రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇక అప్పటి నుంచి తగ్గేదే లే అంటూ స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. హిందీలో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక ఏకంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో నటించే చాన్స్ కొట్టేసింది.
అలాగే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్, గ్లామర్‌తో నేషనల్ క్రష్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇలా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న ఆమె పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రంతో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. పరిశ్రమలో ఆమె సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆమె సంపాదించిన ఆస్తులు, తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. దీంతో ఆమె నికర సంపాదన, రెమ్యునరేషన్ వివరాల గురించి నెటిజన్లు, ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయలకు వరకు తీసుకుంటుందట.
ఇక ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటికి వరకు ఆమె సంపాదించిన నికర ఆస్తుల విలువ రూ. 37 కోట్లు. ఇక ఏడాదికి ఆమె సుమారు రూ. 5 మిలియన్లు(అంటే రూ. 21కోట్ల 65 లక్షలు) ఆర్జిస్తోంది. దీనితో పాటు ఇటీవల ఆమె ఖరీదైన రేంజ్ రోవర్ బ్లాక్ లగ్జరీ కారు కొన్న సంగతి తెలిసిందే. దీని విలువ కోటికిపైనే ఉంటుందని టాక్. కాగా 1996 ఏప్రిల్‌లో పుట్టిన రష్మిక వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. అతి తక్కువ కాలంలోనే నటిగా ఆమె ఇంత సంపాదించిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ మార్చి 4న విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment