వారంలో తుది జాబితా
- సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన 95 శాతం పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరింది. మరో వారం రోజుల్లో తుది జాబితాను కేంద్రం వెల్లడించనుంది. ఇరు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపుల్లో మార్పులు కోరుతూ కొందరు అధికారులు చేసుకున్న అభ్యర్థనలపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమై చర్చించింది.
కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, డీఓపీటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ నిబంధనల ప్రకారం పరస్పర మార్పిడి (స్వాపింగ్)లో కొందరికి మాత్రమే అవకాశం కల్పించింది. అధికారుల విభజన ప్రక్రియను 95 శాతం పూర్తి చేసినట్టు భేటీ తర్వాత ఇరువురు సీఎస్‌లు మీడియాకు తెలిపారు.
అభ్యంతరాలు పూర్తయినందున బహుశా వారంలోనే డీఓపీటీ తుది జాబితాను ఇంకా శిక్షణలో ఉన్న 2014 బ్యాచ్ అధికారుల కేటాయింపులు జరగనందున దానిపై చర్చించేందుకు వారం పది రోజుల్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశముందని చెప్పారు.
పూనం, సోమేశ్ ఏపీకే?
స్వాపింగ్ ప్రక్రియలో కోరుకున్న రాష్ట్రానికి వెళ్లేందుకు దాదాపు 30 మంది ఐఏఎస్‌లు దరఖాస్తు చేసుకోగా 16 మందికి అవకాశం కలిగింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల నుకున్న పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్‌లకు అవకాశం దొరకలేదు. రోనాల్డ్‌రాస్ మాత్రం తెలంగాణకు వెళ్లే అవకాశముంది. ఐపీఎస్‌ల్లో స్వాపింగ్‌లో అనురాధ ఏపీకి, ఈష్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. భార్యాభర్తల కేసులో మహేశ్‌మురళీధర్ భగవత్, విజయ్‌కుమార్, రాజేశ్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. ఒకే బ్యాచ్, ఒకే వేతన స్కేలున్న వారిని కోరుకున్న మేరకు స్వాపింగ్‌లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించడం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు స్వాపింగ్ జాబితా ఇలా...