gopalakrishna
-
దళిత రైతులపై దౌర్జన్యం
చంద్రగిరి: తరతరాలుగా కుటుంబమంతా కలిసి ఆరుతడి పంటలను పండించుకుంటూ జీవనం గడుపుతున్న దళిత రైతులపై పెత్తందారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని కాజేయాలని యత్నించారు. అడ్డుకున్న దళి త రైతులపై బెదిరింపులకు పాల్పడిన ఘ టన శనివారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని నరసింగాపురంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నరసింగాపురం హరిజనవాడకు చెందిన కృష్ణయ్య కుమారులు శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణ సర్వే నంబరు 321లోని సుమారు 20 సెంట్ల భూమిలో ఉమ్మడిగా సాగుచేసుకుంటున్నారు.ఈ క్రమంలో తమ భూమికి ఆనుకుని ఉన్న బుచ్చినాయుడుపల్సికి చెందిన చిట్టిబాబునాయుడు, మనోహర్‌నాయుడు అక్రమంగా ప్రవేశించి, జేసీబీ లతో హద్దులు తొలగించారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కొంతమంది రౌడీలను తీసుకొచ్చి, తమపై దౌర్జన్యం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని లబోదిబోమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటే, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆ వేదన వ్యక్తం చేశారు. పెసర, మినుము, జొన్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 30 అడుగుల మేర జేసీ బీతో పంటను ధ్వంసం చేసినట్లు తెలి పారు. కాగా, అక్రమంగా జేసీబీతో హద్దులను తొలగిస్తుండడంతో శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణలు జేసీబీకు అడ్డుగా పడుకుని నిరసనకు దిగారు. తాతముత్తాతల కాలం నుంచి ఉన్న భూమిని ఆక్రమించుకుని తమను వేధిస్తున్నారంటూ వారు తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడమే మార్గమంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు ఈనెల 15 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు. రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. హైబ్రిడ్ (భౌతిక, ఆన్లైన్) విధానంలో కేసులను విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు మే 16 నుంచి 26 వరకు పనిచేస్తాయి. రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్ 12 వరకు పనిచేస్తాయి. ఈ వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచిచూడలేనటువంటి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, సర్వీసు సంబంధిత కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించిన కేసులను అత్యవసరం అయితే తప్ప విచారించబోమని పేర్కొంది. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 482, అధికరణ 226 కింద ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలంటూ దాఖలుచేసే వ్యాజ్యాలను ఈ వేసవి సెలవుల్లో విచారించబోమని తెలిపింది. వెకేషన్ కోర్టుల్లో జడ్జిలు వీరే.. ఇక మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉంటారు. ఇందులో జస్టిస్ భానుమతి, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో.. జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. మొదటి వెకేషన్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే వారు మే 16వ తేదీన దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు మే 18న విచారణ జరుపుతారు. అలాగే, మే 30న వ్యాజ్యాలు దాఖలు చేస్తే జూన్ 1న విచారణ ఉంటుంది. జూన్ 6న పిటిషన్లు దాఖలు చేస్తే వాటిపై న్యాయమూర్తులు జూన్ 8న విచారణ జరుపుతారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ దుప్పల వెంకటరమణ, జస్టిస్ వి.గోపాలకృష్ణరావు ఉంటారు. ఇందులో జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ గోపాలకృష్ణరావు ధర్మాసనంలో.. జస్టిస్ దుప్పల వెంకటరమణ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. జూన్ 8న విచారణ జరిపే ధర్మాసనానికి న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీచేశారు. -
హైకోర్టు జడ్జిలుగా మరో ఇద్దరు
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపాలకృష్ణారావుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ ఇద్దరి పేర్లను కేంద్రానికి పంపింది. వీరికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ఆ ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు తరువాత వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఆ తరువాత వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఈ ఇద్దరు న్యాయాధికారుల్లో వెంకట జ్యోతిర్మయి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే)గా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణ గుంటూరు మొదటి అదనపు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి పేర్లను హైకోర్టు కొలీజియం నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టుకు పంపింది. వీరిద్దరి నియామకంతో ప్రస్తుతానికి న్యాయాధికారుల కోటా పూర్తవుతుంది. ఇదే సమయంలో వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. అలాగే, హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా.. మరో ఐదు ఖాళీలుంటాయి. ఇవి న్యాయవాదుల కోటాకు సంబంధించినది. వీటిని సైతం భర్తీచేసేందుకు హైకోర్టు కొలీజియం త్వరలో న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు ప్రతిపాదించనుంది. మరోవైపు.. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. పి. వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా, తెనాలిలో బాలాత్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువులో టాపర్. మూడు బంగారు పతకాలు సాధించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 2022 ఏప్రిల్ 18 నుంచి ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామంలో కోటేశ్వరమ్మ, సోమయ్య దంపతులకు జన్మించారు. తండ్రి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేశారు. పదవ తరగతి మచిలీపట్నం జైహింద్ పాఠశాలలో చదివారు. ఇంటర్ ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కాలేజీలో పూర్తిచేశారు. డిగ్రీ, పీజీ మచిలీపట్నంలో చదివారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబంలో న్యాయాధికారి అయిన మొదటి వ్యక్తి ఈయనే. కుమారుడు వి.రఘునాథ్ ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రస్తుతం కర్నూలు జిల్లా, ఆత్మకూరు కోర్టులో పనిచేస్తున్నారు. -
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు!
‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్‌తో ‘కృష్ణమ్మ’ టీజర్ విడుదల అయింది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ తేజ్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. -
ఓట్లు తొలగిస్తే వేటు తప్పదు
సాక్షి, అమరావతి: ఓటర్ జాబితా నుండి అకారణంగా ఓటర్ల పేర్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా తయారీలో తప్పులు చేసిన పలువురు సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఒక జిల్లా కలెక్టర్, ఒక డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు కావాలని తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేస్తామని అన్నారు. తమ అనుమతి లేకుండా కలెక్టర్లు కూడా ఓట్లు తొలగించలేరని ద్వివేది చెప్పారు. ఓటర్ల జాబితాలో 0.1 శాతం కంటే ఎక్కువ తేడాలు ఉంటే కలెక్టర్లు ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఓటర్ల నమోదు ప్రక్రియ అభ్యర్థి నామినేషన్ వేసే ముందు రోజు వరకూ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఈ నెల 23, 24వ తేదీల్లో ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్లు పరిశీలించుకునేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా తేదీల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అన్ని ఫారాలతో అందుబాటులో ఉంటారు. ఓటు ఉందా? లేదా? అనేది పరిశీలించుకోవచ్చు. కొత్తగా ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను ప్రత్యేక క్యాంపుల వద్ద నియమించుకోవాలి. కొత్తగా ఓటర్ నమోదు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 10వ తేదీ నాటికి ఇంటింటికీ వెళ్లి ఓటర్ గుర్తింపు కార్డులు అందజేస్తాం. నోటీసు ఇవ్వకుండా ఓట్లు తొలగించొద్దు రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల ఓట్లు ఉన్నాయి. వీటిలో 1.55 లక్షల ఓట్లు రెండుసార్లు నమోదైనట్లు గుర్తించాం. మరో 13,000 ఓట్లలో పలు తప్పులు దొర్లాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలో ఓటు ఉన్న వారి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో సర్వేలపై ఎలాంటి నిషేధం లేదు. సర్వేల పేరిట ఓట్లు తొలగించడం అసాధ్యమే. ఓటర్ల తుది జాబితా తయారయ్యాక ఓట్లు తొలగించడానికి అవకాశం లేదు. నోటీసు ఇవ్వకుండా ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి మూడు బృందాలను రాష్ట్రానికి పంపింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ బృందాలు పర్యటించి, ఓటర్ల జాబితాలపై పరిశీలన చేస్తాయి. 13 జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) సిద్ధం చేస్తున్న ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరించి, ప్రత్యక్షంగా చూసేలా సచివాలయం ఐదో బ్లాకులో ఏర్పాట్లు చేశాం’’ అని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఓటర్ల నమోదుకు సహకరించండి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపుల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను నియమించి, ఓటర్ల నమోదుకు సహకరించాలని గోపాలకృష్ణ ద్వివేది కోరారు. ఆయన గురువారం వెలగపూడిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన సందేహలను నివృత్తి చేసి, పరిష్కరించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసే అభ్యంతరాలను కూలంకుషంగా పరిశీలిస్తామన్నారు. టీచర్/గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం నమోదుకు అర్హత గల ఓటర్లుకు నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు వరకూ అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటరు నమోదుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు చెందిన ఓటరు నమోదు దరఖాస్తులను తీసుకొస్తే బూత్ లెవెల్ అధికారి ఎలాంటి అభ్యంతరం తెలపకుండా స్వీకరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓలు సుజాత శర్మ, వివేక్ యాదవ్, జాయింట్ సీఈఓ మార్కండేయులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాసరావు, సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎమ్.రాజేంద్ర, వై.వెంకటేశ్వరరావు, జెల్లీ విల్సన్, జె.రంగబాబు, వి.సత్యమూర్తి పాల్గొన్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో 9,872 ఓట్లు తొలగించారని శాసన మండలిలో ప్రతినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ గురజాల ఇన్చార్జి కాసు మహేష్‌రెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపించారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గురజాల నియోజకవర్గంలో కొందరు సీఐలు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పినట్లు తల ఊపుతూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఓటర్ల అనుమతి లేకుండానే ఫారం–7ను ఆన్లైన్లో ఇస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామన్నారు. -
ఓటేయాలంటే ఓటర్ కార్డు ఉంటే సరిపోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బోగస్ ఓటర్ల జాబితాపై 15 రోజుల్లో తనిఖీ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు గల యువత 18 లక్షల మంది ఉన్నారని, వారిలో కేవలం 5.39 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ద్వివేదీ శుక్రవారం సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు, బీజేపీ తరపున గరిమెళ్ల చిట్టిబాబు, సీపీఐ తరపున మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీసీఎం తరపున వై. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం ద్వివేదీ విలేకరులతో మాట్లాడారు. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదని, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని చెప్పారు. పేరు లేకపోతే వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే దివ్యాంగులు 6.19 లక్షల మంది ఉన్నారని, అయితే ఓటర్లగా 3.29 లక్షల మంది మాత్రమే నమోదయ్యారని గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. కొంతమంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నా దివ్యాంగులని తెలియపరచని వారు ఉంటారని అన్నారు. దివ్యాంగులుగా నమోదు చేయించుకునే వారికి వాహన సౌకర్యం, పోలింగ్ బూత్ వద్ద వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని, పోలింగ్ బూత్‌ల వద్ద వారు బారులు తీరే అవసరం లేకుండా నేరుగా ఓటు వేసే సదుపాయం కల్పిస్తామని వివరించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులందరి సెల్‌ఫోన్ నెంబర్లతో ఒక యాప్‌ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు ఈసారి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 45,920 పోలింగ్ కేంద్రాల వద్ద టాయిలెట్స్, కుర్చీలు, వీల్ చైర్స్, మంచినీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుతామని, ఓటర్లు బారులు తీరకుండా ఓటు వేసే విధంగా టోకెన్ విధానం ప్రవేశపెడతామని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్‌లో టోకెన్ విధానం ప్రవేశపెట్టారని, అక్కడ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తుచేశారు. ఈ విధానం వల్ల ఓటర్‌కు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై పరిశీలన జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పాలుపంచుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 11న విడుదల చేశామని, ఆ జాబితాలో ఓటర్లను తొలగించడం గానీ, జత చేయడం గానీ ఇప్పటివరకు చేయలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 9 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఇచ్చిన ఫామ్–6 దరఖాస్తులు 7.36 లక్షల వరకు ఉన్నట్లు వివరించారు. బూత్‌స్థాయి అధికారులు వాటిని పరిశీస్తున్నారని, పది రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ పరిశీలనలో రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా పాల్గొనాలని కోరారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో పర్యటించనుందని, ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందన్నారు: అంబటి వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా భారీ క్యూలైన్లు లేకుండా టోకెన్ విధానం కొనసాగింపుపై ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ చర్చించారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ద్వివేదీతో సమావేశం అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిన బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందని, 15 రోజుల్లో విచారణ పూర్తవుతుందని ద్వివేదీ పేర్కొన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల నిర్వహణ, ఓట్ల నమోదుపై పార్టీ పరంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. -
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియాను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేయాలని నిర్ణయించడానికి ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, బోగస్ ఓటర్లను తొలగించడంలో అలసత్వం తదితరాలే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు లక్షల సంఖ్యలో బోగస్ ఓటర్లను చేర్పించడం, ప్రతిపక్షానికి మద్దతుదారులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసోడియాను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నియమించడానికి ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా పంపాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపింది. వచ్చే ఎన్నికలను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లును ప్రారంభించిన ఈసీ రాష్ట్ర శాసన సభతోపాటు లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా సొంత జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడి నుంచి బదిలీ చేయాలని, అలాగే నాలుగేళ్లలో మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బదిలీల మార్గదర్శకాలను గురువారం పంపించింది. ఈ బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని, సంబంధిత నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని పేర్కొంది. సొంత జిల్లాలో లేదా సొంత నియోజవర్గాల్లో పనిచేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్) రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఐజీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ నాలుగేళ్లలో మూడేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తుంటే, వారిని కూడా అక్కడ నుంచి బదిలీ చేయాలని వెల్లడించింది. గతంలో ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఈసారి ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు నమోదైన అధికారులను ఎన్నికల విధులకు వినియోగించరాదని తెలిపింది. ఓటర్ల జాబితా సవరణల్లో పాల్గొంటున్న అధికారులను కూడా జాబితాను ప్రకటించిన వెంటనే బదిలీ చేయాలని పేర్కొంది. ఆరు నెలల్లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ సర్వీసులోకి తీసుకుంటే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పింది. మార్గదర్శకాల మేరకు బదిలీలు చేసినట్లుగా ఎన్నికల అధికారులందరూ జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ప్రధాన అధికారికి డిక్లరేషన్ సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం సాయంత్రమే ద్వివేదీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కేడర్‌కు చెందిన ద్వివేదీ కేంద్ర ప్రభుత్వంలో గత ఏడాది వరకూ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే సాధారణ పరిపాలన(సర్వీసెస్) శాఖ ముఖ్య కార్యదర్శిగానూ(ఇన్చార్జి) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ద్వివేదీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ అందరి సహకారంతో నిష్పక్షపాతంగా, సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతోపాటు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఉంటే సరిచేస్తామన్నారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఓటు విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్ ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై, తీసుకోవాల్సిన చర్యలపై గోపాలకృష్ణ ద్వివేదీ అఖిలపక్ష నాయకులతో చర్చించనున్నారు. -
వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా వంకదారి గోపాలకృష్ణను నియమించినట్లు ఆ విభాగం తెలంగాణ అధ్యక్షుడు సందమల్ల నరేశ్ ఆదివారం తెలిపారు. పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో ఈ నియామకం జరిగినట్లు ఆయన వివరించారు. -
కసి ఉంటే కష్టమేం కాదు
- ఇంగ్లిషు నేర్చుకోండి...మోజును తగ్గించుకోండి - తెలుగుకే పరిమితమైతే అవకాశాలు రావనేది అపోహ - సివిల్స్ రాసే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే ఆకాంక్ష - అందుకే విద్యార్థులను కలుసుకుంటున్నా... - తెలుగు అకాడమీ అనువాదాలు విసృ్తతంగా చేపట్టాలి – ‘సాక్షి’తో... సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం: సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జీవితంలో మరచిపోలేని రోజని రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్స్ రాస్తున్న విద్యార్థులను కలిసి సలహాలు, సూచనలిస్తూ వారిలో స్ఫూర్తిని రగిలించి ఏపీ నుంచి మరింతమంది సివిల్ ర్యాంకులను చూడాలన్నదే నా ఆకాంక్షని అన్నారు. అందుకే తనకున్న ఖాళీ సమయంలో ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... . సాక్షి: సివిల్స్ రాయాలంటే ఆర్థికబలం ఉండాలా? గోపాలకృష్ణ: ఆర్థికంగా కొంతైనా నిలదొక్కుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేయడం వల్ల శిక్షణకు, ఇతరత్రా మెటీరియల్, పుస్తుకాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. సాక్షి: కోచింగ్ సెంటర్లు మీ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిపై మీ స్పందన? గోపాల కృష్ణ: నేనైతే ప్రత్యేకంగా ఏ శిక్షణా సంస్థలో కోచింగ్ తీసుకోలేదు. అయితే అన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహించే మాక్ టర్వ్యూకు, మ్యూనికేషన్స్కు మాత్రమే హాజరయ్యాను. ఇక వారు నా ఫొటోను వాడుకుంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను. సాక్షి: సివిల్స్ తెలుగు మాధ్యంలో రాస్తే లక్ష్యాన్ని సాధించవచ్చా? గోపాలకృష్ణ: అందుకు నేనే ఉదాహరణ. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకు రాగలిగాను. మూడో ర్యాంకు ఎలా సాధింగలిగాను. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. సాక్షి: తెలుగు మాధ్యంలో మెటీరియల్ లభ్యం కావడం కష్టమంటారే? గోపాలకృష్ణ: నిజమే. ఇంగ్లిషు మెటీరియల్‌ను సంపాదించి తెలుగులో తర్జుమా చేసుకుని అధ్యయనం చేశాను. సాక్షి: మీరిచ్చే సూచనలేమిటి...? గోపాలకృష్ణ: మనకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఉంది. వీరు చేయాల్సింది ఎంతో ఉంది. సివిల్ సర్వీసుకు సంబంధించిన ఎథిక్స్, ఎకనామిక్స్, ఆప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పుస్తకాలు ఇంగ్లిషులో ఉన్నాయి. వీటిని తెలుగులో అనువదించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. సాక్షి: సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సూచనలు? గోపాలకృష్ణ: సిలబస్ పట్ల కసితో కూడిన లక్ష్య నిర్దేశం ఉండాలి. పాత సివిల్ పరీక్షా పేపర్లను చదువుతూ ఉండాలి. వర్తమాన అంశాలపై బాగా అవగాహన ఉండాలి. సాక్షి: ప్రజలకు ఏవిధమైన సేవలందిస్తారు? గోపాలకృష్ణ: పేదప్రజలకు, అణగారిన వర్గాలకు సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆకాంక్ష. సాక్షి: మీ స్వగ్రామంలో మీ కుటుంబాన్ని వెలి వేశారు, భూమిని కబ్జా చేశారన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపాలకృష్ణ: సివిల్స్ సాధించగానే గ్రామంలో సమస్యలన్నీ సమసిపోయాయి. అందరూ బాగానే ఉంటున్నాం. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. -
చీత్కారాలే నాలో కసిని పెంచాయి
-
చీత్కారాలే కసిని పెంచాయి
► నన్నెందుకూ పనికి రావన్నారు ► కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ కూడా ఇవ్వలేదు ► పట్టుదలతో చదివాను... మూడో ర్యాంకు సాధించాను ► ‘సాక్షి’మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందన్న గోపాలకృష్ణ హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్బీఐలో మేనేజర్. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఎంపీసీ)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2012లో గ్రూప్–1లో ఇంటర్వూ్య వరకు వెళ్లినా సుప్రీంకోర్టు తీర్పుతో ఇంటర్వూ్యలు రద్దయ్యాయి. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు 2006 నుండి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చివరికి నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నాడు. 1వ తరగతి నుండి సివిల్స్ వరకు మాతృభాష తెలుగులో చదివి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించడం ఇదొక చరిత్ర అని సివిల్స్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరుకు గది.. గది నిండా పుస్తకాలు.. అశోక్‌నగర్ చౌరస్తాలోని ఓ మారుమూల గల్లీ. రూ.3,500 కిరాయితో సింగిల్ రూం. ఆరు నెలలుగా ఇదే గోపాలకృష్ణ చిరునామా. ఓ వాలు కుర్చీ, 4 ప్యాంట్లు, చొక్కాలు, ఓ ఎలక్ట్రి కల్ కుక్కర్ ఇవే అందులోని వస్తువులు. గది లో ఎక్కడ చూసినా పుస్తకాలే కనిపిస్తాయి. ఎప్పుడైనా అనాసక్తిగా అనిపిస్తే దేశభక్తి గేయాలు వినడం ఇదే గోపాలకృష్ణ దినచర్య. ‘సాక్షి’మెటీరియల్ ఉపయోగపడింది ‘సాక్షి’పత్రికను ప్రతిరోజూ చదవుతానని, ఎడిటోరియల్స్, ప్రత్యేక కథనాలను క్రమం తప్పకుండా చదవడంతో పాటు వాటిని కట్ చేసుకుని తర్వాత కూడా చదివేవాడినని గోపా లకృష్ణ చెప్పారు. ‘సాక్షి’భవిత కూడా తనకెం తో ఉపయోగపడిందన్నారు. ‘సాక్షి’దిన పత్రిక లో బాలలత పేరుతో ఎన్నో ఎడ్యుకేషన్ వ్యాసాలు రాశానన్నారు. ఎన్నో అవమానాలు.. చీత్కారాలు.. సివిల్స్‌లో తర్ఫీదు పొందడానికి హైదరాబాద్ వచ్చిన తనకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమవుతూ ‘సాక్షి’కి వివరించారు గోపాలకృష్ణ. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్ ఇవ్వడానికే నిరాకరించారని, అయినా దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదివానన్నారు. చిన్నప్పుడు తాను పడ్డ బాధలు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ప్రతీకారంతో ఈ విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు. తమ ఊరికి కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్ పేపర్ అంటే ఏమిటో తెలియదని చెప్పారు. తనకు ఎటువంటి అలవాట్లూ లేవని, ఆకలి, ఇతర అవసరాలు లేకపోతే చదువే తన లోకమని, అందులోనే ఆనందం పొందుతానని అన్నారు. సివిల్స్‌లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పదేళ్ల కృషి ఫలితం.. ప్రభుత్వాధికారి కావాలని, ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తప్పించేవా డని, పదేళ్ల కృషితో కలెక్టర్ అవుతున్నాడని గోపాలకృష్ణ తల్లిదండ్రులు ఆనందం వ్య క్తం చేశారు. తన తమ్ముడు మంచి అధికా రిగా రాణిస్తాడనే నమ్మకం ఉందన్నారు గోపాలకృష్ణ సోదరుడు కోదండరావు . -
అవినీతి అంతంలో ప్రజలను భాగస్వాములు చేస్తాం
ఏలూరు అర్బ¯ŒS : అవినీతిని అంతం చేయడంలో ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. ఈనెల 9న జరగనున్న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ శాఖ డెప్యూటీ జనరల్ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 9 వరకు నగరంలో అవినీతి వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా అవినీతి వల్ల సమాజానికి జరుగుతున్న హాని, అభివృద్ధి నిరోధకంగా మారడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సీఐ యు.విల్స¯ŒS మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కాలేజీలలో వ్యాసరచన, వకృ్తత్వపోటీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 9న ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. -
9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం
దానవాయిపేట(రాజమహేంద్రవరం) : సామాన్యుడి సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను వీఎల్ పురంలో ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ నరవ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అండగా వారి పక్షాన జక్కంపూడి ప్రజా వారధి పోరాటం సాగిస్తుందన్నారు. ఇందులో భాగంగానే వృద్ధుల కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అనంతరం జక్కంపూడి ప్రజా వారధి వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. లంక సత్యనారాయణ, కొమ్ముల సాయి, ధర్మవరపు శ్రీనివాస్, ఎస్. కృష్ణమూర్తి, మురపాక వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నియమబద్ధ పుష్కరస్నానమే ఫలదాయకం
మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ రాజమహేంద్రవరం కల్చరల్ : గోదావరి ఆది పుష్కరాల్లోనైనా, అంత్య పుష్కరాల్లోనైనా స్నానం చేయడం వలన మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. ‘పుష్కరస్నానం వినోదానికి కాదు. తీర్థస్నానాల విషయంలో మహర్షులు కొన్ని నియమాలను, సాంప్రదాయాలను ఏర్పాటు చేశారు. వాటిని ఆచరించినప్పుడే పుష్కరస్నాన ఫలితం లభిస్తుంది’ అన్నారు. గోదావరికి అంత్యపుష్కరాలు సమీపిస్తున్నందు పుష్కర స్నానానికి సంబంధించి ఆచార వ్యవహారాలను, శాస్త్రనియమాలను వివరించమని ‘సాక్షి’ కోరినప్పుడు ఇలా వివరించారు.. ‘నదీప్రవాహానికి అభిముఖంగా నిలబడి స్నానం చేయాలి. సాధారణంగా రాత్రి సమయాల్లో, భోజనానంతరం స్నానం నిషేధం. కానీ, మహానదుల విషయంలో–గ్రహణ, పుష్కరసమయాల్లో ఇటువంటి పట్టింపులు లేవు. గురు, శుక్రవారాలు, అధికమాసాలు, మూఢమి పట్టింపులు లేవు. పుష్కరదినాల్లో రాత్రివేళ ‘గౌతమీ మాహాత్మ్యము’ పారాయణ చేసి, మరుసటిరోజు పుష్కరస్నానం చేయడం ఒక సాంప్రదాయం. స్నానానికి ముందు గట్టుపై నిలబడి, మట్టిని తీసి, గోదావరి జలాల్లోకి ఈ కింది శ్లోకం చదువుతూ విసరాలి. ‘పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాం తే మయాదతా ్తమహారార్థం ప్రకల్పయా’ పై విధంగా చేయకపోతే, స్నానం చేసే వారి పుణ్యాన్ని ‘కృత్య’అనే శక్తి భక్షించి వేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గోదావరి జలాల్లో స్నానం ప్రారంభించాలి. ముందుగా గోదావరీమాతకు నమస్కరించి, ఆచమనం చేసి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ‘అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం, సింహం గతే దేవగురౌ, సార్థ త్రికోటి తీర్థసహిత తీర్థరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే’ సంకల్పం చెప్పాక సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చి, మరో సారి స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక షోడశోపచారాలతో గోదావరి నదీమతల్లికి పూజలు చేయాలి. యథాశక్తి దానధర్మాలు చేయాలి. ఆదిపుష్కర స్నాన ఫలితమే అంత్యపుష్కర స్నానంతోనూ వస్తుందనడంలో సందేహం లేదు.