న్యూఢిల్లీ: అమెరికాతో కుదుర్చుకున్న విదేశీ ఖాతాల పన్ను వర్తింపు చట్టం(ఎఫ్‌ఏటీసీఏ) ఒప్పందం ప్రకారం కీలకమైన పన్నుల సమాచారానికి రక్షణ కల్పించడానికి, నల్లధనానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ).. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ(ఐఎస్‌సీ) పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది.
జూలై 9న ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు కొద్దిరోజుల ముందే సీబీడీటీ.. ఈ ప్యానెల్‌లో సభ్యుల సంఖ్యను ఎనిమిది మందికి పెంచింది. ఈ కమిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగి సీబీడీటీలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తారు. ఐఎస్‌సీలోని ముగ్గురు జాయింట్ సెక్రెటరీ ర్యాంకు అధికారులు విదేశీ పన్నుల సమాచార వ్యవహారాలు చూస్తారు.
ఎఫ్‌ఏటీసీఏ కేసుల కోసం ప్రత్యేక కమిటీ
Published Mon, Jul 13 2015 9:03 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM
Advertisement