ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. నామమాత్రపు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను లంక చిత్తు చేసింది.
దీంతో వైట్‌వాష్ నుంచి లంకేయులు తప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ (39 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.
లంక అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది.
2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో పాక్ ఆల్‌టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: IND vs AUS: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు?
Comments
Please login to add a commentAdd a comment