గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చెర్రీ ఇవాళ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమలకు వెళ్లిన చెర్రీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బర్త్ డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ ఆస్తులపై నెట్టింట చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఆస్తుల గురించి సినీ ప్రియులతో పాటు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.
ఓ నివేదిక ప్రకారం మెగా హీరో రామ్ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్‌కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునే చెర్రీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారానే రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.
లగ్జరీ హోమ్
రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్‌కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
లగ్జరీ కార్లు
మన గ్లోబల్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్‌తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్‌కు ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment