సంజూ శాంసన్(PC: IPL)
IPL 2022 GT Vs RR: ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఓ చెత్తరికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2022లో 13 సార్లు టాస్ ఓడిన శాంసన్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతకుముందు ధోని 2012 సీజన్‌లో 12 సార్లు టాస్ ఓడిపోయాడు.
ఇక తొలి తొలి క్వాలిఫైయర్‌లో మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లో ఫైనల్ చేరి హార్దిక్ పాండ్యా బృందం ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది.
ఐపీఎల్ క్వాలిఫైయర్-1: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు
టాస్- గుజరాత్
రాజస్తాన్ రాయల్స్- 188/6 (20)
గుజరాత్ టైటాన్స్- 191/3 (19.3)
7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం
చదవండి: BAN vs SL: శ్రీలంక ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు.. వెంటనే తిరిగి రావాలని..!
Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 24, 2022
Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA
Comments
Please login to add a commentAdd a comment