రెండు రాష్ట్రాల నుంచి పంపుతున్న అధికారుల సంఘం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాన్ని ప్రత్యూష సిన్హా కమిటీ శనివారం చేపడుతోంది. దీన్ని పరిశీలించేందుకు రెండు రాష్ట్రాల నుంచి అధికారుల్ని పంపాల్సిందిగా ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కమిటీ కోరింది. ఈ ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేసేందుకు సంఘం బుధవారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భేటీ అయింది. తాత్కాలిక కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పని చేస్తున్న ఐదుగురిని ఎంపిక చేసింది. క్యాడర్ కేటాయింపులో రోస్టర్ విధానాన్ని అవలంభిస్తున్న కమిటీ సీనియర్ నుంచి జూనియర్ వరకు జాబితా రూపొందిస్తుంది.కేటాయింపు ఏ రాష్ట్రం నుంచి ప్రారంభంకావాలనే అంశాన్ని టాస్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ టాస్ ప్రక్రియను పరిశీ లించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు శివధర్‌రెడ్డి, విశ్వనాథ రవీందర్, ఉమేష్ షరాఫ్, మాలకొండయ్య, స్వాతిలక్రాలను పంపాలని అధికారుల సంఘం నిర్ణయించింది.
‘పంపకాల’ పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్‌లు
Published Thu, Aug 14 2014 3:10 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement