రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా(PC: BCCI)
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్‌డే డిసెంబరు 6నే! భారత ఆల్‌రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు.
ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
1.జస్‌ప్రీత్ బుమ్రా- గుజరాత్
►అహ్మదాబాద్‌లో జననం
►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్.
►ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం.
►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు
►కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు
►పడగొట్టిన వికెట్లు: 319.
2. రవీంద్ర జడేజా- గుజరాత్
►నవగామ్‌లో జననం
►స్పిన్ ఆల్‌రౌండర్
►టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రఖ్యాతి
►ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం
►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగులు: 5427
►పడగొట్టిన వికెట్లు: 482
►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు.
శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర
►ముంబైలో జననం
►ఐపీఎల్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.
►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49.
►పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు
ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్
►1985లో రాయ్ బరేలీలో జననం
►లెఫ్టార్మ్ మీడియం పేసర్
►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్
►అంతర్జాతీయ కెరీర్‌లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన
కరుణ్ నాయర్
►1991లో జననం
►దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్
►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్
ఆండ్రూ ఫ్లింటాఫ్
►లంకషైర్‌లో 1977లో జననం
►1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం
►ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆల్‌రౌండర్
►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు
►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న ఫ్లింటాఫ్.
చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్
Ivana Knoll FIFA WC: జపాన్‌ను అవమానించిన క్రొయేషియా సుందరి
Comments
Please login to add a commentAdd a comment