టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం టీమిండియాను నిన్న (ఏప్రిల్ 30) ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే మెజార్టీ శాతం ఎంపికలు జరిగినప్పటికీ.. రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిపై శీతకన్ను చూపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సెలెక్టర్లు రింకూను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు.
రింకూ సింగ్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై చాలామంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ లాంటి మ్యాచ్ ఫినిషర్‌ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను నిందించారు. ఈ క్రమంలో రింకూ సింగ్ తండ్రి ఖన్‌చంద్ర సింగ్ స్పందించాడు.
A heartbreaking video. 💔
Rinku Singh's father talking about the exclusion of Rinku from the main squad. pic.twitter.com/Q2MuBmx2rp— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024
ఓ స్థానిక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రింకూ వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉండింది. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించాం.
మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. రింకూ గుండె పగిలిపోయినంత పనైపోయింది. రింకూ ఈ విషయంలో తన తల్లికి చాలా సర్దిచెప్పాడు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడు. కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక్‌రేట్‌తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
ట్రావెలింగ్ రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment