, హిట్ అందుకున్నారు. ప్రతిభను నమ్ముకుని స్వయంకృషితో ఎదిగాడు సునీల్. మలయాళ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ మా చిత్రానికి పాటలు అందిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. 70 శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల వచ్చిన నా చిత్రాల్లో హాస్యం తగ్గడంతో యావరేజ్‌గా నిలిచాయి. కానీ, ఈ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తీస్తున్న ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు వినోదం పంచేది సినిమా. మనం చేసే పనిలో సమాజ ప్రయోజనంతో పాటు స్వప్రయోజనం ఉండాలి’’ అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్‌యస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గడ్డం రవికుమార్, దర్శక-నటుడు ఆర్.నారాయణమూర్తి, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, మల్కాపురం శివకుమార్, సుదర్శన్ రెడ్డి, దర్శకులు కోదండ రామిరెడ్డి, బి.గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, ఎమ్మె ల్యేలు ‘రసమయి’ బాలకిషన్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: జి.రాంప్రసాద్, సమర్పణ: సాయి. -
ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ...సాహెబా సుబ్రహ్మణ్యం
అండదండలు లేకపోతే చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టం అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరు ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా పట్టుదలతో అవకాశాల్ని అందుకొంటుంటారు. ప్రతిభ ఉంటే చాలు.. ఎవరి అండ లేకపోయినా నెగ్గుకురావచ్చు అని నిరూపిస్తుంటారు. ఆ జాబితాలో మరో కథానాయకుడు చేరాడు. అతని పేరు.. దిలీప్‌కుమార్. చిన్నప్పట్నుంచీ సినిమా కలలు కన్నాడు. ఎప్పటికయినా వెండితెరపై తనను తాను చూసుకోవాలనుకొన్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసి... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం అందుకొన్నాడు. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు దిలీప్‌కుమార్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివీ... మలయాళం సినిమా రీమేక్ హక్కుల్ని నేనే వెళ్లి కొనుక్కొచ్చా... ‘‘విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బిఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) చేశాను. సినిమా అంటే ఇష్టం కాబట్టే ఆ కోర్సు ఎంచుకొన్నాను. డిగ్రీలో సినిమాపై అన్నపూర్ణ స్టూడియోలో ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు నటుడు కావాలన్న కోరికను నాలో మరింతగా పెంచాయి. డిగ్రీ పూర్తయ్యాక అనుకోకుండా నిర్మాత కొల్లా నాగేశ్వరరావు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఆయనకి కూడా సినిమా అంటే చాలా ప్రేమ. మేమిద్దరం సినిమా గురించి మాట్లాడుకొనేవాళ్లం. ‘డిగ్రీ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావు’ అని ఆయన అడిగితే.. నేను పీజీ చేయాలనుకొంటున్నాను కానీ, డబ్బులు లేవు’ అని చెప్పాను. ఆయన సాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ‘నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నటన వైపు దృష్టి పెడతా’ అన్నా. అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అన్నారు. ఆయనకి కూడా సినిమా తీయాలనే ఆసక్తి ఉండటంతో మేమిద్దరం మాట్లాడుకొని మలయాళంలో విజయవంతమైన ‘తట్టాత్తిన్ మరయతు’ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని కూడా నేనే వెళ్లి కొనుక్కొచ్చా. ఒక కథానాయకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అన్నీ నేనే దగ్గరుండి చూసుకొన్నాను.’’ అందరికీ చేరువవుతాననే నమ్మకం ఉంది ‘‘ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. సంగీతానికి ప్రాధాన్యముంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కుర్రాడికీ, ఆయేషా అనే అమ్మాయికీ మధ్య పరిచయం అవడం, ప్రేమ పుట్టడం, ప్రేమించుకొన్న తర్వాత వాళ్లిద్దరి మనసుల్లో కనిపించే భావోద్వేగాలు... ఇవన్నీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణం విషయంలోనూ బాధ్యతలు తీసుకోవాల్సి రావడంతో సినిమా ఆరంభమైన తర్వాత కొన్ని రోజులు నటించేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత మాత్రం పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాను. సినిమా గురించి తెలిసినా... నటనలో మాత్రం నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సుబ్రహ్మణ్యం పాత్రతో అందరికీ చేరువవుతాననే నమ్మకం నాకుంది.’’ ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో! ‘‘నా అభిరుచికి తగ్గట్టుగా, నాకు నప్పుతుందనుకున్న కథని, నేనే ఎంచుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో. నాకు నచ్చిన కథ కావడంతో పాత్రలో తొందరగా ఇమిడిపోయాను. రావు రమేష్గారితో పాటు పలువురు సీనియర్ నటీనటులతో కలిసి నటించడం చక్కటి అనుభవం. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో నటించడం మంచి అనుభూతినిచ్చింది. దర్శకత్వం చేయడం ఆమెకీ కొత్తే అయినా... అనుభవం ఉన్న దర్శకురాలిగా చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న వయసులో కథానాయకుడు ఆయ్యాను కాబట్టి మరిన్ని ప్రేమకథలు చేయాలనుకొంటున్నాను. తదుపరి కూడా ఇదే సంస్థలో ఓ ప్రేమకథలో నటిస్తా.’’ -
ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్
ముంబై: తనకు అస్వస్థత అంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్ (91) కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ సైట్స్‌లో ఊహాగానాలు హల్చల్ చేశాయి. దీంతో అజ్ఞాతం వీడిన దిలీప్...తన క్షేమం, ఆరోగ్యం కోరుకుంటున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మౌత్‌షట్ డాట్ కామ్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.