8న ప్రభుత్వ సెలవు, 13న వర్కింగ్ డే | 8 is a public holiday, on the 13th working day | Sakshi
Sakshi News home page

8న ప్రభుత్వ సెలవు, 13న వర్కింగ్ డే

Published Sat, Sep 6 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

8 is a public holiday, on the 13th working day

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని 8వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో  ప్రభుత్వ కార్యాలయాలకు  రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని  ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు  కూడా సెలవు  ఇస్తూ  రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రాజీవ్‌శర్మ  శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 

దీనికి బదులుగా ఈ నెల 13వ తేదీన  రెండో శనివారం  వర్కింగ్ డేగా  ప్రకటించారు. కాగా, గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఈ నెల 8న జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీకి బదులుగా13వ తేదీన రెండో శనివారం పనిదినంగా పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement