మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో ఇంగ్లండ్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ తరపున భారత మాజీ క్రికెటర్ కుమారుడు బరిలోకి దిగాడు. సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
అతడే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తనయుడు, లంకాషైర్ క్రికెట్ క్లబ్ యంగ్ బ్యాటర్ హ్యారీ సింగ్. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు లంకాషైర్ క్రికెట్ క్లబ్ నుంచి చార్లీ బర్నార్డ్, కేష్ ఫోన్సెకాలో పాటు టువెల్త్(12th) మ్యాన్‌గా హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు.
ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మూడో ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ హ్యారీ మైదానంలో కనిపించాడు. లంచ్ సెషన్ తర్వాత హ్యారీ సింగ్ మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెట్టాడు. హ్యారీ బ్రూక్‌కు సబ్‌స్ట్యూట్‌గా అతడు ఫీల్డ్‌లోకి వచ్చాడు.
ఎవరీ హ్యారీ సింగ్?
అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ హ్యారీ సింగ్.. 2007 టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో భాగమైన ఆర్పీ సింగ్ తనయుడు కాదు. అతడు 1980లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ సీనియర్ కుమారుడు. ఆర్పీ సింగ్ సీనియర్ భారత జట్టుకు కేవలం రెండే రెండు మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.1986లో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్, హైదరాబాద్‌లో రెండు వన్డేలు ఆడాడు.
కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన సీనియర్ ఆర్పీ సింగ్.. 1413 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కోచ్‌గా అతడు పనిచేశాడు. ఇక పూర్తిగా 1990ల చివరలో ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోచ్‌గా కూడా పనిచేశాడు.
ఇక హ్యారీ సింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జులైలో వన్డే కప్‌లో హ్యారీ సింగ్ లంకాషైర్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. 2022లో అతడు శ్రీలంకతో సిరీస్ కోసం ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. అతడికి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment