
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.
ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..!
Comments
Please login to add a commentAdd a comment