అపోలో గ్రూప్లో‘ప్రపంచ బ్యాంక్’ పెట్టుబడులు | IFC invests $67 million in Apollo Health and Lifestyle Ltd | Sakshi
Sakshi News home page

అపోలో గ్రూప్లో‘ప్రపంచ బ్యాంక్’ పెట్టుబడులు

Published Fri, Dec 2 2016 1:19 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న సంగీతా రెడ్డి, క్రిస్ మెక్హాన్. చిత్రంలో నీరజ్ గార్గ్ - Sakshi

ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న సంగీతా రెడ్డి, క్రిస్ మెక్హాన్. చిత్రంలో నీరజ్ గార్గ్

రూ.450 కోట్ల ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్
ఇందుకుగాను 28.03 శాతం వాటా దక్కించుకున్న ఐఎఫ్‌సీ
సంస్థ విస్తరణ, నాయకత్వ స్థానానికే ఈ నిధుల వినియోగం
ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ ఎండీ సంగీతా రెడ్డి వెల్లడి
2016-17లో రూ.7,480 కోట్ల పెట్టుబడులు: ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ హెల్త్ కేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టరుుల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్)లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. ఇంటర్నేషనల్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), ఐఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ నుంచి ఈక్విటీ రూపంలో రూ.450 కోట్ల నిధులను సమీకరించినట్లు ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ మేనేజింగ్ డెరైక్డర్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడులతో ఐహెచ్‌ఎల్‌ఎల్‌లో 28.03 శాతం వాటాను ఐఎఫ్‌సీ దక్కించుకుందని గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. ఈ నిధులను ఐహెచ్‌ఎల్‌ఎల్ విస్తరణతో పాటు రిటైల్ హెల్త్‌కేర్ రంగంలో నాయకత్వ స్థానం కైవసానికి వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ విస్తరణతో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి కొత్తగా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని తెలియజేశారు.

 అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అరుున ఏహెచ్‌ఎల్‌ఎల్ దేశంలోని 17 రాష్ట్రాల్లో 400 సెంటర్లలో 7 విభాగాల్లో సేవలందిస్తుంది. అపోలో క్లినిక్స్, షుగర్, డయాగ్నోస్టిక్స్, వైట్, క్రెడిల్, ఫెర్టిలిటీ, స్పెక్ట్రా విభాగాల్లో కలిపి రోజుకు 10 వేల మంది చికిత్స పొందుతున్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను 2 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమని చెప్పారు. తాజా నిధులతో అపోలో క్లినిక్స్, క్రెడిల్, డయాగ్నోస్టిక్ సెంటర్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏహెచ్‌ఎల్‌ఎల్ సీఈఓ నీరజ్ గార్గ్, ఐఎఫ్‌సీ (కన్సూమర్, సోషల్ సర్వీసెస్) ఆసియా సీనియర్ మేనేజర్ హెన్రిక్ ఎస్చనీర్ పెడెర్సన్ పాల్గొన్నారు.

 32 బిలియన్లకు చేరిన ఐఎఫ్‌సీ పెట్టుబడులు..
ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మన దేశంలో 2005 నుంచి హెల్త్ కేర్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ, డెబిట్ రూపంలో పెట్టుబడులు పెడుతుంది. ప్రైవేట్ హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ ఈ ఐఎఫ్‌సీ.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.11,700 కోట్ల (117 బిలియన్‌‌స) పెట్టుబడులు పెట్టింది. ఇందులో మన దేశం 28 శాతం వాటాతో రూ.3,200 కోట్ల (32 బిలియన్‌‌స) మేర పెట్టుబడులు పెట్టినట్లు ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.7,480 కోట్ల (1.1 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యించామని.. అరుుతే ఇప్పటివరకు రూ.3,243 కోట్లు (477 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఐఎఫ్‌సీ గతంలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నెప్రో ప్లస్, ఐ-క్యూ విజన్, పోర్షియా వంటి హెల్త్‌కేర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement