ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ నానాయాగీ చేస్తోంది. ఇంకా అమల్లోకే రాని చట్టంపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండంతో ఏం చేయాలో తోచక సీఎం జగన్‌పై, ఆయన ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తోంది.
ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది.
తాజాగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదంపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ చట్టంపై చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఆయన తిప్పికొట్టారు.
"ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?’ అని ట్వీట్ చేశారు..
కాగా శుక్రవారం నాటి ఆంధ్రజ్యోతి ప్రతికలో ‘మీ భూమి మీది కాదు’ అనే నినాదంతో ఫస్ట పేజ్‌లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.దీనిని కృష్ణారావు షేర్ చేస్తూ.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీదేనని తెలిపారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలో ఏపీ బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం.
ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm
— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024
Comments
Please login to add a commentAdd a comment