Courtesy: IPL Twitter
సీఎస్‌కే పై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం
సీఎస్‌కే పై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి రాజస్తాన్ చేరుకుంది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లో జైశ్వాల్(59),అశ్విన్(40) పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ప్రశాంత్ సోలంకీ రెండు, సిమర్‌జీత్ సింగ్, మొయిన్ అలీ ,శాంట్నర్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో మొయిన్ అలీ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బ్యాటర్లలో చాహల్, మోకాయ్ చెరో రెండు వికెట్లు, అశ్విన్, బౌల్ట్ తలా వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
112 పరుగుల వద్ద రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన హెట్‌మైర్.. ప్రశాంత్ సోలంకీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో అశ్విన్, పరాగ్ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
104 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన జైశ్వాల్.. ప్రశాంత్ సోలంకీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో అశ్విన్, హెట్‌మైర్ ఉన్నారు.
14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 94/3
14 ఓవర్లకు రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51),అశ్విన్(12) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
రాజస్తాన్ పడిక్కల్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన పడిక్కల్.. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 80/3
రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
67 పరుగులు వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శాంసన్.. శాంట్నర్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 59/1
7 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(38), శాంసన్(14) పరుగులతో ఉన్నారు.
5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోర్: 47/1
5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(31), శాంసన్(13) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన బట్లర్.. సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శాంసన్(2), జైశ్వాల్(13) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 18/1
చెలరేగిన మొయిన్ అలీ.. రాజస్తాన్ టార్గెట్ 151 పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో మొయిన్ అలీ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బ్యాటర్లలో చాహల్, మోకాయ్ చెరో రెండు వికెట్లు, అశ్విన్, బౌల్ట్ తలా వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
146 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ధోని.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 146/5
17 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 126/4
17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ(86), ధోని(14) పరుగులతో ఉన్నారు.
14 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 111/4
14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ(77),ధోని(8) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
95 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాయుడు.. చాహల్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 96/4
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
88 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 1పరుగు చేసిన జగదీశన్.. మోకాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 89/3
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
85 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కాన్వే.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యాడు. 8 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 87/2
మొయిన్ అలీ దూకుడు.. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 75/1
తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయినప్పటికీ సీఎస్‌కే దూకుడుగా ఆడుతోంది. మొయిన్ అలీ ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. మొయిన్ కేవలం 21 బంతుల్లోనే 59 పరుగులు సాధించి క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 75/1
నాలుగు ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 33/1
నాలుగు ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(13), మొయిన్ అలీ(18) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఆదిలోనే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన గైక్వాడ్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో మొయిన్ అలీ, కాన్వే ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా బ్రబౌర్న్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక పోరుకు రాజస్తాన్ రాయల్స్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రాజస్తాన్ విధ్వంసకర ఆటగాడు హెట్‌మైర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని భావిస్తోంది.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్)), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్‌కాయ్
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరానా, ముఖేష్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment