హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల విభజనను ఈనెల 16వ తేదీన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆరోజున ఢిల్లీలో జరిగే సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీని ముందుగా ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలన్న దానిపై లాటరీ వేయనున్నారు.
ఆ లాటరీలో వచ్చిన రాష్ట్రం నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. స్థానికత ఆధారంగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జరుగుతుంది. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన అధికారులను మాత్రం రోస్టర్ పద్ధతి ద్వారా ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు ఢిల్లీ వెళ్లనున్నారు.
16న అఖిల భారత సర్వీసు అధికారుల విభజన
Published Tue, Aug 12 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement