రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యూష్ సిన్హా కమిటీ అఖిలభారత సర్వీసు అధికారులను కేటాయించింది.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యూష్ సిన్హా కమిటీ అఖిలభారత సర్వీసు అధికారులను కేటాయించింది. తెలంగాణకు 163 మంది ఐఏఎస్‌లు, 112 మంది ఐపీఎస్‌లు, 65 మంది ఫారెస్ట్ అధికారులన కేటాయించింది. ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు, 144 మంది ఐపీఎస్‌లు, 82 మంది ఫారెస్ట్ అధికారులను కేటాయించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తిన చేసి, తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది.