- నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
- జలమయమైన రహదారులు
- త హశీల్దార్‌ను నిలదీసిన బాధితులు
రాయచూరు రూరల్ : నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం ఉదయం ఐదు గంటల వరకు కురిసింది. ఈ వర్షానికి రహదారులు, వీధులు, పొలాలు జలమయమయ్యాయి. నగరంలో జనతా కాలనీ, ఆజాద్ నగర్, హాజీ కాలనీలో మురికి కాలువలు బంద్ కావడంతో వర్షం నీరు ఇళ్లలో చేరాయి.
రాయచూరు తాలూకా చిక్కస్గూరు-హేగ్గసనళ్లిలో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. ఆహారధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసాయి. సోమవారం ఉదయం రాయచూరు తహశీల్దార్ బాలరాజు చిక్కస్గూరు-హేగ్గసనళ్ళిని సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆయన్ను నిలదీశారు.
నష్టాన్ని జిల్లాధికారితో చర్చించి సమస్య సరిష్కారిస్తామని హమీ ఇచ్చారు. దీంతో బాధితులు శాంతించారు. కాగా, రాయచూరులో 114 మీల్లీమీటర్లు, మాన్విలో 16, లింగస్గూరులో 14, సింధనూరులో 6, దేవదుర్గలో 29.4, గబ్బూరులో 49.4, మస్కి 32, వలకందిన్ని 32, కల్లూరు 52, కల్మాల 50, యరమరస్ 85, జేగరకల్ 80 మీల్లీమీటర్ల వర్షం కురిసిందని జిల్లాధికారి శశికాంత సింథల్ సోమవారం తెలిపారు.