IFC
-
క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కు రూ. 1,030 కోట్ల నిధులు!
న్యూఢిల్లీ: క్యూబ్ హైవేస్ ట్రస్ట్ (క్యూబ్ ఇన్విట్) తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్ ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి. -
ఆర్థికమంత్రితో ఐఎఫ్‌సీ ఎండీ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్‌లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్‌కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్‌లో ఐఎఫ్‌సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్‌సీ భావిస్తోంది. తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్‌సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్‌ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు. -
అపోలో గ్రూప్‌లో‘ప్రపంచ బ్యాంక్’ పెట్టుబడులు
• రూ.450 కోట్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ • ఇందుకుగాను 28.03 శాతం వాటా దక్కించుకున్న ఐఎఫ్‌సీ • సంస్థ విస్తరణ, నాయకత్వ స్థానానికే ఈ నిధుల వినియోగం • ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ ఎండీ సంగీతా రెడ్డి వెల్లడి • 2016-17లో రూ.7,480 కోట్ల పెట్టుబడులు: ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ హెల్త్ కేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టరుుల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్)లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), ఐఎఫ్‌సీ అసెట్ మేనేజ్మెంట్ నుంచి ఈక్విటీ రూపంలో రూ.450 కోట్ల నిధులను సమీకరించినట్లు ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ మేనేజింగ్ డెరైక్డర్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడులతో ఐహెచ్ఎల్ఎల్లో 28.03 శాతం వాటాను ఐఎఫ్‌సీ దక్కించుకుందని గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. ఈ నిధులను ఐహెచ్ఎల్ఎల్ విస్తరణతో పాటు రిటైల్ హెల్త్‌కేర్ రంగంలో నాయకత్వ స్థానం కైవసానికి వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ విస్తరణతో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి కొత్తగా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని తెలియజేశారు. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అరుున ఏహెచ్‌ఎల్‌ఎల్ దేశంలోని 17 రాష్ట్రాల్లో 400 సెంటర్లలో 7 విభాగాల్లో సేవలందిస్తుంది. అపోలో క్లినిక్స్, షుగర్, డయాగ్నోస్టిక్స్, వైట్, క్రెడిల్, ఫెర్టిలిటీ, స్పెక్ట్రా విభాగాల్లో కలిపి రోజుకు 10 వేల మంది చికిత్స పొందుతున్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను 2 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమని చెప్పారు. తాజా నిధులతో అపోలో క్లినిక్స్, క్రెడిల్, డయాగ్నోస్టిక్ సెంటర్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏహెచ్‌ఎల్‌ఎల్ సీఈఓ నీరజ్ గార్గ్, ఐఎఫ్‌సీ (కన్సూమర్, సోషల్ సర్వీసెస్) ఆసియా సీనియర్ మేనేజర్ హెన్రిక్ ఎస్చనీర్ పెడెర్సన్ పాల్గొన్నారు. 32 బిలియన్లకు చేరిన ఐఎఫ్‌సీ పెట్టుబడులు.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మన దేశంలో 2005 నుంచి హెల్త్ కేర్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ, డెబిట్ రూపంలో పెట్టుబడులు పెడుతుంది. ప్రైవేట్ హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ ఈ ఐఎఫ్‌సీ.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.11,700 కోట్ల (117 బిలియన్‌స) పెట్టుబడులు పెట్టింది. ఇందులో మన దేశం 28 శాతం వాటాతో రూ.3,200 కోట్ల (32 బిలియన్‌స) మేర పెట్టుబడులు పెట్టినట్లు ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.7,480 కోట్ల (1.1 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యించామని.. అరుుతే ఇప్పటివరకు రూ.3,243 కోట్లు (477 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఐఎఫ్‌సీ గతంలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నెప్రో ప్లస్, ఐ-క్యూ విజన్, పోర్షియా వంటి హెల్త్‌కేర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. -
ఐడీబీఐ బ్యాంక్ వాటా రేసులో విదేశీ దిగ్గజాలు!
♦ ఏడీబీ, ఐఎఫ్‌సీ ఆసక్తి ♦ 26% వాటా సేల్కు త్వరలో క్విప్ ఇష్యూ ♦ రూ.3,771 కోట్లు సమీకరించే చాన్స్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. బ్యాంకులో 26 శాతం మేర వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.3,771 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం పలు విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) రూపంలో వాటా విక్రయించనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) వంటి దిగ్గజాలు క్విప్ ఇష్యూ ద్వారా వాటా కొనుగోలుపై సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) ద్వితీయార్థంలో ఇష్యూ ఉండొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. డిసెంబర్లోనే ఆమోదం... ఐడీబీఐ బ్యాంక్‌లో క్విప్ రూట్ ద్వారా రూ.3,771 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం కేంద్రానికి బ్యాంక్‌లో 73.96 శాతం వాటా ఉంది. అయితే, క్విప్ పూర్తయితే ఇందులో 26 శాతం మేర వాటా తగ్గిపోయే అవకాశం ఉంది. -
జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు
ముంబై: జపాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.30 కోట్లు సమీకరించే దిశగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) తొలిసారిగా యురిదాషి మసాలా బాండ్లను (జపాన్ బాండ్లు) ప్రవేశ పెట్టింది. ఈ నిధులను భారత్‌లో ప్రైవేట్ రంగ వృద్ధికి వినియోగించనున్నట్లు ఐఎఫ్‌సీ తెలిపింది. మసాలా బాండ్ల ద్వారా సంస్థ ఇప్పటిదాకా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 1.7 బిలియన్ డాలర్లు సమీకరించింది. మసాలా బాండ్లంటే రూపీ డినామినేషన్లో విడుదల చేసేవి. సెటిల్మెంట్ మాత్రం ఏ దేశంలో జారీ చేస్తే ఆ కరెన్సీలో ఉంటుంది. తాజా జపాన్ (యురిదాషి) బాండ్ల కనీస విలువ రూ.లక్ష. జపాన్‌లోని సాధారణ పౌరుల నుంచి ఈ నిధులు సమీకరిస్తారు. 5.36 శాతం వడ్డీ ఉండే ఈ బాండ్లను ఈ ఏడాది మార్చి 30న జారీ చేస్తారు. మెచ్యూరిటీ తేదీ 2019 మార్చి 29. -
ఆర్బీఐ చీఫ్ అధికారాలకు కత్తెర!?
♦ ఐఎఫ్‌సీ తాజా ముసాయిదా విడుదల ♦ అమలైతే..కమిటీ మెజారిటీ నిర్ణయం ప్రకారమే పాలసీ రేటు న్యూఢిల్లీ : ఫైనాన్షియల్ రంగంలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా కేంద్రం గురువారం మరో ముందడుగు వేసింది. సవరించిన తాజాఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ (ఐఎఫ్‌సీ) ముసాయిదాను విడుదల చేసింది. దేశంలో బ్యాంకింగ్ వడ్డీరేట్ల స్థాయికి సంకేతమైన పాలసీ రేట్ల నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఏకపక్షంగాతీసుకునే అధికారానికి కత్తెరవేయడం ఈ ముసాయిదాలో ముఖ్యాంశం. మెజారిటీ ఓటు ప్రాతిపదికన ఆర్బీఐ ‘చైర్పర్సన్’ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ ఈ కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ ముసాయిదాపై ఆగస్టు 8వ తేదీ లోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలపాలని ఆర్థికమంత్రి మంత్రిత్వశాఖ ముసాయిదాలో కోరింది. ముఖ్యాంశాలు.. {పతి మూడేళ్లకు ఒకసారి ఆర్బీఐతో సంప్రదింపులు జరిపి, వార్షిక వినియోగ ద్రవ్యోల్బణం (సీపీఐ) లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆర్బీఐ తన వంతు తగిన ప్రయత్నాలు చేయాలి. ముసాయిదా ‘ఆర్బీఐ చైర్పర్సన్’ అనే పదాన్ని వాడింది తప్ప... ‘గవర్నర్’ అనే పదాన్ని వాడకపోవడం గమనార్హం. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) నిర్ణయంపై సలహాలను ఇవ్వడానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది. కానీ ఆ కమిటీ మెజారిటీ సూచనను కూడా ఆర్బీఐ చీఫ్ తోసిపుచ్చి, సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. ► ఆర్బీఐ చైర్పర్సన్ నేతృత్వంలోని కమిటీలో ఆర్బీఐ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఒకరు ఉంటారు. ఆర్బీఐ ఉన్నత ఉద్యోగి ఒకరు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యులు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. మెజారిటీ నిర్ణయం ప్రకారం పాలసీ రేటు నిర్ణయం జరుగుతుంది. మెజారిటీ అభిప్రాయాన్ని ఆర్బీఐ చీఫ్ వీటో చేసే హక్కు వుండదు. ► ఐఎఫ్‌సీ ముసాయిదా కోడ్‌ను ఆర్థిక మంత్రిత్వశాఖ సైట్‌పై అందుబాటులో ఉంచారు. ఐఎఫ్‌సీ నేపథ్యం: 2011లో జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటయిన ఫైనాన్షియల్ సెక్టార్ లెజిల్లేటివ్ రిఫార్మ్ కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్‌ను 2013లో సిఫారసు చేసింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు ఈ సిఫారసుల్లో ప్రధానాంశాలు. ఈ ముసాయిదా తుది నిర్ణయం కోసం సవరిస్తున్నారు. తుది సవరణ ముసాయిదా గత ఏడాది వెలువడింది. ఈ క్రమంలో వచ్చిందే- తాజా సవరణ ముసాయిదా. ఫైనాన్షియల్ ఏజెన్సీల రెగ్యులేటరీ పరమైన బాధ్యతలు, కేపిటల్ నియంత్రణలు, పేమెంట్ల వ్యవస్థలో క్రమానుగుణ నియంత్రణలు తత్సబంధ అంశాలపై సైతం అభిప్రాయాలను తాజా ముసాయిదా కోరుతోంది. -
ఎఫ్ఏటీసీఏ కేసుల కోసం ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: అమెరికాతో కుదుర్చుకున్న విదేశీ ఖాతాల పన్ను వర్తింపు చట్టం(ఎఫ్ఏటీసీఏ) ఒప్పందం ప్రకారం కీలకమైన పన్నుల సమాచారానికి రక్షణ కల్పించడానికి, నల్లధనానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ).. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ(ఐఎస్సీ) పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 9న ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు కొద్దిరోజుల ముందే సీబీడీటీ.. ఈ ప్యానెల్లో సభ్యుల సంఖ్యను ఎనిమిది మందికి పెంచింది. ఈ కమిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగి సీబీడీటీలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తారు. ఐఎస్సీలోని ముగ్గురు జాయింట్ సెక్రెటరీ ర్యాంకు అధికారులు విదేశీ పన్నుల సమాచార వ్యవహారాలు చూస్తారు. -
భారత్‌లో వ్యాపారం ప్రారంభానికి ఢిల్లీ ఉత్తమం
వాషింగ్టన్: దేశీయంగా వ్యాపారాలను ప్రారంభించే ప్రక్రియ సులభతరంగా ఉండే విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూసివేత ప్రక్రియ సులభతరంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందు స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం న్యూఢిల్లీలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 32 రోజులు పడుతుండగా.. బెంగళూరులో 40 రోజులు పడుతోంది. న్యూఢిల్లీలో కంపెనీని రిజిస్టర్ చేసేందుకు 11 దశలు (ప్రభుత్వ విభాగాలను సంప్రదించడం మొదలైనవి), బెంగళూరులో 13 దశలు ఉంటున్నాయి. మొత్తం మీద భారత్‌లో వ్యాపారం చేయడానికి వెసులుబాటు ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ, పాట్నా, జైపూర్‌ల తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఇక బిజినెస్ మూసివేతకు సంబంధించి సగటున ఏడేళ్ల వ్యవధితో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. అదే కోల్‌కతాలో మాత్రం ఇందుకు సగటున 10.8 ఏళ్లు పడుతుంది. వ్యాపారం మూసివేత సులభతరంగా ఉన్న ఇతర నగరాల్లో హైదరాబాద్ తర్వాత లూధియానా, ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్ ఉన్నాయి.