
అధికారుల పంపిణీపై 16న మార్గదర్శకాలు: అనిల్ గోస్వామి
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి మార్గదర్శకాలు 16న జారీ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి చె ప్పారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి మార్గదర్శకాలు 16న జారీ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి చె ప్పారు. విభజన ప్రక్రియ పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో సీఎస్‌తో కలిసి ఆయన విభజన ప్రక్రియను సమీక్షించారు.
వచ్చే రెండు వారాలు కీలకమని, విభజనపై వివిధ శాఖల ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని గోస్వామి తెలిపారు. కేంద్ర పరిధిలోకి వచ్చే అంశాలపై ప్రతిపాదనలను ఢిల్లీకి పంపాల్సిందిగా సూచించారు. అనంతరం గోస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో విభజన అంశాలపై చర్చించారు.