
టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ఐపీఎల్‌లోని నిబంధనే అని పేర్కొన్నాడు,
టీమిండియా నయా ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్న రింకూ సింగ్ గురించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కకపోవడానికి ఐపీఎల్ నిబంధననే కారణమని వాపోయాడు.
కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇక ఈ ఐసీసీ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడికి కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.
నిజానికి టీ20లలో టీమిండియా తరఫున ఫినిషర్‌గా రాణిస్తున్న రింకూకు మొండిచేయి చూపడానికి కారణం ఐపీఎల్-2024లో అతడి ప్రదర్శన ఓ కారణమని చెప్పవచ్చు. గతేడాది 14 మ్యాచ్‌లు ఆడిన ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్.. 474 పరుగులు చేశాడు.
ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాది సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు 15 టీ20లు ఆడి 356 పరుగులు సాధించాడు.
నిలకడైన ఆటతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని అంతా భావించారు. వరల్డ్‌కప్ రేసులోనూ రింకూ ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే, తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో మాత్రం రింకూకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఈ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఎక్కువగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్‌లో భాగమైన రింకూ 168 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ జట్టులో రింకూ సింగ్ పేరు తప్పక ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అతడికి స్థానం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గనుక లేకపోయి ఉంటే అతడు కచ్చితంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేవాడు’’ అని పేర్కొన్నాడు.