దక్షిణాది రాష్ట్రాల సీఎస్‌ల భేటీ
- అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాలపై చర్చ
- తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన సమావేశం
- ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి సీఎస్‌లు, ఏసీఎస్‌ల హాజరు
- దక్షిణ ప్రాంత మండలి సమావేశానికి ఏజెండా సిద్ధం చేసిన సీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాల అమలు తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో జరిగిం ది. దక్షిణ ప్రాంత మండలి(సౌత్ జోన్ కౌన్సిల్) ఎనిమిదో స్థాయి సంఘం సమావేశంలో దాదాపు 46 అంశాలపై చర్చించారు.
ఆయా రాష్ట్రాల మధ్య చాలా కాలంగా ఉన్న పదిహేను వివాదాలను పరిష్కరించుకున్నారు. మిగిలిన అంశాలను సీఎంల స్థాయి దక్షిణ ప్రాంత మండ లి సమావేశ ఏజెండాగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో హిందూజా విద్యుత్ ఉత్పత్తి అంశం, ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశానికి గ్రిడ్ కల్పనతోపాటు, ప్రభుత్వం ఇటీవల ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమ లు కావడానికి అవసరమైన లైన్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను నిర్మించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
సమావేశం వివరాలను కేంద్ర హోం శాఖ అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి హెచ్‌కె దాస్ వెల్లడించారు. మండలి సమావేశాలు ఆరు నెలలకోమారు నిర్వహించాలని తద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకా శం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో మెట్రోరైలు నిర్మాణంలో భాగంగా వాణి జ్య కట్టడాలు నష్టపరిహారం చెల్లింపు, రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి భూ సేకరణపై ఎదుర్కొంటున్న సమస్య, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్య, కర్మాగారాల చట్టం-1948 ప్రకారం సంబంధిత ప్రాధికార సంస్థ అనుమతి లేకుండా రైల్వే అధికారులను ప్రాసిక్యూట్ చేసే అంశం, ఇసుక రవా ణా, జీఎస్‌టీ, పర్యాటకం, రైల్వే కారి డార్ గృహ నిర్మాణం, విద్యుత్ ప్రసార వ్యవస్థ, ఉపరితల రవాణా, రైల్వే ట్రాక్షన్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు హేతుబద్ధం లేకపోవడం, పాండిచ్చేరి విమానాశ్రయానికి భూసేకరణ, కర్నాటక- తమిళనాడు, తమిళనాడు-కేరళ రాష్ట్రాల మధ్యనున్న వివాదాలు, రోడ్డు భద్రతా చట్టంపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, జీఏడీ (పొలిటికల్ ముఖ్యకార్యదర్శి) అజయ్‌మిశ్రా, ఎస్‌కే జోషి, ఆంధ్రా సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రేమ్‌చంద్రారెడ్డి, కర్నాటక సీఎస్ కౌశిక్ ముఖర్జీ, తమిళనాడు సీఎస్ మోహన్ వర్గీస్ చుంకత్, కేరళ ఎసీఎస్ నివేదిత పి హరన్, పాండిచ్చేరి సీఎస్ సుందరవడివేలు, కేంద్ర హోం మంత్రి సలహాదారు హరికృష్ణ పలివాల్ తదితరులు పాల్గొన్నారు.