rp singh
-
ఇంగ్లండ్ జట్టులో ఆర్పీ సింగ్ కొడుకు.. ఎవరంటే?
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో ఇంగ్లండ్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ తరపున భారత మాజీ క్రికెటర్ కుమారుడు బరిలోకి దిగాడు. సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు.అతడే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తనయుడు, లంకాషైర్ క్రికెట్ క్లబ్ యంగ్ బ్యాటర్ హ్యారీ సింగ్. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు లంకాషైర్ క్రికెట్ క్లబ్ నుంచి చార్లీ బర్నార్డ్, కేష్ ఫోన్సెకాలో పాటు టువెల్త్(12th) మ్యాన్‌గా హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మూడో ఓవర్లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ హ్యారీ మైదానంలో కనిపించాడు. లంచ్ సెషన్ తర్వాత హ్యారీ సింగ్ మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెట్టాడు. హ్యారీ బ్రూక్‌కు సబ్‌స్ట్యూట్‌గా అతడు ఫీల్డ్‌లోకి వచ్చాడు.ఎవరీ హ్యారీ సింగ్?అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ హ్యారీ సింగ్.. 2007 టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో భాగమైన ఆర్పీ సింగ్ తనయుడు కాదు. అతడు 1980లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ సీనియర్ కుమారుడు. ఆర్పీ సింగ్ సీనియర్ భారత జట్టుకు కేవలం రెండే రెండు మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.1986లో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్, హైదరాబాద్‌లో రెండు వన్డేలు ఆడాడు.కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 59 మ్యాచ్‌లు ఆడిన సీనియర్ ఆర్పీ సింగ్.. 1413 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కోచ్‌గా అతడు పనిచేశాడు. ఇక పూర్తిగా 1990ల చివరలో ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇక హ్యారీ సింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జులైలో వన్డే కప్‌లో హ్యారీ సింగ్ లంకాషైర్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. 2022లో అతడు శ్రీలంకతో సిరీస్ కోసం ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. అతడికి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. -
రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ఐపీఎల్‌లోని నిబంధనే అని పేర్కొన్నాడు,టీమిండియా నయా ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్న రింకూ సింగ్ గురించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కకపోవడానికి ఐపీఎల్ నిబంధననే కారణమని వాపోయాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడికి కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.నిజానికి టీ20లలో టీమిండియా తరఫున ఫినిషర్‌గా రాణిస్తున్న రింకూకు మొండిచేయి చూపడానికి కారణం ఐపీఎల్-2024లో అతడి ప్రదర్శన ఓ కారణమని చెప్పవచ్చు. గతేడాది 14 మ్యాచ్‌లు ఆడిన ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్.. 474 పరుగులు చేశాడు.ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాది సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు 15 టీ20లు ఆడి 356 పరుగులు సాధించాడు.నిలకడైన ఆటతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని అంతా భావించారు. వరల్డ్‌కప్ రేసులోనూ రింకూ ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే, తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో మాత్రం రింకూకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఈ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఎక్కువగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్‌లో భాగమైన రింకూ 168 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ జట్టులో రింకూ సింగ్ పేరు తప్పక ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అతడికి స్థానం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గనుక లేకపోయి ఉంటే అతడు కచ్చితంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేవాడు’’ అని పేర్కొన్నాడు. -
కెరీర్ ముగిసిండేది.. జో రూట్‌పై ఆర్పీ సింగ్ సంచలన కామెంట్స్
రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో రూట్‌ను ఉద్దేశించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్ ఆడాలని ఆర్పీ సింగ్ సూచించాడు. కాగా ఈ సిరీస్‌లో రూట్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. జైశ్వాల్‌కు గాయం! ఆట మధ్యలోనే? -
WC 2023: అదొక్కటే ఉంటే సరిపోదు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు ఉమ్రాన్! అప్పుడే..
Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన పేస్ ఒక్కటే. కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్ ఆడించి మరో మ్యాచ్‌లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్‌గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి. అదే బలం.. కానీ నిజానికి వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్‌లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఉమ్రాన్‌ను మరికొన్ని మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్. కానీ బౌలింగ్‌లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్ తన స్కిల్స్ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. నెట్‌బౌలర్‌గా వచ్చి.. ఏకంగా భారత యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో నెట్‌బౌలర్‌గా ప్రవేశించిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా తరఫున.. ఇక గతేడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్, 2022లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. విండీస్ పర్యటనలో.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్ అవకాశాల గురించి ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక.. -
'ధోని, రోహిత్, కోహ్లి కాదు.. అతడే ఐపీఎల్ సూపర్ కెప్టెన్'
ఐపీఎల్-2023 సీజన్ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 31 నుంచి ఈ ధానాధాన్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్లగా తమ సత్తా చాటుకున్నారు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి, పాంటింగ్, వార్నర్ వంటి వారు సారథిలగా తమ జట్లకు ఎన్నోచిరస్మరణీయ విజయాలను అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్‌ను అందించగా.. ధోని సారథ్యంలో సీఎస్కే నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ టైటిల్ సాధించకపోయనప్పటికీ.. ఒక్క సారి ఫైనల్, రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ ఫేవరేట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్న భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్‌కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అతడు చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా తన ఫేవరేట్ కెప్టెన్‌గా సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్నాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో నాకు ఇష్టమైన కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. అతడు ఆస్ట్రేలియాతో పాటు డెక్కన్ ఛార్జర్స్‌కు మూడేళ్లపాటు నాయకుడిగా ఉన్నాడు. అతడు సారథిగా మేము తొలి సీజన్లోనే ఛాంపియన్స్‌గా నిలిచాం. అందుకే గిల్‌క్రిస్ట్ నా ఫేవరేట్ కెప్టెన్. అనంతరం 2010 సీజన్లో కూడా మేము అద్భుతంగా రాణించాము. దురదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాం" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్(సన్రైర్స్ హైదరాబాద్) తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనంతరం 2010 సీజన్లో కూడా డెక్కన్ ఛార్జర్స్ అదరగొట్టింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ వ్యవహరించనున్నాడు. చదవండి: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు' -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్‌డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్‌డే డిసెంబరు 6నే! భారత ఆల్‌రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్‌లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్‌లో జననం ►స్పిన్ ఆల్‌రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆల్‌రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్‌కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్‌కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెక్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్‌లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్‌క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్‌ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్‌కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్‌తో.. జూనియర్ ఆర్పీ సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్‌లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు ఎందుకు..?
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌లో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. ఇక మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరగనున్న అఖరి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో అఖరి టీ20లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్(117) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఇక వన్డేల్లో మాత్రం ఐదో స్థానంలో సూర్య బ్యాటింగ్ వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కేవలం 27 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో యాదవ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే యాదవ్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని ఆర్పీ సింగ్ సూచించాడు. "సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని నేను భావిస్తున్నాను. ఒక ఆటగాడు ఫామ్‌లో ఉన్నప్పుడు అతడి బ్యాటింగ్ స్థానంలో మార్పు చేయకూడదు. ఇక కోహ్లి జట్టుకు అందుబాటులో లేకుంటే 3వ ప్థానంలో రాహుల్‌కు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా ఆరంభంలో వికెట్లు కోల్పోతే భారత బ్యాటర్లు భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నించాలి. ఇంగ్లండ్ మాత్రం ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ మూడో వన్డేలో తమ బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేస్తాడని నేను భావించను. ఎందకుంటే అతడు ఇదివరకే తమ బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవని సృష్టం చేశాడు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
Ind Vs Eng: తప్పంతా వాళ్లదే.. అందుకే ఇలా.. మూడో వన్డేలో గనుక ఓడితే!
India Vs England ODI Series 2022- 2nd ODI : టీమిండియా బ్యాటర్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సూచించాడు. వన్డే ఫార్మాట్లో ప్రతిసారి భారీ షాట్లకు యత్నిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పిచ్‌లపై టాపార్డర్ మెరుగ్గా రాణించాల్సి ఉంటుందని.. టెయిలెండర్లపై భారం వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. బౌలర్లు ఫర్వాలేదు! కాగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్ 247 పరుగులు లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ షమీ ఒకటి, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. యజువేంద్ర చహల్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం 9 పరుగులకే నిష్క్రమించాడు. టాపార్డర్ కకావికలం ఇక విరాట్ కోహ్లి 16 పరుగులుకే పెవిలియన్ చేరగా.. రిషభ్ పంత్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 27, హార్దిక్ పాండ్యా 29, రవీంద్ర జడేజా 29 పరుగులతో రాణించి ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో షమీ 23 పరుగులు సాధించగా.. బుమ్రా రెండు పరుగులతో అజేయంగా నిలిచాడు. చహల్, ప్రసిద్ వరుసగా 3,0 స్కోర్ చేశారు. తప్పంతా వాళ్లదే! ఇలా టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో టీమిండియాకు వంద పరుగుల తేడాతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుపై ఆర్పీ సింగ్ క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘వన్డేలు ఆడేటపుడు భారత బ్యాటర్లు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలి. ప్రతి బాల్‌ను అటాక్ చేస్తూ భారీ షాట్లు కొడతామంటే కుదరదు. ప్రతిసారి ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. చివరిదాకా ఇన్నింగ్స్ కొనసాగించాలి. ఇంగ్లండ్ గడ్డపై టెయిలెండర్లకు బ్యాటింగ్ అంత తేలికేమీ కాదు. మూడో వన్డేలో ఇండియాను గెలిపించే బాధ్యత టాపార్డర్ మీదే ఉంది’’ అని టీమిండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. మూడో వన్డేలో ఓడి సిరీస్ చేజారితే గనుక బ్యాటర్లదే బాధ్యత అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. That winning feeling 🙌 Toppers ends with SIX wickets 🔥 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5e0auq4yc6 — England Cricket (@englandcricket) July 14, 2022 ఓపెనర్లు, టాపార్డర్ విఫలమైతే.. మ్యాచ్ గెలవడం కష్టమని.. మొదటి వన్డేలో ఇంగ్లండ్‌కు అందుకే పరాజయం ఎదురైందని.. ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపాడు. రెండో వన్డేలో టీమిండియాకు ఇంగ్లండ్ అంత పెద్ద లక్ష్యమేమీ విధించలేదన్న ఆర్పీ సింగ్.. ఇది పూర్తిగా బ్యాటర్ల వైఫల్యమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఇరుజట్ల మధ్య ఆదివారం(జూలై 17) మాంచెస్టర్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. Jos Buttler- Virat Kohli: కోహ్లి ఆట తీరుపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు! అతడు కూడా మనిషే.. -
'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు'
టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9న ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ ఈ సిరీస్ ఆడాలని నేను భావిస్తున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతడి వ్యక్తిగత ఆలోచన. విశ్రాంతి అనేది అతడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ అతడికి బ్రేక్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది సుదీర్ఘ సిరీస్ అని మనకు తెలుసు. అంతేకాకుండా అతడు కెప్టెన్ కాబట్టి ఈ సిరీస్‌లో ఖచ్చితంగా ఆడాలి. ఐపీఎల్లో రోహిత్ గత కొన్ని సీజన్లో 400కి పైగా పరుగులు చేయలేదు. 400 పరుగుల మార్క్‌ను దాటిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ టోర్నమెంట్లో అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడు. కానీ రెండు మూడు సార్లు అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించాడు. కాబట్టి రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని అందరూ భావిస్తారు. టీ ఫార్మాట్లో జట్టుకు మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడే బ్యాటర్లు కావాలి. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన జట్టు విజయం సాధిస్తుందిని" ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లోను రోహిత్ తీవ్రంగా నిరాశ పరిచాడు. 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: బీజేపీకి షాక్.. అమిత్ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్ కామెంట్స్ -
'మ్యాచ్ గెలవడం కంటే నీ ఈగో ముఖ్యమా'
ఐపీఎల్-2022లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఔటైన తీరుపై టీమిండియా మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్ నిర్లక్షమైన షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11 ఓవర్ చివరి బంతికి లలిత్ యాదవ్ ఔటైన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ తీశాడు. అయితే మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చిన పంత్.. లివింగ్‌స్టోన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతిని వేయడానికి సిద్దమైన లివింగ్‌స్టోన్.. కొన్ని కారణాల వల్ల రన్-అప్ మధ్యలో ఆగిపోయాడు. కాగా పంత్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి ఆడటానికి సిద్దమైనట్లు అనిపించింది. అయితే అది గమనించిన లివింగ్‌స్టోన్ తెలివిగా తరువాతి బంతిని వైడ్‌గా వేసి పంత్‌ను స్టంపౌట్ చేశాడు. పంత్ ఔటయ్యాక వరుస క్రమంలో ఢిల్లీ వికెట్లు కోల్పోయింది. జట్టును ముందుండి నడిపించాల్సిన సమయంలో బాధ్యత రహితంగా ఆడిన పంత్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ సంచలన వాఖ్యలు చేశాడు. "మ్యాచ్ గెలవడం కంటే మన ఈగో ముఖ్యమా? ఆప్పటికే పంజాబ్ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. లలిత్ యాదవ్‌ను నిందించలేము. ఎందుకంటే అతడికి అంత అనభవం లేదు. వికెట్లు పడుతున్న సమయంలో పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సింది. లివింగ్‌స్టోన్ ట్రాప్ చేశాడు. పంత్ అతడి ట్రాప్‌లో పడిపోయాడు. లివింగ్‌స్టోన్ రెగ్యూలర్ బౌలర్ కూడా కాదు. లివింగ్‌స్టోన్ తెలివిగా పంత్ టెంపర్‌కు తగ్గట్టు బౌలింగ్ చేశాడు. చివరికి అతడి ఈగోపై లివింగ్‌స్టోన్ విజయం సాధించాడు" అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! -
Kane Williamson: ఇంకెంత కాలం భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!
IPL 2022- Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ విమర్శలు గుప్పించాడు. పవర్‌ప్లేలో ఆడే అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నాడని పెదవి విరిచాడు. ఇకనైనా అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని సన్‌రైజర్స్ యాజమాన్యానికి సూచించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో కేన్ మామ బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు మొత్తం కలిపి 208. అత్యధిక స్కోరు 57. అంటే కేన్ విలియమ్సన్ ఆట తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్.. కేన్ విలియమ్సన్ ఆట తీరు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘విలియమ్సన్ జట్టులో ఉంటే బాగుంటుంది. అయితే, అతడిని తుది జట్టు నుంచి తప్పించినా బాగానే ఉంటుంది. ఇంకెంత కాలం అతడిని భరిస్తారు? తనొక ప్రొఫెషనల్ క్రికెటర్. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా అతడిని కొనసాగించాలా? కేన్ విలియమ్సన్ మంచి వ్యక్తి. గొప్ప కెప్టెన్ కూడా! కానీ ఓపెనర్‌గా రాణించలేకపోతున్నాడు. ఇప్పటికీ జట్టులో మార్పులు చేయకపోతే కష్టం. అభిషేక్ శర్మతో కలిసి రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్‌కు దింపండి’’ అని సన్‌రైజర్స్ యాజమాన్యానికి సూచించాడు. ఇక భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సైతం ఓపెనర్‌గా విలియమ్సన్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని, అతడు మిడిలార్డర్లో ఫిట్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా సన్‌రైజర్స్ మంగళవారం(మే 17) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే అవకాశం రైజర్స్‌కు ఉంటుంది. చదవండి👉🏾IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే.. #OrangeArmy, before our game tonight, @nicholas_47 has a message from the #Riser camp for all of you. 🗣️🧡#MIvSRH #ReadyToRise #TATAIPL pic.twitter.com/VrCIRczoN3 — SunRisers Hyderabad (@SunRisers) May 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్'
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్‌గా మారగా.. పంజాబ్ కింగ్స్‌కు లియామ్ లివింగ్‌స్టోన్ అత్యత్తుమ ఫినిషర్గాఘున్నాడు. అయితే లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్ అని భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ అన్నాడు. కార్తీక్ ఆర్సీబీ జట్టును చాలా మ్యాచ్‌ల్లో గెలిపించినందున లివింగ్‌స్టోన్‌పై పైచేయి సాధించాడని ఆర్పీ సింగ్ తెలిపాడు. "అండర్-19 వరల్డ్‌కప్‌లో కార్తీక్ నా బ్యాచ్‌మేట్. అతడు అప్పుడు కూడా రనౌట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పులేదు. కార్తీక్ ఎక్కువగా ఆలోచించినప్పుడల్లా తప్పులు ఎక్కువ చేస్తాడు. కార్తీక్‌ది అటవంటి క్యారెక్టర్. కాబట్టి అతడికి ఆలోచించడానికి తక్కువ సమయం ఇవ్వండి. అతడు 10 లేదా 20 బంతులు మిగిలిఉన్నప్పడు అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తాడు. అతడు అఖరిలో ప్రతీ బంతిని బౌండరీ బాదాలని చూస్తాడు. అతడి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మీకు తెలుస్తుంది. అఖరి ఓవర్లలో కార్తీక్ అత్యత్తుమ ఆటగాడు అని. ఇక అతడిని లియామ్ లివింగ్‌స్టోన్‌తో పోల్చినట్లయితే, కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో తన జట్టుకు చాలా విజయాలు అందించాడు. కాబట్టి లివింగ్‌స్టోన్ కంటే కార్తీక్ బెస్ట్ఫినిషర్ అని నేను భావిస్తున్నాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..! -
"ఈ ఏడాది ముంబై కథ ముగిసింది.. రాబోయే సీజన్ల కోసం ఇప్పటి నుంచే"
ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2022లో పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఈ సీజన్లో ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం లేనందున, రాబోయే సీజన్లలో అత్యత్తుమమైన జట్టును సన్నద్దం చేయాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ సూచించాడు. అదే విధంగా రాబోయే మ్యాచ్‌ల్లో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అతడు అభిప్రాయపడ్డాడు. "ప్రస్తుత సీజన్లో ముంబై కథ ముగిసింది. వారు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే. రాబోయే సీజన్ల కోసం ఇప్పటి నుంచే సరైన జట్టును తాయారు చేయాలి. బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. బెంచ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకి రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వాలి. యువ కీపర్-బ్యాటర్ ఆర్యన్ జుయల్ ఓ అవకాశం ఇవ్వాలి. అతడు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. జయల్ అద్భుమైన ప్రతిభను కలిగి ఉన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి రాబోయే సీజన్ల కోసం ఎవరిని రీటైన్ చేయవచ్చో, ఎవరిని విడుదల చేయవచ్చో అంచనా వేయవచ్చు. ఈ ఏడాది వేలంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని తదుపరి వేలానికి ముంబై సిద్దం కావాలి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: కేకేఆర్ కెప్టెన్, మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు!
IPL 2022 KKR Vs RR: గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్-2022 పెద్దగా కలిసిరావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా వరుస పరాజయాలతో డీలా పడింది. ముఖ్యంగా సరైన కాంబినేషన్ సెట్ చేయలేక తరచుగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. స్వయంగా తానే ఈ విషయాన్ని అంగీకరించాడు. ఇక ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టిక(6 పాయింట్లు)లో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ కేకేఆర్ జట్టు కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కేకేఆర్ అవలంబిస్తున్న వ్యూహాన్ని విమర్శించాడు. చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ యాజమన్యాన్ని తప్పుబట్టాడు. ఆర్పీ సింగ్(ఫైల్ ఫొటో) ఈ మేరకు.. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..‘‘మైదానం వెలుపల ఉన్న మనం ఏదేని జట్టు కూర్పు గురించి అంచనాలు వేయడం సహజం. అత్త్యుతమ తుది జట్టునే మనం ఎంచుకుంటాం. కానీ కేకేఆర్ కెప్టెన్, మేనేజ్మెంట్కు ఏమయిందో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్లు ఎన్ని మార్పులు చేస్తున్నారో చూడండి. వెంకటేశ్ అయ్యర్‌ను టాపార్డర్ నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఓపెనర్‌గా తీసుకువచ్చారు. ఇక నితీశ్ రాణా విషయంలో ఇలాంటి నిర్ణయమే. ముందు టాపార్డర్.. తర్వాత లోయర్ ఆర్డర్. అసలు కేకేఆర్‌లో ఏ ఒక్క బ్యాటర్‌కు కూడా కచ్చితమైన పొజిషన్ ఉందా!’’ అని ఆర్పీ సింగ్ ప్రశ్నించాడు. ఇక భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సైతం.. ‘‘కేకేఆర్ జట్టు బాగుంది. కానీ తుది జట్టు కూర్పు విషయంలో వాళ్లకు క్లారిటీ లేదు. అందుకే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి👉🏾IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..! Arjun had Dronacharya, Harshit has Baz! 🎯@Bazmccullum #HarshitRana • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/V54ef8uSWX — KolkataKnightRiders (@KKRiders) May 1, 2022 Watch the Knights prepping up ahead of an all-important #KKRvRR! 💜#KnightsTV presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 https://t.co/fBOfU2FTFs — KolkataKnightRiders (@KKRiders) May 1, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: పాపం పొలార్డ్.. కృనాల్ ఓవరాక్షన్ భరించలేకున్నాం!
IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్ పటేల్ క్రిజ్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’’ అని కృనాల్ తీరును తప్పుబట్టాడు. ఇక మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది? తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్’’ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్ ఎడిషన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది. చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్ ఇదేమైనా టెస్టు మ్యాచ్ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi — IndianPremierLeague (@IPL) April 24, 2022 -
'సీఎస్కే కెప్టెన్‌గా మళ్లీ ధోని కావాలి.. లేదంటే'
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో సీఎస్కే నిలిచింది. కాగా ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడు స్థానంలో చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంస్ ధోని మళ్లీ సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. "సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. సీఎస్కే వారి ప్లేయింగ్ ఎలెవన్‌లో సాధారణంగా మార్పులు చేయడం చూడం. కానీ ప్రస్తుత సీజన్లో వారి జట్టు చాలా వీక్‌గా ఉంది. వారు పోటీలో నిలవాలంటే వరుసగా వజయాలు సాధించాలి. కాబట్టి ధోని తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే జట్టు పరిస్థితులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నాను" అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది' -
తీవ్ర విషాదంలో పార్థివ్ పటేల్.. భావోద్వేగ పోస్టుతో..
Parthiv Patel Father Passed Away: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’’ అని అతడు ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. కాగా కొంతకాలం క్రితం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పార్థివ్ తండ్రిని.. స్వస్థలం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ పటేల్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్ కీపర్‌గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt — parthiv patel (@parthiv9) September 26, 2021 -
కరోనాతో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనాతో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఆర్పీ సింగ్ ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే అతని తండ్రి కరోనా బారీన పడ్డారు. దీంతో తండ్రిని చూసుకోవడానికి ఆర్పీ సింగ్ బయోబబుల్‌ను వదిలి బయటికి వచ్చేశాడు.అప్పటి నుంచి తండ్రి సపర్యలు చేస్తూ పక్కనే ఉన్నాడు. కాగా శివప్రసాద్ కరోనాతో పోరాడుతూ బుధవారం మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని ఆర్పీ సింగ్ తన ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చాడు.' నా తండ్రి శివప్రసాద్ సింగ్ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా. 15 రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఇవాళ మృత్యువాత పడ్డారు. నా తండ్రి లేరనే వార్త నన్ను కుంగదీసినా మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. మా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటూ మీరంతా ఆ దేవుడిని ప్రార్థించాలని కోరుతున్నా. మిస్ యూ నాన్న'' అంటూ పేర్కొన్నాడు. కాగా సోమవారం మరో క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి కూడా కరోనాతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక 2018లో ఆర్పీ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో ఆర్పీ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు It is with deepest grief and sadness we inform the passing away of my father, Mr Shiv Prasad Singh. He left for his heavenly abode on 12th May after suffering from Covid. We request you to keep my beloved father in your thoughts and prayers. RIP Papa. ॐ नमः शिवाय 🙏🙏 — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) May 12, 2021 -
తండ్రికి పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్.. కామెంటేటర్ ఆర్పీ సింగ్ ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బయోబబుల్ సెక్యూర్‌ను వదిలి ఫ్యామిలీకి సహాయంగా ఉండేందుకు వెళ్లాడు. ఆర్పీ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్, లైవ్ మ్యాచ్‌లు టెలికాస్ట్ చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ సిబ్బంది ఎవరైనా సరే నిబంధనల్లో భాగంగా బయోబబుల్ సెక్యూల్ ఉండేలా ఆంక్షలు విధించారు. అయితే మంగళవారం ఆర్పీ సింగ్ తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో తన అవసరం నా ఫ్యామిలీకి ఉందని.. అందుకే తప్పుకుంటున్నట్లు ఆర్పీ సింగ్ తెలిపాడు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బయోబబుల్ సెక్యూర్ దాటి బయటికి వెళ్తే మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఆర్పీ సింగ్‌తో పాటు అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, పార్థివ్ పటేల్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, దీప్‌దాస్ గుప్తా తదితర మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా ఉదృతమవుతున్న వేళ ఐపీఎల్ 14 సీజన్ నుంచి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స ఆటగాడు అశ్విన్ తప్పుకోగా.. ఇక విదేశీ ఆటగాళ్లలో రాజస్తాన నుంచి లివింగ్ స్టోన్, ఆండ్రూ టై, ఆర్సీబీ నుంచి కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా లీగ్‌ను వీడిన సంగతి తెలిసిందే.ఇక 2018లో ఆర్పీ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. చదవండి: అతని స్థానంలో ఆర్సీబీలోకి కొత్త ఆటగాడు.. -
సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరి కమిటీ (సీఏసీ) వేగవంతం చేసింది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ నాయకత్వంలోని సీఏసీ.. సెలక్షన్ ప్యానెల్(పురుషుల క్రికెట్) నియామక ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ మేరకు అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మనీందన్ సింగ్, నయన్ మోంగియా, ఎస్ఎస్ దాస్ పేర్లను షార్ట్‌లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అభయ్ కురువిల్లా, అజయ్ రత్రా, నిఖిల్ చోప్రా, దేవాశిష్ మహంతి, రణదేవ్ బోస్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.(చదవండి: 'నీకు చాన్స్ ఇద్దామనే అలా చేశా') కాగా స్క్రూటినీ అనంతరం సీఏసీ ఎంపిక చేసిన పేర్లను బీసీసీఐకి పంపిస్తుంది. ఇక గురువారం బీసీసీఐ జనరల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన నేడే వెలువడే అవకాశం ఉంది. జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ, సరణ్దీప్ సింగ్ పదవీకాలం సెప్టెంబరులో పూర్తైన నేపథ్యంలో బీసీసీసీ దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా సెలక్టర్‌గా ఎంపిక అయ్యేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవాళ్లు మాత్రమే అర్హులు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. వయోపరిమితి 60 ఏళ్లు. -
ఆ వివాదంలోకి ధోనిని లాగారు.. కానీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని-మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌లు స్నేహితులన్న సంగతి తెలిసిందే. భారత జట్టు తరఫున ఆడే క్రమంలో వీరిద్దరి మధ్య ఒక స్నేహ పూర్వక వాతావరణం కొనసాగేది. అయితే ఒకానొక సమయంలో ఆర్పీ సింగ్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని ధోని పట్టుబట్టాడనే వివాదం చెలరేగింది. 2008లో ఇంగ్లండ్‌తో స్వదేశీ సిరీస్‌లో భాగంగా ఆర్పీ సింగ్ జట్టులో ఉండాలని ధోని సెలక్షన్ కమిటీపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆర్పీని జట్టులోకి తీసుకోనట్లయితే కెప్టెన్సీ వదులుకోవడానికి కూడా ధోని సిద్ధమయ్యాడంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఆ సిరీస్‌లో ఇర్ఫాన్ పఠాన్ స్థానంలో ఆర్పీ సింగ్‌ను తీసుకోవాలని ధోని పట్టుబట్టినట్లు ఆ వార్తల సారాంశం. జట్టు సెలక్షన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యిందంటూ పుష్కరం కాలం నాడు అది పెద్ద వార్త అయ్యింది. అది ఎంత నిజమో తెలీదు కానీ దాన్ని ఆర్పీ సింగ్ తాజాగా ఖండించాడు. (భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్) తనను ఎంపిక చేసే విషయంలో కానీ, తాను జట్టులో చోటు కోల్పోవడంలో కానీ ధోని పాత్ర లేదన్నాడు. ఎప్పుడూ ధోని ఆటగాళ్ల సెలక్షన్లో పట్టుబట్టిన సందర్భాలు అనేవి లేవన్నాడు. తనను జట్టులోకి తీసుకోవాలని సమాచారం లీక్ అయ్యిందనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. అలా లీక్ కావడం వల్లే తన కెరీర్ ముగిసిపోయిందనేది అర్థంలేని ఆరోపణగా ఆర్పీ పేర్కొన్నాడు. అంతకుముందు ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో తాను ఒక వికెట్ కూడా తీయలేదని, దాంతో మరో కొన్ని చాన్స్‌లు మాత్రం ఆశించానన్నాడు. కొంతమందికి నాలుగు-ఐదు, మరికొంతమందికి పది చాన్స్‌లు వస్తుంటాయని, అది వారి అదృష్టాన్ని బట్టి ఉంటుందన్నాడు. తన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే తన కెరీర్ ముందుకు సాగలేదన్నాడు. (టీమిండియా ఫీల్డింగ్ మాతోనే పోయింది!) 2011లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తాను పూర్తిగా విఫలమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఆ సిరీస్ తర్వాత తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నాడు. జట్టుకు దూరమైన ఏడేళ్ల తర్వాత అంటే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్పీ సింగ్ గుడ్ బై చెప్పేశాడు. అయితే తాను భారత్‌కు చాలానే మ్యాచ్‌లు ఆడానని, దానితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఏ రోజూ తనను ఎంపిక చేసే విషయంలో కానీ, తప్పించడంలో కానీ ధోని పాత్ర లేదన్నాడు. తమ ఫ్రెండ్షిప్కు సెలక్షన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇవాళ ధోని గురించి మాట్లాడుకుంటున్నామంటే అతను వివాదాలకు దూరంగా ఉండటం కూడా ఒక కారణమన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎంఎస్ ధోని అంటే ఎంఎస్ ధోనినేనని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ఒత్తిడిలో కూడా ధోని తీసుకునే నిర్ణయాలే అతన్ని ఉన్నత స్థానంలో నిలిపాయన్నాడు. -
'ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు'
ముంబై : 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అప్పటి జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలోనే ఉన్నానని తెలిపాడు. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్‌తో మంగళవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పార్థివ్ మాట్లాడాడు. ('అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని') 'సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు. 2008లో ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్ మొత్తం వివాదాల నడుమే కొనసాగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో హర్బజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ ప్రేమికులెవరు అంత తొందరగా మరిచిపోలేరు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్నవయస్కుడిగా (17ఏండ్ల 153రోజులు) వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాకిస్తాన్ వికెట్ కీపర్ హనీఫ్ మహ్మద్(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. ('నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు') -
ఆర్పీసింగ్, చావ్లాలతో ధోని..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తనకు దొరికిన విశ్రాంతి సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసున్నాడు. ఈ మధ్యనే మాల్దీవులకు వెళ్లిన ధోని.. అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్పి సింగ్, పీయూష్ చావ్లాలు కూడా ఓ కార్యక్రమంలో ధోనిని కలిశారు. ఈ క్రమంలోనే ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన ధోని.. అక్కడున్న పదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసాడు. వాటిని సహచర క్రికెటర్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాలకు అందించాడు. వెంటనే ఆర్పీ సింగ్ ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎంఎస్ ధోని పూరి తయారు చేసిన విధానాన్ని ‘ఎంఎస్ ధోని ఫాన్స్’ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ‘మాల్దీవుల్లో మా రాక్‌స్టార్ పానీ పూరిస్ తయారుచేస్తున్నాడు’ అని కాప్షన్ రాసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. అభిమానులు ఫన్నీ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని.. మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని.. ఐపీఎల్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాతే భారత్ తరఫున ధోని మళ్లీ ఆడతాడా.. లేదా అనే విషయం తెలుస్తుంది. ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోనికి స్థానం కల్పించలేదు. గత అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించడంతోనే ధోనికి చోటు దక్కలేదని బీసీసీఐ పెద్దలు వివరణ ఇచ్చారు. అక్టోబర్ నెల నుంచి చూస్తే ధోని ఆడలేదని, దాంతోనే అతని కాంట్రాక్ట్‌ను తొలగించామన్నారు. ఒకవేళ మళ్లీ ధోని రీ ఎంట్రీ ఇస్తే కాంట్రాక్ట్ రావడం అంత కష్టం ఏమీ కాకపోవచ్చు. Straight outta Maldives, our rockstar is seen making a couple of pani puris!👨🍳 Our favorite chat just became even more delectable! 🥰🤤#MahiInMaldives #Dhoni @msdhoni pic.twitter.com/NFjGcuMT1h — MS Dhoni Fans Official (@msdfansofficial) February 4, 2020 -
ఆర్పీ సింగ్‌కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ (రుద్రప్రతాప్ సింగ్)ను కీలక పదవి వరించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ప్రకటించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో ఆర్పీ సింగ్‌కు అనూహ్యంగా చోటుదక్కింది. ముగ్గురు సభ్యుల గల సీఏసీ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. వీరిలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్ మూడో సభ్యుడుగా ఆర్పీ సింగ్‌ను ఎంపిక చేశారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్పీ సింగ్ భారత్ తరఫున 14 టెస్ట్ మ్యాచ్‌లు, 58 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో జరిగిన టీ-20 ప్రపంచ కప్‌లో చోటుదక్కించుకుని.. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సుమారు ఆరేళ్ల పాటు వివిధ ఫార్మాట్లో టీమిండియాకు సేవలు అందిచిన ఆర్సీ సింగ్ తన చివరి మ్యాచ్‌ను 2011లో ఆడాడా. కొంతకాలం పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.