
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా వంకదారి గోపాలకృష్ణను నియమించినట్లు ఆ విభాగం తెలంగాణ అధ్యక్షుడు సందమల్ల నరేశ్ ఆదివారం తెలిపారు. పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో ఈ నియామకం జరిగినట్లు ఆయన వివరించారు.