న్యూఢిల్లీ : ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ఈ కమిటీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు.
ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ సమావేశమైనట్లు తెలుస్తోంది.