కేంద్ర పరిశోధనల సంస్థలకు ఏపీలో పెద్దపీట
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర పరిశోధనల సంస్థల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వైయస్ చౌదరి (సుజనాచౌదరి) చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివా రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూమిని అందిస్తే మిగిలినవాటిని కేంద్ర ప్రభుత్వం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అఖిల భారత సర్వీస్ అధికారుల విభజనను పూర్తి చేయించామన్నారు. స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం వాటిని పరిశీలించే కార్యక్రమంలో ఉన్నామన్నారు. అంతకుముందు సీఎం బాబుతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు.