Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన పేస్ ఒక్కటే.
కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్ ఆడించి మరో మ్యాచ్‌లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్‌గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి.
అదే బలం.. కానీ
నిజానికి వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్‌లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఉమ్రాన్‌ను మరికొన్ని మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్. కానీ బౌలింగ్‌లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్ తన స్కిల్స్ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు.
నెట్‌బౌలర్‌గా వచ్చి.. ఏకంగా
భారత యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో నెట్‌బౌలర్‌గా ప్రవేశించిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు.
టీమిండియా తరఫున..
ఇక గతేడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్, 2022లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు.
విండీస్ పర్యటనలో..
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్ అవకాశాల గురించి ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు.
చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక..
Comments
Please login to add a commentAdd a comment