All India Service
-
ఒక తీర్పు.. పలువురిలో కలవరం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కేడర్‌లో కొనసాగడానికి రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని సివిల్ సర్వీసెస్ అధికారులను ఆప్షన్లు అడిగిన తరువాత.. వారి సీనియారిటీ, స్థానికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వారిని రెండు రాష్ట్రాలకు విభజించి కేటాయింపు జరిపింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పలు కారణాలు చూపిస్తూ.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆశ్రయించి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి అనుమతులు తెచ్చుకున్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా వీరిలో ఉన్నారు. అయితే డీవోపీటీ 2017లోనే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం మంగళవారం తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం..సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడం.. పలువురు అధికారులను కలవరపరుస్తోంది. తామంతా ఏపీకి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సదరు ఐఏస్, ఐపీఎస్ అధికారుల్లో కొనసాగుతోంది. ఏపీకి కేటాయించిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన కొందరు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నారు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడివారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా కాగా తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇన్చార్జి డీజీపీగా అందుకేనా? తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్‌ను రెగ్యులర్ డీజీపీగా కాకుండా ఇన్చార్జి డీజీపీగా నియమించడానికి ప్రధాన కారణం హైకోర్టులో సోమేశ్‌కుమార్‌పై కొనసాగుతున్న కేసు నేపథ్యమేనన్న ప్రచారం ఉంది. తాజా తీర్పుతో ఇప్పుడు అంజనీకుమార్ పరిస్థితేంటన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా సీనియర్ ఐఏఎస్‌ల్లో వాకాటి కరుణ ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శిగా, వాణీప్రసాద్ పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థలో డైరెక్టర్‌గా, రొనాల్డ్‌రోస్ ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఎం.ప్రశాంతి అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాటా ఆమ్రపాలి కేంద్ర సర్వీస్‌ల్లోకి వెళ్లి ప్రస్తుతం పీఎంఓలో ఉన్నారు. -
ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!
అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియామకం హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అయిన ఐఏఎస్ తరహాలో... రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పా టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఏఎస్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జీవో నం. 777ను జారీ చేశారు. ఈ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, సాధారణ పరిపాలన(పొలిటికల్) శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ సెక్రటరీ (ఎస్ఆర్/ఐఎఫ్) సభ్యులుగా వ్యవహరిస్తారు. సర్వీసెస్, హెచ్ఆర్ఎం కార్యదర్శి సభ్యుడిగా, కన్వీనర్‌గా ఉంటారు. రెవెన్యూయేతర అధికారుల్లో ఆశలు.. ఇన్నాళ్లూ రాష్ట్ర స్థాయి సర్వీసు అయినగ్రూప్-1లో ఒక్క రెవెన్యూ వైపు ఉన్న అధికారులనే పదోన్నతిపై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు (కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం) సిఫారసు చేసే విధానం ఉంది. ఇతర విభాగాల గ్రూప్-1 అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా పొందే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ని గ్రూప్-1 అధికారులకు ప్రాతినిధ్యం కల్పిం చేలా రాష్ట్రస్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీ స్ ఉండాల ని, దాని నుంచి సీనియారిటీ ప్రకా రం కన్ఫర్డ్ ఐఏఎ స్కు సిఫారసు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హరగోపాల్ కమిటీ కూడా తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఉం డటం అవసరమని పేర్కొంది. టీఏఎస్కి కమిటీని ఏర్పాటు చేయడంపై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. -
డీజీపీ రేసులో ఆరుగురు
* పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యం * కొత్త బాస్ ఎవరంటూ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ * యూపీఎస్సీకి జాబితా పంపనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యమైం ది. ఇందుకు అర్హులైన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీజీపీ నియామక నియమావళిని అనుసరించి ఐదు లేదా ఆరుగురు అ ధికారుల పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ కి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపనుంది. సీని యారిటీ ప్రాతిపదికన ఈ జాబితాలో అరుణా బహుగుణ, టి.పి.దాస్, ఎస్.ఎ.హుడా, దుర్గాప్రసాద్, ఎ.కె.ఖాన్, అనురాగ్ శర్మ పేర్లుండే అవకాశాలున్నాయి. జాబితాతో పాటు ఆయా అధికారుల సీనియారిటీ, మెరిట్, అనుభవం, నిర్వహించిన పోస్టులు, సాధించిన పతకాలు, సమర్థత, ఎదుర్కొన్న వివాదాలు, మిగిలున్న సర్వీసు కాలం తదితరాలతో కూడిన సమగ్ర నివేదికను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీకి ప్రభుత్వం పంపుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితా నుంచి ముగ్గురు అధికారుల పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది. యూపీఎస్సీ సిఫార్సు చేయనున్న ముగ్గురు అధికారుల్లో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయవచ్చనే దానిపై రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డీజీపీల నియామకాల్లో సీనియారిటీ, ఇతర నిబంధనలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావాల్సిన వారినే నియమిస్తుండడంతో దీనిపై ప్రతిసారీ న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి. విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాత్కాలిక డీజీపీల నియామకానికి మాత్రమే కేంద్రం అనుమతించడం తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా 1982 బ్యాచ్ అధికారి అనురాగ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అప్పటికి ఆయన కంటే సీనియర్ అధికారులు పలువురున్నారు. వారిలో కొంద రు శర్మ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికీ దిగారు. ఈ నేపథ్యంలో శర్మనే పూర్తిస్థాయి డీజీపీగా నిమిస్తా రా, లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 1979 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారుల్లో అరుణా బహుగుణ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డెరైక్టర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న ఆమె డీజీపీ పోస్టు కో సం రాష్ట్ర సర్వీసుకు తిరిగి రావాలంటే ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుంది. అదే బ్యాచ్‌కు చెందిన ఎస్.ఎ.హుడా, టి.పి.దాస్ గతంలో డీజీపీల నియామకాలను సవాలు చేస్తూ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దాస్ ఈ నవంబర్‌లో పదవి విరమణ చేయనున్నారు. ఇక 1981 బ్యాచ్ అధికారుల్లో దుర్గాప్రసాద్ ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండగా ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా ఉన్నారు. -
డీజీపీ రేసులో ఆరుగురు
-
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు. -
వారంలో తుది జాబితా
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన 95 శాతం పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరింది. మరో వారం రోజుల్లో తుది జాబితాను కేంద్రం వెల్లడించనుంది. ఇరు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపుల్లో మార్పులు కోరుతూ కొందరు అధికారులు చేసుకున్న అభ్యర్థనలపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, డీఓపీటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ నిబంధనల ప్రకారం పరస్పర మార్పిడి (స్వాపింగ్)లో కొందరికి మాత్రమే అవకాశం కల్పించింది. అధికారుల విభజన ప్రక్రియను 95 శాతం పూర్తి చేసినట్టు భేటీ తర్వాత ఇరువురు సీఎస్‌లు మీడియాకు తెలిపారు. అభ్యంతరాలు పూర్తయినందున బహుశా వారంలోనే డీఓపీటీ తుది జాబితాను ఇంకా శిక్షణలో ఉన్న 2014 బ్యాచ్ అధికారుల కేటాయింపులు జరగనందున దానిపై చర్చించేందుకు వారం పది రోజుల్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశముందని చెప్పారు. పూనం, సోమేశ్ ఏపీకే? స్వాపింగ్ ప్రక్రియలో కోరుకున్న రాష్ట్రానికి వెళ్లేందుకు దాదాపు 30 మంది ఐఏఎస్‌లు దరఖాస్తు చేసుకోగా 16 మందికి అవకాశం కలిగింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల నుకున్న పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్‌లకు అవకాశం దొరకలేదు. రోనాల్డ్‌రాస్ మాత్రం తెలంగాణకు వెళ్లే అవకాశముంది. ఐపీఎస్‌ల్లో స్వాపింగ్‌లో అనురాధ ఏపీకి, ఈష్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. భార్యాభర్తల కేసులో మహేశ్‌మురళీధర్ భగవత్, విజయ్‌కుమార్, రాజేశ్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. ఒకే బ్యాచ్, ఒకే వేతన స్కేలున్న వారిని కోరుకున్న మేరకు స్వాపింగ్‌లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించడం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు స్వాపింగ్ జాబితా ఇలా... -
ఏపీలో పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలో తెలంగాణకు వెళ్లడంతో ఏపీ సర్కారు పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీలో తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని, నలుగురు ఐఎఫ్ఎస్ అధికారులను మినహాయించి మిగిలిన వారిని ఆదివారం రిలీవ్ చేసింది. అజయ్ సహాని, సిద్దార్ధ జైన్, అజయ్ జైన్, ఆర్.వి. కర్ణన్, అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీలో కొనసాగించాలని కేంద్రాన్ని కోరినందున వారిని రిలీవ్ చేయలేదు. అలాగే సస్పెన్షన్‌లో ఉన్న వై. శ్రీలక్ష్మిని, అలాగే ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉన్న ఎ. విద్యాసాగర్, సి. హరికిరణ్, జి. శ్రీజనలను రిలీవ్ చేయలేదు. మిగిలిన 44 మంది ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఐపీఎస్‌లలో ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న ఎ.ఆర్. అనురాధను భార్య, భర్తల కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రాన్ని కోరినందున ఆమెను మినహాయించి మిగిలిన 23 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణకు కేటాయించిన ఐఎఫ్ఎస్ అధికారుల్లో నలుగురిని మినహాయించి మిగిలిన 30 మంది ఐఎఫ్ఎస్లను రిలీవ్ చేశారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, సస్పెన్షన్‌లో ఉన్న ఐఎఫ్ఎస్లు రాజేశ్ మిట్టల్, ఎ. కృష్ణను తెలంగాణకు కేటాయించినప్పటికీ వారిని రిలీవ్ చేయలేదు. అలాగే తెలంగాణకు కేటాయించినా భార్యా, భర్తల కేసు ఆధారంగా రాహుల్ పాండే. సి. శెల్వం ఐఎఫ్ఎస్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కొందరికి అంతర్గత సర్దుబాట్ల కింద కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా బి. ఉదయ లక్ష్మి బీసీ సంక్షేమ కమిషనర్, అంతర్గత సర్దుబాటు కింద రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్ బాధ్యతలు. మహ్మద్ ఇక్బాల్ మైనారిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ, వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యదర్శి, సర్వే సెటిల్మెంట్ డెరైక్టర్. కోన శశిధర్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ. అంతర్గత సర్దుబాటు కింద యువజన, పర్యాటక డిప్యుటీ కార్యదర్శి, శాప్ వైస్ చైర్మన్, ఎండీ, సహాయ పునరావాస సంయుక్త కార్యదర్శి. జి. వీరపాండ్యన్ ఉపాధి హామీ డెరైక్టర్, అంతర్గత సర్దుబాటు కింద మహిళా శిశు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి, మెప్మా డెరైక్టర్, ఏపీ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు పీడీ. ఎం.వి.ఎస్.ఎ. సోమయాజులు సాధారణ పరిపాలన శాఖ డిప్యుటీ కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద అదనపు ముఖ్య ఎన్నికల అధికారి, గృహనిర్మాణ సంస్థ ఈడీ. లింగరాజు పాణిగ్రాహి ఆర్ఐఎడీ ముఖ్యకార్యదర్శి. వి. శివశంకరరావు సాధారణ పాలన(సర్వీసెస్), అధికార భాష ఉప కార్యదర్శి. -
కేంద్ర పరిశోధనల సంస్థలకు ఏపీలో పెద్దపీట
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర పరిశోధనల సంస్థల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వైయస్ చౌదరి (సుజనాచౌదరి) చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివా రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూమిని అందిస్తే మిగిలినవాటిని కేంద్ర ప్రభుత్వం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజనను పూర్తి చేయించామన్నారు. స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం వాటిని పరిశీలించే కార్యక్రమంలో ఉన్నామన్నారు. అంతకుముందు సీఎం బాబుతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. -
వారంలో ఐఏఎస్‌ల పంపిణీ!
⇒ 15 రోజుల్లోగా అధికారుల నుంచి ‘స్వాపింగ్’కు దరఖాస్తుల స్వీకరణ ⇒ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది జాబితా ప్రకారమే పంపిణీ ⇒ఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం ⇒భేటీకి హాజరైన ప్రత్యూష్ సిన్హా, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో అధికారులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఉత్తర్వుల తర్వాత పక్షం రోజుల్లోగా అధికారుల నుంచి పరస్పర మార్పిడి(స్వాపింగ్)కి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కొఠారీ పాల్గొన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇదివరకు ప్రకటించిన ముసాయిదా తుది జాబితా ప్రకారమే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఒకే బ్యాచ్‌లో ఉన్న అధికారులకేగాకుండా సీనియారిటీ ఆధారంగా మిగతావారికి కూడా స్వాపింగ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు భేటీలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది ముసాయిదా పంపిణీ జాబితాపై పలువురు అధికారులు ఇప్పటికే క్యాట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యర్శి పూనం మాలకొండయ్య, బీపీ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీలో పనిచేస్తున్న అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించారు. ఏపీలో ఉన్న శాంతికుమారి, వి.కరుణ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నారు. ఈ అధికారులు స్వాపింగ్తో వారు కోరుకున్న రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్వాపింగ్ పూర్తయ్యాక అధికారులకు శాశ్వతంగా ఆ రాష్ట్ర కేడర్ కేటాయించాలని నిర్ణయించారు. -
15 రోజుల్లో అధికారుల విభజన పూర్తి
కేంద్ర పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభ్యంతరాలు తెలియజేసిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తవుతుందని కేంద్ర సిబ్బంది శిక్షణ, పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల కేటాయిం పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ తయారు చేసిన రెండో జాబితాను ఈ నెల 10న డీఓపీటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై అభ్యంతరాలు వెలవరించేందుకు ఇచ్చిన 15 రోజుల గడువు ముగియడంతో కమిటీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హాతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు హాజరయ్యారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకుంది. ముసాయిదా జాబితాపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ ప్రభుత్వాల అభిప్రాయాలు వెల్లడించారు. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యం అయినందున, రెండో జాబితాలో కేటాయించిన అధికారుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులను ఆయా రాష్ట్రాలకు ‘ఆర్డర్ టు సర్వ్’ కింద కేటాయించేందుకు సీఎస్‌లు అంగీ కరించినట్లు తెలిసింది. కమిటీకి ఇదే చివరి సమావేశం కావొచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. కోరుకున్న రాష్ట్రానికే కేటాయింపు: కేంద్రమంత్రి సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన ప్రక్రియ అధికారులందరినీ సంతృప్తి పరిచేలా కొనసాగుతోందని మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. శనివారం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ అధికారుల మిడ్‌టర్మ్ ట్రైనింగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారుల విభజన ప్రక్రియ చాలా పారదర్శకంగా కొనసాగుతోంది. తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేస్తాం. ప్రతి అధికారిని సంతృప్తి పరిచేలా, అధికారి కోరుకునే రాష్ట్రానికే కేటాయించేలా చూస్తున్నాం. విభజన ప్రక్రియను గరిష్టంగా రెండు వారాల్లో పూర్తి చేయనున్నామన్నారు. కమలనాథన్ మార్గదర్శకాలకు పీఎం గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలోని రాష్ట్ర కేడర్ అధికారుల విభజనకు సంబంధించిన రాష్ట్ర సలహా మం డలి చైర్మన్ సీఆర్ కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. పీఎంవో నుంచి డీవోపీటీకి వచ్చాక వా టిని వెబ్సైట్లో పెట్టనుంది. దీని అనుగుణంగానే విభజన ప్రక్రియను కమిటీ వేగవంతం చేయనుంది. భార్యాభర్తల కేసైతే ఓకే..! అఖిల భారత సర్వీసు అధికారుల విజ్ఞాపనలను ప్ర త్యూష్సిన్హా కమిటీ తిరస్కరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. భార్యాభర్తల కేసుల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ పేర్కొంది. -
ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ఈ కమిటీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ సమావేశమైనట్లు తెలుస్తోంది. -
నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హాజరవుతున్న ఇరురాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరవుతున్నారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ శనివారం సమావేశం నిర్వహిస్తోంది. తెలంగాణలో పనిచేస్తూ.. ఆంధ్రాకు కేటాయించిన ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్యలను తమ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ కోరనుంది. తమ వద్ద పనిచేస్తూ.. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లైన అజయ్ సహాని, ఆదిత్యనాథ్‌దాస్, అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తమ వద్దనే ఉంచాలని ఏపీ కోరనుంది. అభ్యంతరం లేని వారిని గత జాబితా ప్రకారం రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖను కోరడం తెలిసిందే. -
అభ్యంతరం లేని వారిని పంపించండి
అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్రానికి రెండు రాష్ట్రాల లేఖ హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను పంపిణీ చేస్తూ ఈ నెల 10వ తేదీన ప్రత్యూషసిన్హా కమిటీ ప్రకటించిన జాబితాల్లో అభ్యంతరాలున్న అధికారులను మినహాయించి మిగతా అధికారులను ఆయా రాష్ట్రాల్లో పనిచేసేందుకు వీలుగా ‘సర్వ్ టు వర్క్’ ఆర్డర్‌ను జారీ చేయాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిన్హా కమిటీ ప్రకటించిన జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా తెలియజేయాలని సదరు కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏకాభిప్రాయమున్న అధికారులకు రెండు రాష్ట్రాల్లో సర్వ్ టు ఆర్డర్ జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత శిక్షణ విభాగానికి సీఎస్‌లు లేఖలు రాశారు. -
తుది కేటాయింపులు ఎన్నిసార్లు?
అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన క్యాట్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను ఎన్నిసార్లు తుది కేటాయింపులు చేస్తారని కేంద్రాన్ని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం నిలదీసింది.ఐపీఎస్ కేడర్ తాత్కాలిక కేటాయింపులను సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బి.వి.రావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున షఫీకుజ్జమాన్ వాదనలు వినిపిస్తూ.. ఐపీఎస్ కేడర్‌ను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసేనాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని తెలిపారు. జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయించాక.. మే 30న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 31న నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు.మార్గదర్శకాలు లేకుండానే కేటాయింపులు చేసిందన్నారు. కేంద్రం తరఫు న్యాయవాది జయప్రకాశ్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే కేంద్రం తుది జాబితా ప్రకటించిందని, అభ్యంతరాల నిమిత్తం జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నిసార్లు తుది కేటాయింపులు జరుపుతారని ప్రశ్నిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి
తుది జాబితా విడుదల చేసిన కేంద్రం ప్రత్యూష్‌సిన్హా సిఫార్సులకే ప్రాధాన్యం బాబు ముఖ్యకార్యదర్శి సహానీ తెలంగాణ కు.. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆంధ్రాకు హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది సిఫారసుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేస్తూ కేంద్ర సిబ్బంది, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టులో జారీ చేసిన తాత్కాలిక జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. 20 మంది వరకు అధికారుల కేటాయింపులు మారాయి. డెరైక్ట్ రిక్రూట్ ఐఏఎస్ పోస్టులు 261 ఉండగా ప్రస్తుతం అందుబాటులో 191 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు 113 కాగా.. ప్రస్తుతం 103 మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. డెరైక్ట్ రిక్రూటీల్లో ఆంధ్రాకు 108 మందిని, తెలంగాణకు 83 మందిని కేటాయించగా.. పదోన్నతి పొందిన అధికారుల్లో ఏపీకి 57 మందిని, తెలంగాణకు 46 మందిని కేటాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 165 మంది అధికారులను, తెలంగాణకు 129 మంది అధికారులను కేటాయించారు. అలాగే మొత్తం 256 ఐపీఎస్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 211 మంది అధికారులు అందుబాటులో ఉన్నారు. వీరిలో డెరైక్ట్ రిక్రూటీలు 142 మంది, ప్రమోషన్ అధికారులు 69 మంది ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మంది, తెలంగాణకు 92 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. కాగా, ఐఎఫ్ఎస్ పోస్టుల సంఖ్య 147 ఉండగా.. ప్రస్తుతం 127మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. ఆంధ్రాకు పీవీ రమేష్... తెలంగాణకు బినయ్‌కుమార్.. తాత్కాలిక జాబితాలో తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ పీవీ రమేష్‌ను తుది జాబితాలో మాత్రం ఆంధ్రాకు కేటాయించారు. కాగా, తాత్కాలిక జాబితాలో మార్పులకు కారణమైన ఐఏఎస్ బినయ్‌కుమార్ తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఏపీ సహానీతో పాటు ఐఏఎస్‌లు చందనాఖన్, ఎస్పీ సింగ్, అజయ్‌జైన్ కూడా తాజాగా తెలంగాణకు వచ్చారు. ఇక తనను ఆంధ్రాకు కేటాయించాలంటూ జెఎస్వీ ప్రసాద్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. తెలంగాణలో ఉన్న బీపీ ఆచార్యను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మొన్నటి వరకు హెచ్ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరించిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను తాజాగా ఏపీకి కేటాయించారు. అలాగే పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలిని మిశ్రా కూడా ఏపీకి దక్కారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేష్‌కుమార్‌ను కూడా ఆంధ్రాకు కేటాయించారు. అయితే ఈ తుది కేటాయింపులపైనా పలువురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలు చెప్పడానికి పక్షం రోజులు గడవు కోరుతామని వారు చెబుతున్నారు. ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కృష్ణారావు, చిర్రావూరి విశ్వనాధ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీ విజయకుమార్, ఎల్వీ సుబ్రమణ్యం, అజయ్ కల్లం, ఆర్ సుబ్రమణ్యం, డీ సాంబశివరావు, ఎ.గిరిధర్, ఎ.శాంతికుమారి, కేఎస్ జవహర్‌రెడ్డి, జి.సాయిప్రసాద్, కె.విజయానంద్, ఎంటీ కృష్ణబాబు, నాగులాపల్లి శ్రీకాంత్, కాటంనేని భాస్కర్, వినయ్‌చంద్ వాడరేవు, నారాయణ భరత్‌గుప్తా, అమ్రపాలి కాటా, వి.విజయరామారాజు, ముద్దాడ రవిచంద్ర, జె.శ్యామలరావు, రేవు ముత్యాలరాజు, కేవీఎన్ చక్రధర బాబు, ఎ. మల్లిఖార్జున, సగిలి షాన్మోహన్, బి. శాంబాబ్, పి. వెంకటరమేష్‌బాబు, డి. శ్రీనివాసులు, కె.ప్రవీణ్‌కుమార్, బి.రాజశేఖర్, కాంతిలాల్ దండే, కోన శశిధర్, గంథం చంద్రుడు, ముధావత్ ఎం నాయక్, ఇంద్రజిత్‌పాల్, ఆర్పీ వాటల్, సత్యనారాయణ మహంతి, ఎస్పీ టక్కర్, శ్యాంకుమార్ సిన్హా, లింగరాజు పాణిగ్రహి, బీపీ ఆచార్య, దినేష్‌కుమార్, భన్వర్‌లాల్, ప్రీతి సుధాన్, అనిల్ చంద్ర పునేటా, ఏఆర్ సుకుమార్, నీలం సహాని, సమీర్‌శర్మ, వీణా ఈష్, మన్మోహన్సింగ్, జగదీశ్చంద్ర శర్మ, అభయ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరభ్‌కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాసు, పూనం మాలకొండయ్య, శాలినీ మిశ్రా, సోమేష్‌కుమార్, శంశాక్ గోయల్, రజత్‌కుమార్, సుమితా దావ్రా, జి.అశోక్‌కుమార్, జయేష్ రంజన్, వికాష్ రాజ్, గోపాల్‌కృష్ణ ద్వివేది, లవ్ అగర్వాల్, పీయూష్ కుమార్, వి.శేషాద్రి, ఎస్.సురేష్‌కుమార్, సౌరభ్‌గౌర్, ప్రవీణ్‌కుమార్, వివేక్‌యాదవ్, కార్తికేయ మిశ్రా, శ్వేతా మొహం తి, శ్వేత తియోతియా, ఎల్ఎస్ బాలాజీరావు, గగ న్దీప్ సింగ్, పి.రవి సుభాష్, హిమన్షు శుక్లా, జి.జయలక్ష్మీ, శశిభూషణ్‌కుమార్, ఎన్.గుల్జార్, సాల్మన్ ఆర్యోగరాజు, ఎ.బాబు, ఎన్.యువరాజ్, ఎం.జానకి, డి.రోనాల్డ్ రోజ్, బాలాజీ దిగంబర్ మంజులే, జె.నివాస్, హరినారాయణ్, ప్రసన్న వెంకటేష్, కె. విజయ, టి.రాథ, విజయకుమార్, ఆర్.క రికాల వల వన్, రాం ప్రకాష్ సిసోడియా, యోగితా రాణా, జి.వీరపాండ్యన్, జి.లక్ష్మీషా, జె.రామానంద్, జి.అనంతరాము, ఎస్ఎస్ రావత్, ముఖేష్‌కుమార్ మీనా, పీఎస్ ప్రద్యుమ్న, ఎస్.నాగలక్ష్మి, ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.మధుసూధనరావు, ఎంవీ సత్యానారాయణ, వైవీ అనురాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, కె.రాంగోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, కె.సునీత, జి.వాణిమోహన్, డి.వరప్రసాద్, రాం శంకర్ నాయక్, బి.శ్రీధర్, జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, కేఎస్ శ్రీనివాస్‌రాజు, కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి, ఎన్.గిరిజాశంకర్, జి.రవిబాబు, విజయ్‌మోహన్, ఎన్.కృష్ణ, కేవీ రమణ, పి.వెంకట్రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం, ఎం. జగన్నాథం, ఐ.శ్యామ్యూల్ అనంద్‌కుమార్, వి.కరుణ, కేవీ సత్యానారాయణ, హెచ్.అరుణకుమార్, ఎం.పద్మ, పి.ఉషాకుమారి, పీఏ శోభ, కె.హర్షవర్థన్, పి.భాస్కర్, ఎం.హరి జవహర్లాల్, టి.బాబూరావు నాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయ్‌రెడ్డి, జె.మురళీ, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరిబాబు, డి.మురళీధర్‌రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్. సత్యనారాయణ, పి.బంసత్కుమార్, బి.రామారావు, ఎ.సూర్యకుమారి, జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఏఎండీ ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి, బి.కిషోర్. ఐపీఎస్ అధికారులు... అశోక్ ప్రసాద్, ఎస్ఏ హుడా, వివేక్ దూబే, డాక్టర్ బి.భూపతి బాబు, ఈష్ కుమార్, వీఎస్కే కౌముది, ఆర్పీ ఠాకూర్, వినయ్ రంజన్ రే, టీఏ త్రిపాఠి, సంతోష్ మెహ్రా, కేఆర్ఎం కిషోర్ కుమార్, అంజనీ కుమార్, అంజనా సిన్హా, మహ్మద్ అహసాన్ రజా, హరీష్ కుమార్ గుప్తా, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠీ ఉజేలా, అభిలాష్ బిష్ట్, అతుల్ సింగ్, డాక్టర్ ఎస్బీ బగ్చీ, భావన సక్సేనా, మహేష్ చంద్ర లడ్హా, మనీష్ కుమార్ సిన్హా, నవీన్ గులాటి, యస్. శ్యాంసుందర్, సర్వశ్రేష్ట త్రిపాఠి, షిమోషీ, భాస్కర్ భూషణ్, రాహుల్‌దేవ్ శర్మ, అభిషేక్ మహంతి, వరుణ్ బీఆర్., ఆద్నాన్ న యీం అస్మీ, ఐశ్వర్య రస్తోగి, మహేష్ మురళీధర్ భగవత్, విజయ్ కుమార్, రాజేష్ కుమార్, ఆర్.జయలక్ష్మి, యస్.సెంథిల్ కుమార్, అన్బురాజన్ కేకేఎన్, కె.శశికుమార్, టి.కృష్ణరాజు, నళిన్ ప్రభాత్, డాక్టర్ ఎ.రవిశంకర్, గ్రేవాల్ నవదీప్ సింగ్ కేఎస్, విశాల్ గున్నీ, సిద్ధార్థ కౌశల్, డి.గౌతం సవాంగ్, రాజీవ్ కుమార్ మీనా, వినీత్ బ్రిజిలాల్, ఫకీరప్ప కాగినెల్లి, వి.వేణుగోపాలకృష్ణ, జి.సూర్యప్రకాశరావు, బి.శ్రీనివాసులు, పి.ఉమాపతి, ఇ.దామోదర్, బి.బాలకృష్ణ, అబ్రహాం లింకన్, ఎ.సుందర్ కుమార్ దాస్, టి.యోగానంద్, కె.వెంకటేశ్వరరావు, యం.శివప్రసాద్, ఏ.రవిచంద్ర, డి.రామక్రిష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డాక్టర్ యం.కాంతారావు, పీవీఎస్ రామకృష్ణ, కేవీవీ గోపాలరావు, బి.వి.రమణ కుమార్, పి.హరికుమార్, సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు, డాక్టర్ యం.నాగన్న, ఏ.ఎస్.ఖాన్, ఐ.సత్యనారాయణ, ఐ.ప్రభాకర్రావ్, జి.శ్రీనివాస్, డి.నాగేంద్ర కుమార్, టి.రవికుమార్ మూర్తి, కె.కోటేశ్వరరావు, ఎల్ కేవీ రంగారావు, పి.వెంకటరామిరెడ్డి, జి.పాలరాజు, జి.వి.జి.అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్.హరికృష్ణ, యం.రవిప్రకాష్, ఎస్.వి.రాజశేఖర్ బాబు, కె.వి.మోహన్‌రావు, పీహెచ్డీ రామకృష్ణ, డాక్టర్ సిహెచ్ శ్యాంప్రసాద్‌రావు, జాస్తి వెంకటరాముడు, ఎన్.సాంబశివరావు, యం.మాలకొండయ్య, ఎన్వీ సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌డీ తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ఎన్.మధుసూధన్‌రెడ్డి, కొల్లి రఘురాంరెడ్డి, ఆకే రవికృష్ణ, గజరావ్ భూపాల్, కోయ ప్రవీణ్, భూసారపు సత్య ఏసుబాబు, వెంకట అప్పలనాయుడు చింతం, ఎన్.సంజయ్, కాంతిరాణా టాటా, సీయం త్రివిక్రమ వర్మ, గోపీనాథ్ జెట్టి, బాబూజీ అట్టాడ, బి.ప్రసాదరావ్, ఎస్.వెంకటరమణ మూర్తి, పీవీ సునీల్ కుమార్, చిరువోలు శ్రీకాంత్, విజయరావ్ చంపటపల్లి, బూరుగు రాజకుమారి, పీఎస్ఆర్ ఆంజనేయులు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు.. డి.లక్ష్మీ పార్థసారథి భాస్కర్, సీబీ వెంకటరమణ, ఎంజీ గోపాల్, వీకే అగర్వాల్, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, పుష్పా సుబ్రమణ్యం, జేఎస్.వెంకటేశ్వర ప్రసాద్, వై.శ్రీలక్ష్మీ, కె.రామకృష్ణారావు, సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, స్మితా సభర్వాల్, కె.శశాంక, జి.శ్రీజన, సి.సుదర్శన్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ హనుమంత్, బి.వెంకటేశం, ఎన్.శ్రీధర్, ఎ.విద్యాసాగర్, ఎం.దానకిషోర్, హరికిరణ్ చెవ్వూరు, కె.ప్రదీప్ చంద్ర, రాహుల్ బొజ్జా, హరిచందన దాసరి, శివశంకర్ లోతేటి, గొర్రెల సువర్ణ పండాదాస్, ఆర్ భట్టాచార్య, చందనాఖన్, ఏకే ఫరీదా, రాజీవ్ శర్మ, ఎస్పీ సింగ్, రణదీప్ సుధాన్, వినయ్ కుమార్, రంజీవ్ ఆర్ ఆచార్య, శైలేంద్ర కుమార్ జోషి, అజయ్‌మిశ్రా, అజయ్ ప్రకాష్ సహానీ, సుతీర్థ భట్టాచార్య, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, అదర్‌సిన్హా, రజత్ భార్గవ, సునీల్ శర్మ, హరిప్రీత్‌సింగ్, అజయ్ జైన్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, ప్రవీణ్ ప్రకాష్, నవీన్ మిట్టల్, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సిద్ధార్థ జైన్, గౌరవ్ ఉప్పల్, పౌసుమీ బసు, సర ్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, శ్రుతి ఓజా, అద్విత్ కుమార్‌సింగ్, సంజయ్ కుమార్, అహ్మద్ నదీమ్, సందీప్‌కుమార్ సుల్తానీయా, నీతూకుమారీ ప్రసాద్, కె.ఇల్లంబర్తి, కె.మాణిక్యరాజ్, రజత్ కుమార్ షైనీ, భారతీ హోలికేరీ, అలగ వర్షిణి, ఆర్వీ కర్ణన్, హీరాలాల్ సమారియా, ఐ.రాణీకుముదినీ, జ్యోతి బుద్ధ ప్రకాష్, డీఎస్ లోకేష్‌కుమార్, సుధామ్రావు, బీఆర్ మీనా, అరవింద్ కుమార్, బెనహర్ మహేష్‌దత్ ఎక్కా, క్రిస్టియానా జడ్ చోంగ్తూ, ప్రీతిమీనా, బి.అరవిందరెడ్డి, బి.వెంకటేశ్వరావు, ఎన్.శివశంకర్, ఎం జగదీశ్వర్, సి పార్థసారథి, వీఎన్ విష్ణు, ఆర్వీ చంద్రవదన్, జీడీ అరుణ, వి.అనిల్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, ఎల్.శశిధర్, జి.వెంకట్రామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, అనితా రాజేంద్ర, సయ్యద్ ఓమర్ జలీల్, ఎం జగన్మోహన్, ఎ.దినకర్‌బాబు, జి.కిషన్, ఎం.రఘునందరావు, టి.చిరంజీవులు, జీడీ ప్రియదర్శిని, టి.విజయకుమార్, పి.సత్యానారాయణరెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీం, టీకే శ్రీదేవి, బి.బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, ఎల్.శర్మన్, పార్వతీ సుబ్రమణ్యన్, ఎ.శరత్, ఎం.చంపాలాల్, ఎ.మురళి, బి.భారతీ లక్పతి నాయక్, బి.విజయేంద్ర, కేవై నాయక్, పి.వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, డాక్టర్ ఏంవీ రెడ్డి, డి.వెంకటేశ్వరరావు, ఎ.శ్రీదేవసేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అరవిందర్‌సింగ్ ఐపీఎస్ అధికారులు... టి.పి.దాస్, నవీన్ రంజన్ వాసన్, అనురాగ్ శర్మ, సుధీప్ లక్టాకియా, రాజీవ్ త్రివేది, ప్రభాకర్ అలోక, వి.కె.సింగ్, ఎ.ఆర్.అనురాధ, ఉమేష్ షరాఫ్, రవిగుప్త, రాజీవ్ రతన్, జితేందర్, సందీప్ శాండిల్యా, వినాయక్ పి ఆప్టే, డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖాగోయల్, రీతూ మిశ్రా, దేవేంద్రసింగ్ చౌహాన్, విక్రంసింగ్ మాన్, అకున్ సబర్వాల్, తరుణ్ జోషి, విక్రమ్‌జీత్ దుగ్గల్, తఫ్సీర్ ఇగ్బాల్, అంబర్ కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్, విజయకుమార్ ఎస్ఎం, విష్ణు ఎస్ వారియర్, వి.సి.సజ్జనార్, సంజయ్ కుమార్ జైన్, షాన్వాజ్ ఖాసీం, డి.జోయల్ దావిస్, భాస్కరన్ ఆర్, సత్యనారాయణ్, గోవింద్ సింగ్, అనిల్‌కుమార్, రామరాజేశ్వరి ఆర్, కల్మేశ్వర్ సింగన్వార్, డాక్టర్ బి.ఎల్.మీనా, స్వాతి లక్రా, కార్తీకేయన్, వి.నవీన్‌చంద్, యం.కె.సింగ్, కె.వేణుగోపాల్ రావు, టి.వి.శశిధర్ రెడ్డి, వై.గంగాధర్, జి.సుధీర్ బాబు, టి.ప్రభాకర్‌రావు, పి.ప్రమోద్ కుమార్, ఎన్.శివశంకర్ రెడ్డి, డాక్టర్ వి.రవీందర్, వి.శివకుమార్, వి.బి.కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, యం.రమేష్, ఎస్.జె.జనార్దన్, ఎ.వి.రంగనాథ్, బి.సుమతి, యం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావు, ఎన్.సూర్యనారాయణ, ఆర్.బి.నాయక్, టి.మురళీకృష్ణ, పి.మునిస్వామి, సి.రవివర్మ, ఎ.సత్యనారాయణ, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, అరుణ బహుగుణ, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయూం ఖాన్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, మహీందర్‌రెడ్డి, జె.పూర్ణచంద్రరావ్, సి.వి.ఆనంద్, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, చారుసిన్హా, యారం నాగిరెడ్డి, అవినాష్ మహంతి, నేలకొండ ప్రకాష్‌రెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, బి.నవీన్ కుమార్, విశ్వజిత్ కంపతి, టి.కృష్ణప్రసాద్, యం.గోపీకృష్ణ, డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, జి.చందనా దీప్తి, చేతన మైలాబత్తుల -
ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే
అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు డిసెంబర్ 31లోగా గడువు తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులు తవు ఆస్తుల వివరాలు ఇవ్వకుండా మొండికెస్తే.. ఇకపై కష్టమే! అంతేకాదు ఏమాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినా.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారులు తవు ఆస్తుల వివరాలపై కచ్చితమైన సవూచారం వెల్లడించాల్సిందే. దీనిపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అఖిల భారత సర్వీసు అధికారులు ఇచ్చే సమాచారం ఇకపై లోక్‌పాల్ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఆస్తుల వివరాల వెల్లడికి ప్రస్తుతం సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఆస్తుల వెల్లడిలో కచ్చితత్వం లేకుంటే.. క్రిమినల్ చర్యలు ఉంటాయని పేర్కొంది. భార్య/భర్త ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో లేదా బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న పక్షంలో వారి వేతన వివరాలను అధికారులు సీల్డ్ కవర్లో వెల్లడించాలని కూడా కోరింది. ఇప్పటి వర కు అధికారులు ప్రతీ సంవత్సరం తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నా శాఖాపరమైన అంశంగా ఉండేది. లోక్‌పాల్ చట్టం రావడంతో ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేం ద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇవ్వని పక్షం లో సదరు ఐఏఎస్ అధికారులను కేంద్ర డిప్యుటేషన్, విదేశీ పర్యటనలకు అనుమతించకుండా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉం టుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఢిల్లీ లో నిర్వహించిన అన్ని రాష్ట్రాల సాధారణ పరి పాలన శాఖ ముఖ్యకార్యదర్శుల (పొలిటికల్) సమావేశంలో వెల్లడించింది. ప్రస్తుతం అఖిల భారత సర్వీసు అధికారులకు మాత్రమే అమలు చేస్తున్న ఈ నిబంధనలను త్వరలో రాష్ట్ర కేడర్ అధికారులకు కూడా వర్తింప చేయనున్నారు. అధికారులను త్వరగా కేటాయించండి... అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డీవోపీటీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున మిడ్ కేడర్ స్ట్రెంత్ సమీక్షను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. రెండేళ్ల క్రితం చేసిన ఈ సమీక్షలో అప్పట్లో 349 మందిగా ఉన్న కేడర్ సంఖ్యను 374కు మార్చారని వివరించిం ది. కొత్త రాష్ట్రం ఏర్పడినందున దానిని సమీక్షిం చి అధికారుల సంఖ్యను నిర్ధారించాలని రాష్ట్రం కోరింది. అధికారుల కొరతతో పాలనా వ్యవహా రాలు గాడిలో పడడం లేదని రాష్ట్రం నుంచి హాజరైన అజయ్‌మిశ్రా కేంద్రానికి వివరించారు. స్వీయ ధ్రువీకరణ... ప్రజలు న్యాయ సంబంధ అంశాల్లో మినహా మిగిలిన అంశాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుందని డీవోపీటీ సూచించిందని అజయ్‌మిశ్రా చెప్పారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం 90 శాతంపైగా అంశాల్లో స్వీయ ధ్రు వీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటోం దని, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తనిఖీ చేసుకోవచ్చని, ప్రతీదానికి అఫిడవిట్ లేదా గెజిటెడ్ అధికారులతో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు, దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఎలా చేయాలన్నది నిర్ణయిస్తావుని చెప్పారు. అధికారుల కేటాయింపుల్లో మార్పులు కొందరు ఐఏఎస్‌లు మారే అవకాశం 15న ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అఖిల భారత సర్వీసు అధికారుల తాత్కాలిక కేటాయింపులో 20 మంది వరకు ఐఏఎస్ అధికారుల మార్పులు ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. తాత్కాలికంగా జరిపిన కేటాయింపుల్లో జరిగిన పొరపాట్లతో పాటు, అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చిన లోపాలపై ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 15న చ ర్చించనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న వారు రాష్ట్రానికి బది లీపై వచ్చినప్పుడు వారిని రాష్ట్ర కేడర్‌లోని సంబంధిత బ్యాచ్‌లో చివరలో చేర్చడం ఆనవాయితీ. కొందరు అధికారులు కేంద్ర సర్వీసు సీనియారిటీనే కొనసాగించారు. దీన్ని సవరించాల్సి ఉంది. దీంతో అధికారుల రోస్టర్ విధానంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశంలో వీటన్నింటినీ సవరించి తాజా జాబితాను రూపొందించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీవోపీటీ)కు సమర్పించనున్నారు. ఈ జాబితాను అక్కడి నుంచి ప్రధానికి పంపిస్తారు. ఆయన ఆమోదం తెలపగానే అధికారుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ అవుతుంది. భార్యాభర్తలు, డిప్యుటేషన్, అంతరాష్ట్ర కేడర్ బదిలీ తదితర అంశాలకు సంబంధించి అధికారులు చేసుకునే దరఖాస్తులను మూడు నెలల్లోగా కేంద్రం పరిష్కరిస్తుందని తెలిపాయి. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయడానికి ఆప్షన్స్ ఇచ్చిన భార్యాభర్తల విషయంలో మా ర్పు ఉండబోదని చెప్పాయి. రాజకీయ అనుబంధమున్న అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, ఆప్షన్ల ప్రకారం కేటాయింపులు జరగని అధికారులు మానసికంగా మథనపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. -
ఐఏఎస్ కేటాయింపుల్లో మార్పులు
ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మారనున్న రోస్టర్ ఈనెల 18 లోపు ప్రత్యూష్ సిన్హా తుది సమావేశం నెలాఖరులోగా పంపిణీ పూర్తి హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాలు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఈనెల 18 లోపు సమావేశమై ఇదివరకు జరిపిన తాత్కాలిక కేటాయింపుల్లో జరిగిన లోపాలను సవరించి, తుది జాబితాను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(డీవోపీటీ) పంపించనుంది. ఐఎఫ్ఎస్ కేడర్ అధికారుల జాబితాను అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఐపీఎస్‌లది హోం శాఖ, ఐఏఎస్‌ల జాబితాను డీవోపీటీపరిశీలించనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత తాత్కాలిక కేటాయింపుల్లో ఐఏఎస్‌లు జేఆర్ ఆనంద్, రాణి కుముదినిలను ఇన్సైడర్ (రాష్ట్రానికి చెందినవాళ్లు) కేటగిరీలో చేర్చారు. వాస్తవంగా రాణి కుముదినీని జమ్ము-కాశ్మీర్ కేడర్‌కు కేటాయించారు. ఆమె ఆనారోగ్య కారణాలతో బదిలీపై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. దీంతో ముందు కేటాయించిన కేడర్‌నే ఆమెకు వర్తింపచేయనున్నారు. దీనితో ఇన్‌సైడర్‌గా ఉన్న రాణికుముదిని ఔట్‌సైడర్(రాష్ట్రేతరులు)గా పరిగణించడంతో... ఎస్సీ ఐఏఎస్ కేడర్‌లో రోస్టర్ బాండ్ విధానం మారిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన డాక్టర్ పీవీ రమేశ్ ఆంధ్రాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే జేఆర్ ఆనంద్‌ను ఇన్‌సైడర్‌గా గుర్తించారు. వాస్తవంగా ఆయన ఒడిశాకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఆంధ్రా ఇన్‌సైడర్‌గా భావించి కేటాయించారు. ఇప్పుడు వీరిద్దరినీ రాష్ట్రేతరులుగా పరిగణించాల్సి రావడం వల్ల.. ఎస్సీ, ఎస్టీ కేడర్ అధికారుల రోస్టర్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. అలాగే ఆంధ్రాకు కేటాయించిన బీఆర్ మీనా తెలంగాణకు వచ్చే అవకాశముంది. అలాగే ఓబీసీ కేటగిరీలో శ్యామలరావును ముందు ఒడిశా రాష్ట్రానికి కేటాయించారు. ఆయన అంత ర్రాష్ట బదిలీతో రాష్ట్రానికి వ చ్చారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన కేడర్ కేటాయింపులోనే తప్పు జరిగిందని, కోర్టు నుంచి శ్యామలరావు ఉత్తర్వులు తెచ్చుకున్నం దున ఆయనను ఆంధ్రా కేడర్ ఇన్సైడర్గానే గుర్తిం చనున్నారు. కాగా ఆంధ్రా నుంచి డెరైక్టర్ రిక్రూటీలు ఎక్కువగా ఉన్నందున.. తెలంగాణకు కొందరు పనిచేయక తప్పదని ఓ అధికారి తెలిపారు. భార్యాభర్తల విషయంలో..: భార్యాభర్తల విషయంలో పాత నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఒకేచోట పనిచేయడానికి అవకాశం ఉందని ఆ వర్గాలు వివరించాయి. డీవోపీటీ కేటాయింపులు చేసే సమయంలో వీటిని సరిచేసే అవకాశం ఉందని అంటున్నారు. భార్యాభర్తలైన అధికారులు కలసి పనిచేయాలని కోరినా.. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాలని కోరినా అందుకు అంగీకరిస్తారని ఓ ఉన్నతాధికారి వివరించారు -
నేటితో ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రక్రియ పూర్తి..
సివిల్ సర్వెంట్ల అభ్యంతరాలను పరిశీలించనున్న కమిటీ తుది నివేదికను డీవోపీటీకి ఇవ్వనున్న కమిటీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ పని మంగళవారంతో పూర్తి కానుంది. ఆగస్టు 22న సమావేశమైన కమిటీ రెండు రాష్ట్రాలకు అఖిల భారత అధికారులను తాత్కాలికంగా కేటాయించడం తెలిసిందే. ఈ కేటాయింపులపై గతనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిపై మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై చర్చించనుంది. దీనిలో కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు పాల్గొంటారు. ప్రధానంగా భార్యాభర్తలు, డెప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, అనారోగ్యంతో బాధపడుతున్న అధికారుల నుంచి అభ్యంతరాలు అందినట్టు సమాచారం. భార్యాభర్తలకు సంబంధించి మొత్తం 12 మందితోపాటు, పైన పేర్కొన్న కారణాలతో దరఖాస్తు చేసుకున్న 32 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలనకు తెలంగాణ సర్కార్ పంపించింది. తెలంగాణలో పనిచేయడానికి ఈ 32 మంది అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో .వారి పేర్లను ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీకి పంపింది. అధికారులు ఇచ్చిన దరఖాస్తుల్లో సహేతుకమైనవాటిని పరిశీలించి కమిటీ మార్పులు చేర్పులు చేయనుంది. అయితే వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆమోదించాలన్న నిబంధనేదీ లేదని అధికారవర్గాలు తెలిపాయి. డీవోపీటీ నిబంధనల మేరకు అధికారులను కేటాయించనున్నారు. నివేదికను ప్రధాని ఆమోదించాక శాశ్వతంగా అధికారుల కేటాయింపు జరుగుతుంది. అది ఈనెల 15 లోగా పూర్తవుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
ఐఏఎస్‌ల రోస్టర్‌పై నేడు డ్రా
* ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలో తేల్చనున్న ప్రత్యూష్ సిన్హా కమిటీ * రోస్టర్ అనివార్యమైన అధికారుల్లో టెన్షన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించి రోస్టర్ విధానం ఏ రాష్ర్టం నుంచి ప్రారంభించాలనే అంశంపై శనివారం ఢిల్లీలో జరిగే సమావేశంలో డ్రా తీయనున్నారు. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు ఐఏఎస్‌ల సంఘం కార్యదర్శి రేమండ్ పీటర్, ఐఎఫ్ఎస్ల సంఘం నుంచి చోట్రాయ్, ఐపీఎస్‌ల సంఘం నుంచి మాలకొండయ్య పాల్గొననున్నారు. డ్రా అనంతరం నిబంధనల మేరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీకి వారంరోజుల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అరుుతే ఇప్పటివరకు పంపకం ఎప్పుడు జరుగుతుందా..? అని ఎదురు చూసిన ఐపీఎస్ అధికారుల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏపీకే చెందినవారై, రోస్టర్ విధానం అనివార్యమైన అధికారులతో పాటు రోస్టర్ విధానమే శరణ్యమైన రాష్ట్రేతరుల్లోనూ టెన్షన్ నెలకొని ఉంది. కమిటీ చేపట్టే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీ, తెలంగాణల నుంచి ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందం వెళ్తోంది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియను మొదలుపెట్టిన సిన్హా కమిటీ మేలో ఐపీఎస్‌ల నుంచి ఆప్షన్లతో పాటు ఎక్కడకు కేటాయిస్తే అక్కడకు వెళ్తామంటూ హామీ పత్రాన్ని కూడా తీసుకుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ ఏడాది మేలోనే ఏపీకి 144 ఐపీఎస్ పోస్టులు కేటాయించింది. ఐపీఎస్ పోస్టుల భర్తీ రెండు రకాలుగా జరుగుతుంది. యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఎంపికయ్యే వారిని డెరైక్ట్ రిక్రూటీలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డీఎస్పీగా ఎంపికై, నిర్ణీత సర్వీసు పూర్తి చేసుకున్న తరవాత ఐపీఎస్ హోదా పొందే వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పరిగణిస్తారు. సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో ప్రతి 100 పోస్టులకు 67 మంది డెరైక్ట్ రిక్రూటీలు, 33 మంది కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఉండాలి. ఈ లెక్క ప్రకారం సీమాంధ్రకు 101 డెరైక్ట్ రిక్రూట్, 43 కన్ఫర్డ్ పోస్టులు, తెలంగాణకు 78, 34 చొప్పున కేటాయించారు. 67% డెరైక్ట్ ఐపీఎస్ పోస్టుల్లోనూ 2/3 వంతు బయటి రాష్ట్రాలకు చెందిన వారు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉండాలి. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటే డిప్యుటేషన్లపై ఆ లోటును పూడుస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులైన కన్ఫర్డ్, డెరైక్ట్ ఐపీఎస్‌ల సంఖ్య నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో అదనంగా ఉన్న ఈ అధికారుల్ని రోస్టర్ పద్దతిలో రెండు రాష్ట్రాలకూ పంచాల్సిన అవసరం ఏర్పడింది. సీనియర్లను మినహారుుంచి అత్యంత జూనియర్లను ఈ జాబితాలోకి తీసుకుంటారు. వీరికి తోడు రాష్ట్రేతర అధికారుల్నీ ఈ విధానంలోనే పంచనున్నారు. ప్రస్తుతం కీలక పోస్టుల్లో పని చేస్తున్న టీపీ దాస్, ఏఆర్ అనురాధ, ఆర్పీ ఠాకూర్, వీఎస్కే కౌముది, హరీష్‌కుమార్ గుప్తా తదితరులంతా ఏపీ రాష్ట్రేతరులే. అయితే వీరిలో అనురాధ మాత్రమే పూర్తి సేఫ్ జోన్లో ఉన్నారు. ఆమె రోస్టర్ ప్రకారం ఏ రాష్ట్రానికి వెళ్లినా... భర్త సురేంద్రబాబు రాష్ట్రానికే చెందిన అదనపు డీజీ కావడంతో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధ కేటాయింపునకు ఢోకా లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ డీజీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి భద్రతల విభాగం ఐజీ హరీష్‌కుమార్ గుప్తా ఇతర సిబ్బందితో కలిసి జెండాను ఎగుర వేశారు. -
వీలైనంత త్వరగా ఉద్యోగుల పంపిణీ : జితేందర్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, అఖిలభారత సర్వీసు అధికారుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ జేడీ శీలం అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘రాష్ట్ర విభజన జరగగానే అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేశాం. తుది కేటారుుంపు ప్రక్రియ పూర్తిచేసేందుకు అపాయింటె డ్ డే జూన్ 2 నుంచి ఏడాది కాలం పాటు మాకు గడువు ఉంది. అంతకంటే ముందుగానే పంపిణీ పూర్తిచేస్తాం. సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. ఆ కమిటీ అందరితో సంప్రదింపులు జరిపింది. స్థానికత, ఆప్షన్లు ఇలా అనేక రకాల అంశాలతో పూర్తి పారదర్శకతతో ఈ పంపిణీ ఉంటుంది. అందువల్లే కొంత సమయం తీసుకుంటున్నాం. కేటాయింపు వివరాలను ప్రకటించిన తరువాత ప్రతి అధికారి నుంచి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తాం. అలాగే రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి కమల్‌నాథన్ కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించే పనిలో ఉంది...’ అని పేర్కొన్నారు. జేడీ శీలం మాట్లాడుతూ.. ‘శాశ్వత కేటాయింపులు లేకపోవడంతో పాలనలో అనిశ్చితి నెలకొంది. అధికారులు తమ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియక, విధులు సక్రమంగా నిర్వర్తించలేని గందరగోళంలో ఉన్నారు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రధాని సమావేశం ఏర్పాటుచేయాలి..’ అని కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ ‘ఎఫ్ 18 నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనిని సమీక్షించాలి. పాలన సజావుగా సాగడం లేదు’ అని పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.ఎస్.చౌదరి సైతం పాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు. సభ్యులంతా ఉద్యోగుల పంపిణీకి కచ్చితమైన గడువు చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ‘కొన్ని వారాల్లోనే పూర్తవ్వొచ్చు..’ అని మంత్రి చెప్పారు. -
‘పంపకాల’ పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్‌లు
రెండు రాష్ట్రాల నుంచి పంపుతున్న అధికారుల సంఘం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాన్ని ప్రత్యూష సిన్హా కమిటీ శనివారం చేపడుతోంది. దీన్ని పరిశీలించేందుకు రెండు రాష్ట్రాల నుంచి అధికారుల్ని పంపాల్సిందిగా ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కమిటీ కోరింది. ఈ ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేసేందుకు సంఘం బుధవారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భేటీ అయింది. తాత్కాలిక కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పని చేస్తున్న ఐదుగురిని ఎంపిక చేసింది. క్యాడర్ కేటాయింపులో రోస్టర్ విధానాన్ని అవలంభిస్తున్న కమిటీ సీనియర్ నుంచి జూనియర్ వరకు జాబితా రూపొందిస్తుంది.కేటాయింపు ఏ రాష్ట్రం నుంచి ప్రారంభంకావాలనే అంశాన్ని టాస్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ టాస్ ప్రక్రియను పరిశీ లించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు శివధర్‌రెడ్డి, విశ్వనాథ రవీందర్, ఉమేష్ షరాఫ్, మాలకొండయ్య, స్వాతిలక్రాలను పంపాలని అధికారుల సంఘం నిర్ణయించింది. -
16న అఖిల భారత సర్వీసు అధికారుల విభజన
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల విభజనను ఈనెల 16వ తేదీన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆరోజున ఢిల్లీలో జరిగే సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీని ముందుగా ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలన్న దానిపై లాటరీ వేయనున్నారు. ఆ లాటరీలో వచ్చిన రాష్ట్రం నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. స్థానికత ఆధారంగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జరుగుతుంది. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన అధికారులను మాత్రం రోస్టర్ పద్ధతి ద్వారా ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు ఢిల్లీ వెళ్లనున్నారు. -
తప్పుల కుప్ప యూపీఎస్సీ!
అఖిల భారత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి పెడుతున్న పరీ క్షలపై ఇప్పుడు దేశవ్యాప్త నిరసన రాజుకుంది. హేతుబద్ధతకు వీడ్కో లు పలికి, సమన్యాయాన్ని అటకెక్కించి తరచు చేస్తున్న ఈ ‘సంస్క రణ’లన్నీ సివిల్ సర్వీసుల జోలికి ఎవరూ రాకుండా బెదరగొట్టేందుకే ఉపయోగపడుతున్నాయి. నిరుడు మెయిన్స్ పరీక్షా విధానంలో తీసు కొచ్చిన మార్పులన్నీ ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి అనుకూ లంగా ఉన్నాయని అభ్యర్థులంతా గగ్గోలుపెట్టారు. ఇప్పుడు ప్రిలిమ్స్ లోని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పోతున్న పోకడలపై నిరసనలు ఊపందుకున్నాయి. భిన్నరంగాల్లో దేశాన్ని ముందుకు నడ పాల్సిన కీలక బాధ్యతలను చేపట్టగల సమర్థులెవరని చేయవలసిన అన్వేషణ కాస్తా... యూపీఎస్సీ అనుసరిస్తున్న ధోరణులవల్ల ఎవరికి ఇంగ్లిష్ బాగావచ్చునో, ఆ భాషను ముచ్చటగా మాట్లాడగలవారెవరో తెలుసుకునే పరీక్షగా మారిపోతున్నది. నిరుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మార్పులపై నిరు ద్యోగ లోకం భగ్గుమంది. ప్రాంతీయ భాషలను చిన్నచూపు చూసే ఈ సంస్కరణలు కేవలం ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయని ఎందరెందరో నిరసించారు. డిగ్రీ వరకూ ప్రాంతీయ మాధ్యమంలో చదువుకున్నవారు మాత్రమే పరీక్షను ఆ భాషలో రాయవచ్చని కొత్త నిబంధన విధించింది. అంతేకాదు...ఆ భాషలో రాసే అభ్యర్థులు కనీసం పాతికమంది ఉంటేనే అలా రాయడా నికి అనుమతిస్తామని మెలికపెట్టింది. తగిన సంఖ్యలో అభ్యర్థులు లేని పక్షంలో పరీక్షను హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయాలన్నది. పైగా డిగ్రీలో తమ ప్రాంతీయ భాషను ఆప్షనల్‌గా తీసుకున్నవారు మాత్రమే మెయి న్స్లోనూ దాన్ని ఆప్షనల్‌గా తీసుకోవడానికి అర్హులని మరో నిబంధన పెట్టింది. తీవ్ర నిరసనల తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గినా అభ్య ర్థులు పడుతున్న అసలు బాధలు వేరే ఉన్నాయి. పరీక్షను ప్రాంతీయ భాషలో రాయొచ్చంటున్నారుగానీ ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఇస్తున్నారు. ఇక ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై పెడుతున్న పరీక్ష అత్యంత కఠినంగా ఉంటున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష స్థితి ఇలావుంటే ఇక ప్రిలిమ్స్ స్థాయిలోని సీశాట్ తోనూ, అందులోని పేపర్-2తోనూ అభ్యర్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఇంగ్లిష్, గణిత శాస్త్రాల పరిజ్ఞానాన్ని మా త్రమే పరీక్షించడంద్వారా గ్రామీణ నేపథ్యంగలవారికీ, తెలుగు మాధ్య మంగా ఉన్నవారికీ తీరని అన్యాయం చేస్తున్నారు. సీశాట్ ప్రవేశ పెట్టాక తెలుగు మాధ్యమంగా ఉన్నవారిలో ఉత్తీర్ణతా శాతం క్రమేపీ తగ్గడమే ఇందుకు సాక్ష్యం. అయితే, ఇదే పరీక్ష హిందీ మాధ్యమంగా గలవారికి కూడా తలనొప్పిగా మారడంతో ఇప్పుడు దీనిపై ఉద్యమం దేశవ్యాప్తమయింది. వాస్తవానికి రెండేళ్లక్రితం సీశాట్‌పై గొడవ రాజు కున్నప్పుడు అప్పటి యూపీఏ సర్కారు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక మరికొన్నిరోజుల్లో రాబోతున్నది. ఈలోగానే యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు తయారైంది. అది స్వ యంప్రతిపత్తిగల సంస్థే కావొచ్చుగానీ చుట్టూ జరుగుతున్నదేమిటన్న స్పృహ ఉండాలి. మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. దేశ పాలనా నిర్వహణలో ఈ వైవిధ్యత ప్రతిఫలించాలంటే అన్ని ప్రాం తాలకూ, భాషలకూ, సంస్కృతీ నేపథ్యంగలవారికీ ఆ నిర్వహణలో చోటివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రగతిలో తమకు కూడా భాగ స్వామ్యం ఉన్నదన్న సంతృప్తి అందరిలోనూ కలుగుతుంది. దేశ సమై క్యతకూ, సమగ్రతకూ అలాంటి భావన దోహదపడుతుంది. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి అన్యాయం కలిగే రీతిలో, కేవలం నగరాల్లోని ఖరీదైన కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుకున్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా మొత్తం ప్రక్రియ సాగితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో యూపీఎస్సీకి అర్ధంకావడంలేదు. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేవారిలో రాను రాను ఇంగ్లిష్ ప్రావీ ణ్యం అడుగంటుతున్నదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ‘కాలం చెల్లిన విధానాలకు’ స్వస్తిపలకాలని నిర్ణయించామని యూపీఎస్సీ చెబుతున్నది సబబు కానేకాదు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం తగినంతగా ఉండాలని ఆశించడంలో తప్పులేదుగానీ అది మాత్రమే అభ్యర్థి జయా పజయాలను నిర్ణయించే స్థితి కల్పించడం అన్యాయం. వాస్తవానికి అలాంటివారంతా మౌలికంగా పనిచేయాల్సింది ఈ దేశంలోనే, వ్యవ హరించాల్సిందీ ఈ దేశ ప్రజలతోనే. అలాంటపుడు వారి ఇంగ్లిష్ పరి జ్ఞానంకన్నా... సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను వెదకడంలో, విస్తృత ప్రజానీకానికి మేలు చేకూర్చే అంశాలను సృజనా త్మకంగా ఆవిష్కరించడంలో వారికి ఉండే సమర్ధతను పరీక్షించాలి. వారిలో సమయస్ఫూర్తి, చొరవ, హేతుబద్ధత, అంకితభావం, దృఢ సంకల్పం, నైతికవర్తన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయ గలగాలి. కానీ, యూపీఎస్సీ పెడుతున్న పరీక్షలన్నీ వేరే రకంగా ఉంటున్నాయి. అయితే హిందీకి లేదా ఇంగ్లిష్‌కు పెద్దపీట వేయడం, గణితాన్ని నెత్తికెత్తుకోవడంవంటివి చేస్తూ తరచు అభ్యర్థులకు తల నొప్పి కలిగిస్తున్నది. పరీక్షకొచ్చినవారిని గందరగోళపరచడమే లక్ష్యమ న్నట్టు వ్యవహరిస్తున్నది. ఇన్ని దశాబ్దాల అనుభవంతో సివిల్ సర్వీసు లకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత సమర్ధవంతంగా నిర్వ హించడానికి బదులు దాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నది. యూపీఎస్సీకి తగిన సలహాలిచ్చి దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఉన్నదని పాలకులు ఇప్పటికైనా గుర్తించడం అవసరం. -
ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యూష్ సిన్హా కమిటీ అఖిలభారత సర్వీసు అధికారులను కేటాయించింది. తెలంగాణకు 163 మంది ఐఏఎస్‌లు, 112 మంది ఐపీఎస్‌లు, 65 మంది ఫారెస్ట్ అధికారులన కేటాయించింది. ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు, 144 మంది ఐపీఎస్‌లు, 82 మంది ఫారెస్ట్ అధికారులను కేటాయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తిన చేసి, తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. -
రెండేళ్ల లోపు రిటైరయ్యే వారికే ఆప్షన్!
పీఎంవోకు తుది నివేదిక అందజేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తయింది. తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్టు సమాచారం. కమిటీ సభ్యులు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులతో సమావేశమయ్యారు. మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాల అనంతరం తుది నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపిణీకి సంబంధించి తుది నివేదికలో పొందుపర్చాల్సిన మార్గదర్శకాలపై కమిటీ ఇరు రాష్ట్రాల సీఎస్ల అభిప్రాయాలు కోరింది. కోటాకి మించి ఉన్న అధికారులను ఇవ్వడం, రిటైర్మెంట్ దగ్గరపడిన అధికారుల్లో ఎన్నేళ్ల వారికి ఆప్షన్లు ఇవ్వాలన్న అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగనట్టు తెలిసింది. రెండేళ్లలోపు రిటైర్మెంట్ పొందే వారికి మాత్రమే ఆప్షన్లు ఇస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడినట్టు సమచారం. అనంతరం ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదికను ఖరారు చేసింది. దీనిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పీఎంవోకు పంపినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. వాటిపై అధికారుల అభ్యంతరాలు తెలుసుకుని నెలరోజుల్లోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చే స్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి.