లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల వయసు నుంచి పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్ ఇండియన్ నైటింగల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడిన ఈ ఇండియన్ నైటింగల్ తన గొంతుతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా చివరి వరకు స్టార్ గాయనిగా వెలుగువెలిగిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది.
ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది.
మరి ఆమె మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది సస్పెన్స్‌లో ఉండిపోయాయి. మరి దీనిపై ఆమె లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment