
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో సీఎస్‌కే నిలిచింది. కాగా ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడు స్థానంలో చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఎంస్ ధోని మళ్లీ సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. "సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. సీఎస్‌కే వారి ప్లేయింగ్ ఎలెవన్‌లో సాధారణంగా మార్పులు చేయడం చూడం. కానీ ప్రస్తుత సీజన్‌లో వారి జట్టు చాలా వీక్‌గా ఉంది. వారు పోటీలో నిలవాలంటే వరుసగా వజయాలు సాధించాలి. కాబట్టి ధోని తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే జట్టు పరిస్థితులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నాను" అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది'