ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి.
రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది.
పెట్టుబడుల విధానం
ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు.
దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌కే కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్‌మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్‌క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి.
మిడ్‌క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్‌లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment