Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్‌గా మారగా.. పంజాబ్ కింగ్స్‌కు లియామ్ లివింగ్‌స్టోన్ అత్యత్తుమ ఫినిషర్‌గాఘున్నాడు. అయితే లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్ అని భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ అన్నాడు. కార్తీక్ ఆర్‌సీబీ జట్టును చాలా మ్యాచ్‌ల్లో గెలిపించినందున లివింగ్‌స్టోన్‌పై పైచేయి సాధించాడని ఆర్పీ సింగ్ తెలిపాడు.
"అండర్-19 వరల్డ్‌కప్‌లో కార్తీక్ నా బ్యాచ్‌మేట్. అతడు అప్పుడు కూడా రనౌట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పులేదు. కార్తీక్ ఎక్కువగా ఆలోచించినప్పుడల్లా తప్పులు ఎక్కువ చేస్తాడు. కార్తీక్‌ది అటవంటి క్యారెక్టర్. కాబట్టి అతడికి ఆలోచించడానికి తక్కువ సమయం ఇవ్వండి. అతడు 10 లేదా 20 బంతులు మిగిలిఉన్నప్పడు అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తాడు.
అతడు అఖరిలో ప్రతీ బంతిని బౌండరీ బాదాలని చూస్తాడు. అతడి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మీకు తెలుస్తుంది. అఖరి ఓవర్లలో కార్తీక్ అత్యత్తుమ ఆటగాడు అని. ఇక అతడిని లియామ్ లివింగ్‌స్టోన్‌తో పోల్చినట్లయితే, కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో తన జట్టుకు చాలా విజయాలు అందించాడు. కాబట్టి లివింగ్‌స్టోన్ కంటే కార్తీక్ బెస్ట్‌ఫినిషర్ అని నేను భావిస్తున్నాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..!
Comments
Please login to add a commentAdd a comment