9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం | jakkampudi varadhi trust | Sakshi
Sakshi News home page

9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం

Published Mon, Oct 3 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం

9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం

దానవాయిపేట(రాజమహేంద్రవరం) : 
సామాన్యుడి సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావు వర్ధంతి సందర్భంగా ‘జక్కంపూడి  ప్రజా వారధి’  స్వచ్ఛంద సేవా సంస్థను వీఎల్‌ పురంలో  ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర ట్రేడ్‌ యూనియన్‌ కన్వీనర్‌  నరవ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అండగా వారి పక్షాన జక్కంపూడి ప్రజా వారధి పోరాటం సాగిస్తుందన్నారు. ఇందులో భాగంగానే  వృద్ధుల కోసం ఒక వాహనాన్ని  ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అనంతరం జక్కంపూడి ప్రజా వారధి వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. లంక సత్యనారాయణ, కొమ్ముల సాయి, ధర్మవరపు శ్రీనివాస్, ఎస్‌. కృష్ణమూర్తి, మురపాక వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement