జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు | ifc spicy brands in japan | Sakshi
Sakshi News home page

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

Published Wed, Mar 2 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

ముంబై: జపాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.30 కోట్లు సమీకరించే దిశగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) తొలిసారిగా యురిదాషి మసాలా బాండ్లను (జపాన్ బాండ్లు) ప్రవేశ పెట్టింది. ఈ నిధులను భారత్‌లో ప్రైవేట్ రంగ వృద్ధికి వినియోగించనున్నట్లు ఐఎఫ్‌సీ తెలిపింది. మసాలా బాండ్ల ద్వారా సంస్థ ఇప్పటిదాకా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 1.7 బిలియన్ డాలర్లు సమీకరించింది. మసాలా బాండ్లంటే రూపీ డినామినేషన్లో విడుదల చేసేవి. సెటిల్‌మెంట్ మాత్రం ఏ దేశంలో జారీ చేస్తే ఆ కరెన్సీలో ఉంటుంది. తాజా జపాన్ (యురిదాషి) బాండ్ల కనీస విలువ రూ.లక్ష. జపాన్‌లోని సాధారణ పౌరుల నుంచి ఈ నిధులు సమీకరిస్తారు. 5.36 శాతం వడ్డీ ఉండే ఈ బాండ్లను ఈ ఏడాది మార్చి 30న జారీ చేస్తారు. మెచ్యూరిటీ తేదీ 2019 మార్చి 29.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement