* విభజనతో పడిపోనున్న స్థానం
* ప్రస్తుతం 258 మందితో ఆంధ్రప్రదేశ్‌ది ఆరో స్థానం
* విభజన తరవాత సీమాంధ్ర 144 పోస్టులతో 14కు.. తెలంగాణ 112 పోస్టులతో 17వ స్థానానికి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఆలిండియా సర్వీసు అధికారులైన ఐపీఎస్ పోస్టుల పంపిణీ అనంతరం ఐపీఎస్‌ల సం ఖ్యలో కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల స్థానం.. సమైక్య రాష్ట్రంతో పోల్చుకుంటే గణనీయంగా పడిపోనుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 258 ఐపీఎస్ అధికారులతో దేశంలో ఆరో స్థానంలో ఉంది. విభజన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీమాంధ్రకు 144, తెలంగాణకు 112 పోస్టులు కేటాయించింది. దీంతో రెండు రాష్ట్రాల స్థానాలు 14, 17లుగా ఉండనున్నారుు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక ఐపీఎస్ పోస్టులు ఉత్తరప్రదేశ్‌కు ఉన్నాయి. ఉత్తరాఖండ్ విభజన తరవాత కూడా ఆ రాష్ర్టంలో ఈ పోస్టులు 489 ఉన్నాయి. రాష్ట్ర జనాభా, తదితర అంశాల ప్రాతిపదికన హోంశాఖ ఐపీఎస్ పోస్టుల్ని కేటాయిస్తుంది. రాష్ట్రాలు వీటి సంఖ్యను పెంచుకోవాలని భావిస్తే పోస్టుల సమీక్ష కోరుతూ అవి అందించే దరఖాస్తుల్లో చూపిన కారణాలను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా చర్యలు చేపడుతుంది.
ఐపీఎస్ పోస్టుల అంశంలో సీమాంధ్ర జమ్మూకాశ్మీర్, తెలంగాణ రాష్ట్రం జార్ఖండ్, అసోం కన్నా కింది స్థానంలో ఉం టున్నా... అధికారుల అందుబాటు అంశంలో మా త్రం పై స్థానాల్లో ఉన్న అనేక రాష్ట్రాల కంటే మెరుగనే చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 258 పోస్టులకూ కేవలం 52 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. పోస్టుల్ని ఖాళీలతో సహా రెండు రాష్ట్రాలకూ పంచుతున్న నేపథ్యంలో సీమాంధ్రకు 30, తెలంగాణకు 22 వస్తాయి. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 100, మహారాష్ట్రలో 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలావుండగా కొత్తగా ఏర్పాటు కానున్న రెండు రాష్ట్రాలూ పోస్టుల సమీక్ష కోసం హోంశాఖకు దరఖాస్తు చేసుకుంటే పోస్టుల సంఖ్య పెరిగి స్థానాలు మెరుగుపడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐపీఎస్‌ల సంఖ్యలో కిందికి!
Published Tue, May 13 2014 2:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement