ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే | Assets must give information | Sakshi
Sakshi News home page

ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే

Published Thu, Sep 11 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే

ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే

అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు
డిసెంబర్ 31లోగా గడువు
తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు

 
హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులు తవు ఆస్తుల వివరాలు ఇవ్వకుండా మొండికెస్తే.. ఇకపై కష్టమే! అంతేకాదు ఏమాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినా.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అధికారులు తవు ఆస్తుల వివరాలపై కచ్చితమైన సవూచారం వెల్లడించాల్సిందే. దీనిపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అఖిల భారత సర్వీసు అధికారులు ఇచ్చే సమాచారం ఇకపై లోక్‌పాల్ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఆస్తుల వివరాల వెల్లడికి ప్రస్తుతం సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఆస్తుల వెల్లడిలో కచ్చితత్వం లేకుంటే.. క్రిమినల్  చర్యలు ఉంటాయని పేర్కొంది. భార్య/భర్త ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో లేదా బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న పక్షంలో వారి వేతన వివరాలను అధికారులు సీల్డ్ కవర్‌లో వెల్లడించాలని కూడా కోరింది. ఇప్పటి వర కు అధికారులు ప్రతీ సంవత్సరం తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నా శాఖాపరమైన అంశంగా ఉండేది. లోక్‌పాల్ చట్టం రావడంతో ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేం ద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇవ్వని పక్షం లో సదరు ఐఏఎస్ అధికారులను కేంద్ర డిప్యుటేషన్, విదేశీ పర్యటనలకు అనుమతించకుండా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉం టుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఢిల్లీ లో నిర్వహించిన అన్ని రాష్ట్రాల సాధారణ పరి పాలన శాఖ ముఖ్యకార్యదర్శుల (పొలిటికల్) సమావేశంలో వెల్లడించింది. ప్రస్తుతం అఖిల భారత సర్వీసు అధికారులకు మాత్రమే అమలు చేస్తున్న ఈ నిబంధనలను త్వరలో రాష్ట్ర కేడర్ అధికారులకు కూడా వర్తింప చేయనున్నారు.

అధికారులను త్వరగా కేటాయించండి...

అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డీవోపీటీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున మిడ్ కేడర్ స్ట్రెంత్ సమీక్షను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. రెండేళ్ల క్రితం చేసిన ఈ సమీక్షలో అప్పట్లో 349 మందిగా ఉన్న కేడర్ సంఖ్యను 374కు మార్చారని వివరించిం ది. కొత్త రాష్ట్రం ఏర్పడినందున దానిని సమీక్షిం చి అధికారుల సంఖ్యను నిర్ధారించాలని రాష్ట్రం కోరింది. అధికారుల కొరతతో పాలనా వ్యవహా రాలు గాడిలో పడడం లేదని రాష్ట్రం నుంచి హాజరైన అజయ్‌మిశ్రా కేంద్రానికి వివరించారు.

స్వీయ ధ్రువీకరణ...

ప్రజలు న్యాయ సంబంధ అంశాల్లో మినహా మిగిలిన అంశాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుందని డీవోపీటీ సూచించిందని అజయ్‌మిశ్రా చెప్పారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం 90 శాతంపైగా అంశాల్లో స్వీయ ధ్రు వీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటోం దని, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తనిఖీ చేసుకోవచ్చని, ప్రతీదానికి అఫిడవిట్ లేదా గెజిటెడ్ అధికారులతో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు, దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఎలా చేయాలన్నది నిర్ణయిస్తావుని చెప్పారు.
 
అధికారుల కేటాయింపుల్లో మార్పులు

 
కొందరు ఐఏఎస్‌లు మారే అవకాశం
15న ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ

 
అఖిల భారత సర్వీసు అధికారుల తాత్కాలిక కేటాయింపులో 20 మంది వరకు ఐఏఎస్ అధికారుల మార్పులు ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. తాత్కాలికంగా జరిపిన కేటాయింపుల్లో జరిగిన పొరపాట్లతో పాటు, అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చిన లోపాలపై ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 15న చ ర్చించనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న వారు రాష్ట్రానికి బది లీపై వచ్చినప్పుడు వారిని రాష్ట్ర కేడర్‌లోని సంబంధిత బ్యాచ్‌లో చివరలో చేర్చడం ఆనవాయితీ. కొందరు అధికారులు కేంద్ర సర్వీసు సీనియారిటీనే కొనసాగించారు. దీన్ని సవరించాల్సి ఉంది. దీంతో అధికారుల రోస్టర్ విధానంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశంలో వీటన్నింటినీ సవరించి తాజా జాబితాను రూపొందించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీవోపీటీ)కు సమర్పించనున్నారు. ఈ జాబితాను అక్కడి నుంచి ప్రధానికి పంపిస్తారు. ఆయన ఆమోదం తెలపగానే అధికారుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ అవుతుంది. భార్యాభర్తలు, డిప్యుటేషన్, అంతరాష్ట్ర కేడర్ బదిలీ తదితర అంశాలకు సంబంధించి అధికారులు చేసుకునే దరఖాస్తులను మూడు నెలల్లోగా కేంద్రం పరిష్కరిస్తుందని తెలిపాయి. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయడానికి ఆప్షన్స్ ఇచ్చిన భార్యాభర్తల విషయంలో మా ర్పు ఉండబోదని చెప్పాయి. రాజకీయ అనుబంధమున్న అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, ఆప్షన్ల ప్రకారం కేటాయింపులు జరగని అధికారులు మానసికంగా మథనపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement