
సాక్షి, హైదరాబాద్: దేశంలో మళ్లీ మోదీనే ప్రధానమంత్రి అవుతారని, కూటమి పేరుతో ఎంత మంది ఎన్ని గ్రూపులు కట్టినా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికే ప్రజల మద్దతు లభిస్తుందని బీజేపీ జాతీ య కార్యదర్శి ఆర్‌పీ సింగ్ పేర్కొన్నారు. తెలం గాణ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరచాలని, కేంద్రంలో ఎలాంటి ప్రధాని ఉండాలో జాగ్రత్తగా ఆలోచించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోమవారం ఆయన ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విచ్ఛిన్నకర శక్తు లు పేట్రేగిపోతున్న పరిస్థితుల్లో దేశంలో బలమైన ప్రధాని కోసం మోదీని గెలిపించాలని కోరారు. అవినీతి పార్టీల కూటమికి ఓటేద్దామా? అవినీతి రహిత మోదీ సర్కారుకు ఓటేద్దామా అని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నా రు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ రాంచంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment