ధోనితో సంజూ
IPL 2023 CSK Vs RR- Dhoni- Sanju Samson: టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్నా సరే తన ఆటలోని చరిష్మా తగ్గలేదని ఐపీఎల్‌లో ఆట ద్వారా మళ్లీ మళ్లీ నిరూపిస్తునే ఉన్నాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ సారథి.
తలా మైదానంలోకి వచ్చాడంటే ఫ్యాన్స్‌ను ఆపడం ఎవరితరం కాదు. సొంత మైదానం అయినా.. ప్రత్యర్థి వేదికైనా ధోని నామస్మరణతో మారుమ్రోగిపోవాల్సిందే. ఇక ఆట ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్ల యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ ధోని కనిపించిన ఫొటోలు కోకొల్లలు.
తన అనుభవంలోని విలువైన పాఠాలను తలైవా వాళ్లతో పంచుకుంటూ ఉంటాడు. యంగ్ ప్లేయర్లు మాత్రమేనా సూర్యకుమార్ యాదవ్ వంటి ప్రస్తుత టీ20 స్టార్లు సైతం ‘మాస్టర్’ ధోని దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు.
PC: IPL Twitter
ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లకు కూడా ఇలాంటి అవకాశం రానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం (ఏప్రిల్ 12) మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే సంజూ శాంసన్ బృందం చెన్నైకి చేరుకుంది. చెపాక్ వేదికగా ప్రాక్టీసు చేయనుంది.
వాత్తి ఇక్కడున్నారు.. ధోనితో సంజూ ఫొటో వైరల్
ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్యాన్‌బాయ్ మూమెంట్‌ను పంచుకున్నాడు. ధోనితో కలిసి ఫొటో దిగిన ఈ కేరళ బ్యాటర్.. ‘‘మాస్టర్ ఇక్కడున్నారు’’ అంటూ మురిసిపోయాడు. ఇన్‌స్టాలో సంజూ పంచుకున్న ఈ ఫొటోకు ఇప్పటికే లక్షల్లో లైకులు వచ్చాయి.
షేర్ చేసిన రెండు గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇరుజట్ల కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూసిన నెటిజన్లు.. ‘‘ ఒకరు మిస్టర్ కూల్.. మరొకరు మిస్టర్ కామ్.. ఫొటో అదిరింది. తదుపరి మ్యాచ్‌లో ఈ మాస్టర్‌ను ఎలా ఢీకొడతావో సంజూ! ఆల్ ది బెస్ట్’’ అని కామెంట్లు చేస్తున్నారు.
నాలుగేసి పాయింట్లు.. కానీ
ఇదిలా ఉంటే.. గతేడాది రన్నరప్ అయిన రాజస్తాన్ ఐపీఎల్-2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింట గెలుపొందింది. 4 పాయింట్లతో మెరుగైన రన్‌రేటు కారణంగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక చెన్నై కూడా రెండు విజయాలు సాధించినప్పటికీ రన్‌రేటు కారణంగా ఐదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు
IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment