ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్! | Telangana Administrative Service | Sakshi
Sakshi News home page

ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!

Published Wed, Mar 11 2015 1:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Telangana Administrative Service

అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియామకం
 
హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అయిన ఐఏఎస్ తరహాలో... రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పా టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఏఎస్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జీవో నం. 777ను జారీ చేశారు. ఈ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, సాధారణ పరిపాలన(పొలిటికల్) శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ సెక్రటరీ (ఎస్‌ఆర్/ఐఎఫ్) సభ్యులుగా వ్యవహరిస్తారు. సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శి సభ్యుడిగా, కన్వీనర్‌గా ఉంటారు.
 
రెవెన్యూయేతర అధికారుల్లో ఆశలు..

ఇన్నాళ్లూ రాష్ట్ర స్థాయి సర్వీసు అయినగ్రూప్-1లో ఒక్క రెవెన్యూ వైపు ఉన్న అధికారులనే పదోన్నతిపై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు (కన్‌ఫర్డ్ ఐఏఎస్ కోసం) సిఫారసు చేసే విధానం ఉంది. ఇతర విభాగాల గ్రూప్-1 అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్ హోదా పొందే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ని గ్రూప్-1 అధికారులకు ప్రాతినిధ్యం కల్పిం చేలా రాష్ట్రస్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీ స్ ఉండాల ని, దాని నుంచి సీనియారిటీ ప్రకా రం కన్‌ఫర్డ్ ఐఏఎ స్‌కు సిఫారసు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హరగోపాల్ కమిటీ కూడా తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఉం డటం అవసరమని పేర్కొంది. టీఏఎస్‌కి కమిటీని ఏర్పాటు చేయడంపై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement