తుది జాబితా విడుదల చేసిన కేంద్రం
ప్రత్యూష్‌సిన్హా సిఫార్సులకే ప్రాధాన్యం
బాబు ముఖ్యకార్యదర్శి సహానీ
తెలంగాణ కు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్
సోమేశ్‌కుమార్ ఆంధ్రాకు
హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది సిఫారసుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేస్తూ కేంద్ర సిబ్బంది, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టులో జారీ చేసిన తాత్కాలిక జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. 20 మంది వరకు అధికారుల కేటాయింపులు మారాయి. డెరైక్ట్ రిక్రూట్ ఐఏఎస్ పోస్టులు 261 ఉండగా ప్రస్తుతం అందుబాటులో 191 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అలాగే కన్‌ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు 113 కాగా.. ప్రస్తుతం 103 మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. డెరైక్ట్ రిక్రూటీల్లో ఆంధ్రాకు 108 మందిని, తెలంగాణకు 83 మందిని కేటాయించగా.. పదోన్నతి పొందిన అధికారుల్లో ఏపీకి 57 మందిని, తెలంగాణకు 46 మందిని కేటాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 165 మంది అధికారులను, తెలంగాణకు 129 మంది అధికారులను కేటాయించారు. అలాగే మొత్తం 256 ఐపీఎస్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 211 మంది అధికారులు అందుబాటులో ఉన్నారు. వీరిలో డెరైక్ట్ రిక్రూటీలు 142 మంది, ప్రమోషన్ అధికారులు 69 మంది ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మంది, తెలంగాణకు 92 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. కాగా, ఐఎఫ్‌ఎస్ పోస్టుల సంఖ్య 147 ఉండగా.. ప్రస్తుతం 127మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు.
ఆంధ్రాకు పీవీ రమేష్... తెలంగాణకు బినయ్‌కుమార్..
తాత్కాలిక జాబితాలో తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ పీవీ రమేష్‌ను తుది జాబితాలో మాత్రం ఆంధ్రాకు కేటాయించారు. కాగా, తాత్కాలిక జాబితాలో మార్పులకు కారణమైన ఐఏఎస్ బినయ్‌కుమార్ తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఏపీ సహానీతో పాటు ఐఏఎస్‌లు చందనాఖన్, ఎస్‌పీ సింగ్, అజయ్‌జైన్ కూడా తాజాగా తెలంగాణకు వచ్చారు. ఇక తనను ఆంధ్రాకు కేటాయించాలంటూ జెఎస్‌వీ ప్రసాద్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. తెలంగాణలో ఉన్న బీపీ ఆచార్యను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మొన్నటి వరకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరించిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను తాజాగా ఏపీకి కేటాయించారు. అలాగే పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలిని మిశ్రా కూడా ఏపీకి దక్కారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేష్‌కుమార్‌ను కూడా ఆంధ్రాకు కేటాయించారు. అయితే ఈ తుది కేటాయింపులపైనా పలువురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలు చెప్పడానికి పక్షం రోజులు గడవు కోరుతామని వారు చెబుతున్నారు.
ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు
ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కృష్ణారావు, చిర్రావూరి విశ్వనాధ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీ విజయకుమార్, ఎల్‌వీ సుబ్రమణ్యం, అజయ్ కల్లం, ఆర్ సుబ్రమణ్యం, డీ సాంబశివరావు, ఎ.గిరిధర్, ఎ.శాంతికుమారి, కేఎస్ జవహర్‌రెడ్డి, జి.సాయిప్రసాద్, కె.విజయానంద్, ఎంటీ కృష్ణబాబు, నాగులాపల్లి శ్రీకాంత్, కాటంనేని భాస్కర్, వినయ్‌చంద్ వాడరేవు, నారాయణ భరత్‌గుప్తా, అమ్రపాలి కాటా, వి.విజయరామారాజు, ముద్దాడ రవిచంద్ర, జె.శ్యామలరావు, రేవు ముత్యాలరాజు, కేవీఎన్ చక్రధర బాబు, ఎ. మల్లిఖార్జున, సగిలి షాన్‌మోహన్, బి. శాంబాబ్, పి. వెంకటరమేష్‌బాబు, డి. శ్రీనివాసులు, కె.ప్రవీణ్‌కుమార్, బి.రాజశేఖర్, కాంతిలాల్ దండే, కోన శశిధర్, గంథం చంద్రుడు, ముధావత్ ఎం నాయక్, ఇంద్రజిత్‌పాల్, ఆర్‌పీ వాటల్, సత్యనారాయణ మహంతి, ఎస్‌పీ టక్కర్, శ్యాంకుమార్ సిన్హా, లింగరాజు పాణిగ్రహి, బీపీ ఆచార్య, దినేష్‌కుమార్, భన్వర్‌లాల్, ప్రీతి సుధాన్, అనిల్ చంద్ర పునేటా, ఏఆర్ సుకుమార్, నీలం సహాని, సమీర్‌శర్మ, వీణా ఈష్, మన్‌మోహన్‌సింగ్, జగదీశ్‌చంద్ర శర్మ, అభయ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరభ్‌కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాసు, పూనం మాలకొండయ్య, శాలినీ మిశ్రా, సోమేష్‌కుమార్, శంశాక్ గోయల్, రజత్‌కుమార్, సుమితా దావ్రా, జి.అశోక్‌కుమార్, జయేష్ రంజన్, వికాష్ రాజ్, గోపాల్‌కృష్ణ ద్వివేది, లవ్ అగర్వాల్, పీయూష్ కుమార్, వి.శేషాద్రి, ఎస్.సురేష్‌కుమార్, సౌరభ్‌గౌర్, ప్రవీణ్‌కుమార్, వివేక్‌యాదవ్, కార్తికేయ మిశ్రా, శ్వేతా మొహం తి, శ్వేత తియోతియా, ఎల్‌ఎస్ బాలాజీరావు, గగ న్‌దీప్ సింగ్, పి.రవి సుభాష్, హిమన్షు శుక్లా, జి.జయలక్ష్మీ, శశిభూషణ్‌కుమార్, ఎన్.గుల్జార్, సాల్మన్ ఆర్యోగరాజు, ఎ.బాబు, ఎన్.యువరాజ్, ఎం.జానకి, డి.రోనాల్డ్ రోజ్, బాలాజీ దిగంబర్ మంజులే, జె.నివాస్, హరినారాయణ్, ప్రసన్న వెంకటేష్, కె. విజయ, టి.రాథ, విజయకుమార్, ఆర్.క రికాల వల వన్, రాం ప్రకాష్ సిసోడియా, యోగితా రాణా, జి.వీరపాండ్యన్, జి.లక్ష్మీషా, జె.రామానంద్, జి.అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ముఖేష్‌కుమార్ మీనా, పీఎస్ ప్రద్యుమ్న, ఎస్.నాగలక్ష్మి, ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.మధుసూధనరావు, ఎంవీ సత్యానారాయణ, వైవీ అనురాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, కె.రాంగోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, కె.సునీత, జి.వాణిమోహన్, డి.వరప్రసాద్, రాం శంకర్ నాయక్, బి.శ్రీధర్, జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్, కేఎస్ శ్రీనివాస్‌రాజు, కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఎన్.గిరిజాశంకర్, జి.రవిబాబు, విజయ్‌మోహన్, ఎన్.కృష్ణ, కేవీ రమణ, పి.వెంకట్రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం, ఎం. జగన్నాథం, ఐ.శ్యామ్యూల్ అనంద్‌కుమార్, వి.కరుణ, కేవీ సత్యానారాయణ, హెచ్.అరుణకుమార్, ఎం.పద్మ, పి.ఉషాకుమారి, పీఏ శోభ, కె.హర్షవర్థన్, పి.భాస్కర్, ఎం.హరి జవహర్‌లాల్, టి.బాబూరావు నాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయ్‌రెడ్డి, జె.మురళీ, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరిబాబు, డి.మురళీధర్‌రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్. సత్యనారాయణ, పి.బంసత్‌కుమార్, బి.రామారావు, ఎ.సూర్యకుమారి, జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఏఎండీ ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి, బి.కిషోర్.
ఐపీఎస్ అధికారులు...
అశోక్ ప్రసాద్, ఎస్‌ఏ హుడా, వివేక్ దూబే, డాక్టర్ బి.భూపతి బాబు, ఈష్ కుమార్, వీఎస్‌కే కౌముది, ఆర్‌పీ ఠాకూర్, వినయ్ రంజన్ రే, టీఏ త్రిపాఠి, సంతోష్ మెహ్రా, కేఆర్‌ఎం కిషోర్ కుమార్, అంజనీ కుమార్, అంజనా సిన్హా, మహ్మద్ అహసాన్ రజా, హరీష్ కుమార్ గుప్తా, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠీ ఉజేలా, అభిలాష్ బిష్ట్, అతుల్ సింగ్, డాక్టర్ ఎస్‌బీ బగ్చీ, భావన సక్సేనా, మహేష్ చంద్ర లడ్హా, మనీష్ కుమార్ సిన్హా, నవీన్ గులాటి, యస్. శ్యాంసుందర్, సర్వశ్రేష్ట త్రిపాఠి, షిమోషీ, భాస్కర్ భూషణ్, రాహుల్‌దేవ్ శర్మ, అభిషేక్ మహంతి, వరుణ్ బీఆర్., ఆద్నాన్ న యీం అస్మీ, ఐశ్వర్య రస్తోగి, మహేష్ మురళీధర్ భగవత్, విజయ్ కుమార్, రాజేష్ కుమార్, ఆర్.జయలక్ష్మి, యస్.సెంథిల్ కుమార్, అన్బురాజన్ కేకేఎన్, కె.శశికుమార్, టి.కృష్ణరాజు, నళిన్ ప్రభాత్, డాక్టర్ ఎ.రవిశంకర్, గ్రేవాల్ నవదీప్ సింగ్ కేఎస్, విశాల్ గున్నీ, సిద్ధార్థ కౌశల్, డి.గౌతం సవాంగ్, రాజీవ్ కుమార్ మీనా, వినీత్ బ్రిజిలాల్, ఫకీరప్ప కాగినెల్లి, వి.వేణుగోపాలకృష్ణ, జి.సూర్యప్రకాశరావు, బి.శ్రీనివాసులు, పి.ఉమాపతి, ఇ.దామోదర్, బి.బాలకృష్ణ, అబ్రహాం లింకన్, ఎ.సుందర్ కుమార్ దాస్, టి.యోగానంద్, కె.వెంకటేశ్వరరావు, యం.శివప్రసాద్, ఏ.రవిచంద్ర, డి.రామక్రిష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డాక్టర్ యం.కాంతారావు, పీవీఎస్ రామకృష్ణ, కేవీవీ గోపాలరావు, బి.వి.రమణ కుమార్, పి.హరికుమార్, సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు, డాక్టర్ యం.నాగన్న, ఏ.ఎస్.ఖాన్, ఐ.సత్యనారాయణ, ఐ.ప్రభాకర్‌రావ్, జి.శ్రీనివాస్, డి.నాగేంద్ర కుమార్, టి.రవికుమార్ మూర్తి, కె.కోటేశ్వరరావు, ఎల్ కేవీ రంగారావు, పి.వెంకటరామిరెడ్డి, జి.పాలరాజు, జి.వి.జి.అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్.హరికృష్ణ, యం.రవిప్రకాష్, ఎస్.వి.రాజశేఖర్ బాబు, కె.వి.మోహన్‌రావు, పీహెచ్‌డీ రామకృష్ణ, డాక్టర్ సిహెచ్ శ్యాంప్రసాద్‌రావు, జాస్తి వెంకటరాముడు, ఎన్.సాంబశివరావు, యం.మాలకొండయ్య, ఎన్‌వీ సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌డీ తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ఎన్.మధుసూధన్‌రెడ్డి, కొల్లి రఘురాంరెడ్డి, ఆకే రవికృష్ణ, గజరావ్ భూపాల్, కోయ ప్రవీణ్, భూసారపు సత్య ఏసుబాబు, వెంకట అప్పలనాయుడు చింతం, ఎన్.సంజయ్, కాంతిరాణా టాటా, సీయం త్రివిక్రమ వర్మ, గోపీనాథ్ జెట్టి, బాబూజీ అట్టాడ, బి.ప్రసాదరావ్, ఎస్.వెంకటరమణ మూర్తి, పీవీ సునీల్ కుమార్, చిరువోలు శ్రీకాంత్, విజయరావ్ చంపటపల్లి, బూరుగు రాజకుమారి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు.
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు..
డి.లక్ష్మీ పార్థసారథి భాస్కర్, సీబీ వెంకటరమణ, ఎంజీ గోపాల్, వీకే అగర్వాల్, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, పుష్పా సుబ్రమణ్యం, జేఎస్.వెంకటేశ్వర ప్రసాద్, వై.శ్రీలక్ష్మీ, కె.రామకృష్ణారావు, సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, స్మితా సభర్వాల్, కె.శశాంక, జి.శ్రీజన, సి.సుదర్శన్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ హనుమంత్, బి.వెంకటేశం, ఎన్.శ్రీధర్, ఎ.విద్యాసాగర్, ఎం.దానకిషోర్, హరికిరణ్ చెవ్వూరు, కె.ప్రదీప్ చంద్ర, రాహుల్ బొజ్జా, హరిచందన దాసరి, శివశంకర్ లోతేటి, గొర్రెల సువర్ణ పండాదాస్, ఆర్ భట్టాచార్య, చందనాఖన్, ఏకే ఫరీదా, రాజీవ్ శర్మ, ఎస్పీ సింగ్, రణదీప్ సుధాన్, వినయ్ కుమార్, రంజీవ్ ఆర్ ఆచార్య, శైలేంద్ర కుమార్ జోషి, అజయ్‌మిశ్రా, అజయ్ ప్రకాష్ సహానీ, సుతీర్థ భట్టాచార్య, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, అదర్‌సిన్హా, రజత్ భార్గవ, సునీల్ శర్మ, హరిప్రీత్‌సింగ్, అజయ్ జైన్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, ప్రవీణ్ ప్రకాష్, నవీన్ మిట్టల్, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సిద్ధార్థ జైన్, గౌరవ్ ఉప్పల్, పౌసుమీ బసు, సర ్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, శ్రుతి ఓజా, అద్విత్ కుమార్‌సింగ్, సంజయ్ కుమార్, అహ్మద్ నదీమ్, సందీప్‌కుమార్ సుల్తానీయా, నీతూకుమారీ ప్రసాద్, కె.ఇల్లంబర్తి, కె.మాణిక్యరాజ్, రజత్ కుమార్ షైనీ, భారతీ హోలికేరీ, అలగ వర్షిణి, ఆర్‌వీ కర్ణన్, హీరాలాల్ సమారియా, ఐ.రాణీకుముదినీ, జ్యోతి బుద్ధ ప్రకాష్, డీఎస్ లోకేష్‌కుమార్, సుధామ్‌రావు, బీఆర్ మీనా, అరవింద్ కుమార్, బెనహర్ మహేష్‌దత్ ఎక్కా, క్రిస్టియానా జడ్ చోంగ్‌తూ, ప్రీతిమీనా, బి.అరవిందరెడ్డి, బి.వెంకటేశ్వరావు, ఎన్.శివశంకర్, ఎం జగదీశ్వర్, సి పార్థసారథి, వీఎన్ విష్ణు, ఆర్వీ చంద్రవదన్, జీడీ అరుణ, వి.అనిల్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, ఎల్.శశిధర్, జి.వెంకట్రామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, అనితా రాజేంద్ర, సయ్యద్ ఓమర్ జలీల్, ఎం జగన్‌మోహన్, ఎ.దినకర్‌బాబు, జి.కిషన్, ఎం.రఘునందరావు, టి.చిరంజీవులు, జీడీ ప్రియదర్శిని, టి.విజయకుమార్, పి.సత్యానారాయణరెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీం, టీకే శ్రీదేవి, బి.బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, ఎల్.శర్మన్, పార్వతీ సుబ్రమణ్యన్, ఎ.శరత్, ఎం.చంపాలాల్, ఎ.మురళి, బి.భారతీ లక్‌పతి నాయక్, బి.విజయేంద్ర, కేవై నాయక్, పి.వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, డాక్టర్ ఏంవీ రెడ్డి, డి.వెంకటేశ్వరరావు, ఎ.శ్రీదేవసేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అరవిందర్‌సింగ్
ఐపీఎస్ అధికారులు...
టి.పి.దాస్, నవీన్ రంజన్ వాసన్, అనురాగ్ శర్మ, సుధీప్ లక్టాకియా, రాజీవ్ త్రివేది, ప్రభాకర్ అలోక, వి.కె.సింగ్, ఎ.ఆర్.అనురాధ, ఉమేష్ షరాఫ్, రవిగుప్త, రాజీవ్ రతన్, జితేందర్, సందీప్ శాండిల్యా, వినాయక్ పి ఆప్టే, డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖాగోయల్, రీతూ మిశ్రా, దేవేంద్రసింగ్ చౌహాన్, విక్రంసింగ్ మాన్, అకున్ సబర్వాల్, తరుణ్ జోషి, విక్రమ్‌జీత్ దుగ్గల్, తఫ్సీర్ ఇగ్బాల్, అంబర్ కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్, విజయకుమార్ ఎస్‌ఎం, విష్ణు ఎస్ వారియర్, వి.సి.సజ్జనార్, సంజయ్ కుమార్ జైన్, షాన్వాజ్ ఖాసీం, డి.జోయల్ దావిస్, భాస్కరన్ ఆర్, సత్యనారాయణ్, గోవింద్ సింగ్, అనిల్‌కుమార్, రామరాజేశ్వరి ఆర్, కల్మేశ్వర్ సింగన్‌వార్, డాక్టర్ బి.ఎల్.మీనా, స్వాతి లక్రా, కార్తీకేయన్, వి.నవీన్‌చంద్, యం.కె.సింగ్, కె.వేణుగోపాల్ రావు, టి.వి.శశిధర్ రెడ్డి, వై.గంగాధర్, జి.సుధీర్ బాబు, టి.ప్రభాకర్‌రావు, పి.ప్రమోద్ కుమార్, ఎన్.శివశంకర్ రెడ్డి, డాక్టర్ వి.రవీందర్, వి.శివకుమార్, వి.బి.కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, యం.రమేష్, ఎస్.జె.జనార్దన్, ఎ.వి.రంగనాథ్, బి.సుమతి, యం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్‌రావు, ఎన్.సూర్యనారాయణ, ఆర్.బి.నాయక్, టి.మురళీకృష్ణ, పి.మునిస్వామి, సి.రవివర్మ, ఎ.సత్యనారాయణ, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, అరుణ బహుగుణ, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయూం ఖాన్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, మహీందర్‌రెడ్డి, జె.పూర్ణచంద్రరావ్, సి.వి.ఆనంద్, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, చారుసిన్హా, యారం నాగిరెడ్డి, అవినాష్ మహంతి, నేలకొండ ప్రకాష్‌రెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, బి.నవీన్ కుమార్, విశ్వజిత్ కంపతి, టి.కృష్ణప్రసాద్, యం.గోపీకృష్ణ, డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, జి.చందనా దీప్తి, చేతన మైలాబత్తుల
ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి
Published Sat, Oct 11 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement