ముంబై ఇండియన్స్ జట్టు (PC: IPL/BCCI)
ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2022లో పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఈ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం లేనందున, రాబోయే సీజన్‌లలో అత్యత్తుమమైన జట్టును సన్నద్దం చేయాలని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ సూచించాడు. అదే విధంగా రాబోయే మ్యాచ్‌ల్లో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అతడు అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుత సీజన్‌లో ముంబై కథ ముగిసింది. వారు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే. రాబోయే సీజన్ల కోసం ఇప్పటి నుంచే సరైన జట్టును తాయారు చేయాలి. బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. బెంచ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకి రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వాలి. యువ కీపర్-బ్యాటర్ ఆర్యన్ జుయల్ ఓ అవకాశం ఇవ్వాలి.
అతడు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. జయల్ అద్భుమైన ప్రతిభను కలిగి ఉన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి రాబోయే సీజన్ల కోసం ఎవరిని రీటైన్ చేయవచ్చో, ఎవరిని విడుదల చేయవచ్చో అంచనా వేయవచ్చు. ఈ ఏడాది వేలంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని తదుపరి వేలానికి ముంబై సిద్దం కావాలి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ!
Comments
Please login to add a commentAdd a comment