
రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఈ క్రమంలో రూట్‌ను ఉద్దేశించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్‌లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్ ఆడాలని ఆర్పీ సింగ్ సూచించాడు.
కాగా ఈ సిరీస్‌లో రూట్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. జైశ్వాల్‌కు గాయం! ఆట మధ్యలోనే?