అవినీతి అంతంలో ప్రజలను భాగస్వాములు చేస్తాం | ERADICATION OF CURRUPTION | Sakshi
Sakshi News home page

అవినీతి అంతంలో ప్రజలను భాగస్వాములు చేస్తాం

Published Sun, Dec 4 2016 2:25 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ERADICATION OF CURRUPTION

ఏలూరు అర్బ¯ŒS : అవినీతిని అంతం చేయడంలో ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. ఈనెల 9న జరగనున్న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ శాఖ డెప్యూటీ జనరల్‌ ఆర్‌పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 9 వరకు నగరంలో అవినీతి వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా  అవినీతి వల్ల సమాజానికి జరుగుతున్న హాని, అభివృద్ధి నిరోధకంగా మారడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సీఐ యు.విల్స¯ŒS మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కాలేజీలలో వ్యాసరచన, వకృ్తత్వపోటీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ 9న ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement