ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌లో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. ఇక మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరగనున్న అఖరి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఇంగ్లండ్‌తో అఖరి టీ20లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్(117) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఇక వన్డేల్లో మాత్రం ఐదో స్థానంలో సూర్య బ్యాటింగ్ వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కేవలం 27 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో యాదవ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే యాదవ్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని ఆర్పీ సింగ్ సూచించాడు.
"సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని నేను భావిస్తున్నాను. ఒక ఆటగాడు ఫామ్‌లో ఉన్నప్పుడు అతడి బ్యాటింగ్ స్థానంలో మార్పు చేయకూడదు. ఇక కోహ్లి జట్టుకు అందుబాటులో లేకుంటే 3వ ప్థానంలో రాహుల్‌కు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా ఆరంభంలో వికెట్లు కోల్పోతే భారత బ్యాటర్లు భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నించాలి. ఇంగ్లండ్ మాత్రం ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ మూడో వన్డేలో తమ బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేస్తాడని నేను భావించను. ఎందకుంటే అతడు ఇదివరకే తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవని సృష్టం చేశాడు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment