Pratyush Sinha
-
ఆ అధికారం కేంద్రానిదే..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపుపై తలెత్తిన వివాదంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగానికి (డీవోపీటీ) అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపులు చేసే పరిధి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు చట్టప్రకారం అధికారి వారీగా నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అధికారుల అభ్యంతరాలను విడివిడిగా పరిశీలించాలని.. స్థానికత, పదేళ్ల సర్వీస్, ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు డీవోపీటీకి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. నీ మేరకు ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులను క్యాట్ మార్చడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేడర్ వివాదం ఇదీ.. ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులను ఇరు రాష్ట్రాల మధ్య విభజించారు. కమిటీ ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు పొందారు. కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఉత్తర్వులను తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. గత ఏడాది జనవరిలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులలో క్యాట్ జోక్యాన్ని తప్పుపట్టింది. అయితే కేడర్, సర్వీస్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారించాలంటూ అప్పటి డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో.. ఆ విచారణను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ బెంచ్‌కు అప్పగించింది. వాదనలు సాగాయిలా.. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని వివరించారు. సోమేశ్‌కుమార్ అంశంలో తీర్పు సందర్భంగా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫున న్యాయవాదులు కె.లక్ష్మీనరసింహ, గోదా శివ, సుధీర్ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘ధర్మాసనం అలా నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేయవద్దు. పిటిషన్ల వారీగా విచారణ చేయాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారుల కేటాయింపు బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
‘విభజన’ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ చేపడతామని వాద, ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేడర్ వివాదంపై జనవరిలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సందర్భంగా కమిటీ మార్గదర్శకాలను ధర్మాసనం సమర్థించింది. ఈ మార్గదర్శకాల మేరకు మాత్రమే మేం విచారణ చేపడతాం. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలు సరికాదు. వాటిని రద్దు చేసి.. నిర్ణయం తీసుకునే బాధ్యతను సిబ్బంది మరియు శిక్షణ విభాగం(డీవోపీటీ)కి అప్పగిస్తాం. తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది.. పదేళ్లుగా డీజీపీ అంజనీకుమార్ సహా కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది సర్విస్ సంవత్సరంలోపు కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తాం’అని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న కేడర్ వివాదం.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సరీ్వస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అది చట్టరీత్యా ఆమోదం కాదన్న ఏఎస్జీ కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ.. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోమేశ్‌కుమార్ తీర్పు సందర్భంగా ఇదే హైకోర్టు పేర్కొందన్నారు. అనంతరం పలువురు ఐఏఎస్‌ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారని న్యాయవాది సుదీర్ నివేదించారు. న్యాయవాది కె.లక్ష్మీనరసింహా, సీనియర్ న్యాయవాది గోదా శివ.. ఐఏఎస్ అధికారుల తరఫున వాదనలు వినిపించారు. నివాసం ఉంటున్న ప్రాతిపదికన ఏఐఎస్ అధికారుల కేటాయింపు సరికాదన్నారు. ఈ విషయంలో నియమాకం నుంచి వాదనలు వినాల్సి ఉంటుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి వాదనల కోసం నేటికి వాయిదా వేసింది. -
వారంలో తుది జాబితా
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన 95 శాతం పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరింది. మరో వారం రోజుల్లో తుది జాబితాను కేంద్రం వెల్లడించనుంది. ఇరు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపుల్లో మార్పులు కోరుతూ కొందరు అధికారులు చేసుకున్న అభ్యర్థనలపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, డీఓపీటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ నిబంధనల ప్రకారం పరస్పర మార్పిడి (స్వాపింగ్)లో కొందరికి మాత్రమే అవకాశం కల్పించింది. అధికారుల విభజన ప్రక్రియను 95 శాతం పూర్తి చేసినట్టు భేటీ తర్వాత ఇరువురు సీఎస్‌లు మీడియాకు తెలిపారు. అభ్యంతరాలు పూర్తయినందున బహుశా వారంలోనే డీఓపీటీ తుది జాబితాను ఇంకా శిక్షణలో ఉన్న 2014 బ్యాచ్ అధికారుల కేటాయింపులు జరగనందున దానిపై చర్చించేందుకు వారం పది రోజుల్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశముందని చెప్పారు. పూనం, సోమేశ్ ఏపీకే? స్వాపింగ్ ప్రక్రియలో కోరుకున్న రాష్ట్రానికి వెళ్లేందుకు దాదాపు 30 మంది ఐఏఎస్‌లు దరఖాస్తు చేసుకోగా 16 మందికి అవకాశం కలిగింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల నుకున్న పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్‌లకు అవకాశం దొరకలేదు. రోనాల్డ్‌రాస్ మాత్రం తెలంగాణకు వెళ్లే అవకాశముంది. ఐపీఎస్‌ల్లో స్వాపింగ్‌లో అనురాధ ఏపీకి, ఈష్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. భార్యాభర్తల కేసులో మహేశ్‌మురళీధర్ భగవత్, విజయ్‌కుమార్, రాజేశ్‌కుమార్ తెలంగాణకు వెళ్లారు. ఒకే బ్యాచ్, ఒకే వేతన స్కేలున్న వారిని కోరుకున్న మేరకు స్వాపింగ్‌లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించడం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు స్వాపింగ్ జాబితా ఇలా... -
వారంలో ఐఏఎస్‌ల పంపిణీ!
⇒ 15 రోజుల్లోగా అధికారుల నుంచి ‘స్వాపింగ్’కు దరఖాస్తుల స్వీకరణ ⇒ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది జాబితా ప్రకారమే పంపిణీ ⇒ఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం ⇒భేటీకి హాజరైన ప్రత్యూష్ సిన్హా, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో అధికారులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఉత్తర్వుల తర్వాత పక్షం రోజుల్లోగా అధికారుల నుంచి పరస్పర మార్పిడి(స్వాపింగ్)కి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కొఠారీ పాల్గొన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇదివరకు ప్రకటించిన ముసాయిదా తుది జాబితా ప్రకారమే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఒకే బ్యాచ్‌లో ఉన్న అధికారులకేగాకుండా సీనియారిటీ ఆధారంగా మిగతావారికి కూడా స్వాపింగ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు భేటీలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది ముసాయిదా పంపిణీ జాబితాపై పలువురు అధికారులు ఇప్పటికే క్యాట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యర్శి పూనం మాలకొండయ్య, బీపీ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీలో పనిచేస్తున్న అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించారు. ఏపీలో ఉన్న శాంతికుమారి, వి.కరుణ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నారు. ఈ అధికారులు స్వాపింగ్తో వారు కోరుకున్న రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్వాపింగ్ పూర్తయ్యాక అధికారులకు శాశ్వతంగా ఆ రాష్ట్ర కేడర్ కేటాయించాలని నిర్ణయించారు. -
బొగ్గు గనులకు పరిహారం అంచనాకు కమిటీ
న్యూఢిల్లీ: ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నవంబర్ 10 కల్లా కమిటీ తన సిఫారసులను సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బొగ్గు గనుల కేటారుుంపుల కుంభకోణంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 24న.. 1993-2009 మధ్యకాలంలో వివిధ కంపెనీలకు కేటారుుంచిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నారుు. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయూల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. -
నేటితో ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రక్రియ పూర్తి..
సివిల్ సర్వెంట్ల అభ్యంతరాలను పరిశీలించనున్న కమిటీ తుది నివేదికను డీవోపీటీకి ఇవ్వనున్న కమిటీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ పని మంగళవారంతో పూర్తి కానుంది. ఆగస్టు 22న సమావేశమైన కమిటీ రెండు రాష్ట్రాలకు అఖిల భారత అధికారులను తాత్కాలికంగా కేటాయించడం తెలిసిందే. ఈ కేటాయింపులపై గతనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిపై మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై చర్చించనుంది. దీనిలో కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు పాల్గొంటారు. ప్రధానంగా భార్యాభర్తలు, డెప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, అనారోగ్యంతో బాధపడుతున్న అధికారుల నుంచి అభ్యంతరాలు అందినట్టు సమాచారం. భార్యాభర్తలకు సంబంధించి మొత్తం 12 మందితోపాటు, పైన పేర్కొన్న కారణాలతో దరఖాస్తు చేసుకున్న 32 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలనకు తెలంగాణ సర్కార్ పంపించింది. తెలంగాణలో పనిచేయడానికి ఈ 32 మంది అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో .వారి పేర్లను ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీకి పంపింది. అధికారులు ఇచ్చిన దరఖాస్తుల్లో సహేతుకమైనవాటిని పరిశీలించి కమిటీ మార్పులు చేర్పులు చేయనుంది. అయితే వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆమోదించాలన్న నిబంధనేదీ లేదని అధికారవర్గాలు తెలిపాయి. డీవోపీటీ నిబంధనల మేరకు అధికారులను కేటాయించనున్నారు. నివేదికను ప్రధాని ఆమోదించాక శాశ్వతంగా అధికారుల కేటాయింపు జరుగుతుంది. అది ఈనెల 15 లోగా పూర్తవుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
భార్యాభర్తలు వేర్వేరు రాష్ట్రాలకు
* నాలుగు ఐఏఎస్ జంటలకు ఇదే పరిస్థితి * ఒకే రాష్ట్రంలో ఉండేందుకు దరఖాస్తుకు గడువు ఈ నెల 29 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఐఏఎస్‌ల్లోని నాలుగు జంటలను వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించారు. ప్రత్యూష్ సిన్హా తాత్కాలిక జాబితా ప్రకారం భార్య తెలంగాణ రాష్ట్రానికి వెళితే భర్త ఏపీకి వెళ్లారు. అలాగే భర్తను తెలంగాణకు కేటాయిస్తే భార్య ఏపీకి వెళ్లారు. స్పౌస్‌ను ఒకే రాష్ట్రానికి కేటాయించాలనే నిబంధన లేకున్నా ఈ ఐఏఎస్‌లు తామిద్దరినీ ఏదో ఒకే రాష్ట్రంలో ఉంచాలని కోరుతూ ఈ నెల 29వ తేదీలోగా ప్రత్యూష్ సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రాజీవ్‌రంజన్, వసుధామిశ్రాలు భార్యా భర్తలు. వీరిలో రాజీవ్ రంజన్ తెలంగాణకు, వసుధా ఏపీకి కేటాయించారు.ప్రస్తుతం ఏపీ సీఎంపేషీ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సహానీని ఆంధ్రాకు, ఆయన భార్య నీలం సహానీని తెలంగాణకు కేటాయించారు. బీపీ ఆచార్యను తెలంగాణకు కేటాయించగా ఆయన భార్య రంజీవ్‌ఆర్ ఆచార్యను ఏపీకి కేటాయించారు.బీపీ ఆచార్య తెలంగాణ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయన భార్యనూ తెలంగాణకే కేటాయించాల్సిందిగా కోరాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేంద్రసర్వీసులో ఉన్న సీనియర్ అధికారి రెడ్డిసుబ్రహ్మణ్యం, ఆయన భార్య పుష్పా సుబ్రహ్మణ్యంలదీ ఇదే పరిస్థితి. ఎక్కువ మంది తెలంగాణకే ఆప్షన్లు డెరైక్ట్ రిక్రూటీల్లోని అఖిల భారత సర్వీసు అధికారుల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికే ఆప్షన్లు ఇచ్చారని ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు మొత్తం 126 మంది ఉండగా తెలంగాణలో పనిచేసేందుకు 68 మందిఆప్షన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు మాత్రం కేవలం 37 మంది అంగీకరించారు. మరో 21 మంది ఆప్షన్లను ఇవ్వలేదు.సిన్హా కమిటీ డెరైక్ట్ రిక్రూటీల్లో 71 మంది ఐఏఎస్‌లను ఆంధ్రాకు, 55 మందిని తెలంగాణకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లో ఐపీఎస్‌లు 92 మంది ఉన్నారు. ఇందులో కూడా అత్యధికంగా 69 మంది ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి ఆప్షన్లు ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడానికి కేవలం 17 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. ఆరుగురు ఎక్కడా ఇవ్వలేదు. అయితే ప్రత్యూష్ సిన్హా కమిటీ వీరిలో 52 మంది ఐపీఎస్‌లను ఆంధ్రాకు, 40 మంది ఐపీఎస్‌లను తెలంగాణకు కేటాయించింది.ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లోని రాష్ట్రేతర ఐఎఫ్ఎస్లు 68 మంది ఉండగా అందులో ఆంధ్రాకు 43 మంది ఆప్షన్లు ఇవ్వగా తెలంగాణకు 21 మంది ఇచ్చారు.సిన్హా కమిటీ ఆంధ్రాకు 38 మంది ఐఎఫ్ఎస్లను, తెలంగాణకు 30 మందిని కేటాయించింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లలో ఎక్కువమంది హైదరాబాద్‌లో స్థిరపడి ఉండటంవల్లనే ఎక్కువమంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని సమాచారం. -
నేడు భేటీ కానున్న ప్రత్యూష సిన్హా కమిటీ